చర్చ:పెరిక క్షత్రియులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురగిరి క్షత్రియులు అనేది ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కనిపించే ఒక కులము, ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 15 వ కులం. ఇది క్షత్రియ ఉప కులమని చెప్పవచ్చు. వృత్తిరీత్యా వీరు వ్యవసాయదారులు, భూస్వాములు. సంస్కృతంలో వ్యాపారక్ అను పదమునుండి పెరిక అను పదము వచ్చినదని పలువురి అభిప్రాయం.వీరిలో ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు. హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్ లో పెఱిక భవన్‌ లో ఈ కులస్థులకు వసతి కల్పించి విద్యావంతులను చేస్తున్నారు. పెఱిక వారిది వ్యవసాయ వృత్తి.


పురాణం[మార్చు]

ఫుర్వకాలంలో పెఱికల మీద సరకులు రవాణా చేసి అదే ముఖ్యవృత్తిగా జీవించే తెగలవారికి క్రమేణా "పెఱిక" అన్న పేరు కులనామంగా స్థిరపడింది. ఆది యుగాలలో క్షత్రియజాతికి చెందిన వీరు పరశురాముని ధాటికి ఎదురు నిలిచి యుద్ధంచేసే శక్తిలేక శివుని ప్రార్థించినట్లు, ఆయన ఆజ్ఞానుసారం ఎడ్లపై పెఱికలను వేసుకొని వాటితో వ్యాపారం సాగించారని పురాణాల పరంగా తెలుస్తోంది. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ పెఱిక వారిది వ్యవసాయ వృత్తి.


మహాభారతం ప్రకారం, బ్రాహ్మణుడైన పరశురాముడు ఆగ్రహంతో క్షత్రియ జాతిని సర్వ నాశనం చేసే కార్యక్రమం చేపట్టాడు. ఆ సమయంలో కొద్ది మంది క్షత్రియులు పిరికి తనంతో తాము వ్యాపారస్తులమని చావు నుండి తప్పించుకొన్నారు.అయితే వీరు పిరికి వారు,అబద్దాలాడేవారూ కాదు. కొద్ది మంది క్షత్రియులు తమ పదవులనుండి విరమణ పొందిన తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్క నివాసాలు ఏర్పరచుకొన్నారని, కాల క్రమేణా వారు పురగిరి క్షత్రియులుగా పిలువబడ్డారు. పురగిరి క్షత్రియుల పేర్ల చివర అన్న, అయ్య, రావు, రాయ, రాయుడు, వర్మ, రాజు అని ఉంటాయి.