Jump to content

చర్చ:ప్రాణహిత నది

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

'పోషయతీతి పుష్కరం'

ప్రాణహితనది అంటే పోషించేది పుష్కరం అని అర్థం. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి సంభవించే పవిత్ర నదీ పండుగ. శ్రేష్ఠము, పూర్ణము, సమృద్ధి అని అర్థాలు కూడా వున్నాయి. 'పూర్ణ: పురుష ఉచ్యతే' అన్న నిశుక్త వాక్యం ప్రకారం జలంలోని శక్తితో గురు పూర్ణుడిగా పురుషుని, అంటే మానవుని దిద్దేకాలం పుష్కరాలం. కాబట్టి పుష్కరమంటే పవిత్ర మొనర్చ బడినజలమని కూడా భావన.

బృహస్పతి ఒక రాశిని వదలి మరొక రాశిలో ప్రవేశించడం. బృహస్పతి ఒకరాశి నుండి ఇంకొక రాశికి వెళ్లేప్పుడు భూమి మీద ప్రవహించే పన్నెండు నదుల జలాలను శక్తివంతంగా ప్రభావితం చేస్తాడు. కనుక పుష్కరసమయంలో ఆయా నదులలో స్నానాదులు బుద్ది బలాన్ని పెంచుతాయి. వైదిక కార్య కలాపాల ద్వారా అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి.
'నవగ్రహాలలో ఒక గ్రహం బృహస్పతి', శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో గ్రహాలలో బృహస్పతిని నేనే అని చెప్పినందున బృహస్పతి శ్రీమహావిష్ణువు అంశ స్వరూపుడై, సకల దేవతలకు గురువు అయిన వాడు. బుద్ధిని కలిగించేది కాబట్టి గురువైన బృహస్పతిని ప్రార్థిస్తే బుద్ధి కుశలతోపాటు ఐశ్వర్య సిద్ధికూడా కలుగుతుంది.
ఒకనాడు ఇంద్రుడు, బృహస్పతి శివదర్శనార్థం ముని వేషదారులై కైలాసానికి బయలు దేరుతారు. శివుడు వీరిరువురిని పరీక్షించదలచి ఉగ్రరూపం ధరించి, దిగంబరుడై వీరి మార్గానికి అడ్డుగా నిలు స్తాడు. అప్పడు ఇంద్రుడు శివున్ని గుర్తించలేక అతనిపైకి వజ్రాయుధాన్ని ప్రయోగించబోగా శివుడతనిని భస్మం చేస్తాడు. ఆ దిగంబరుడే శివుడని గ్రహించిన బృహస్పతి శివుని స్తుతించి, ఇంద్రుని పునర్జీవున్ని చేయమని ప్రార్థిస్తాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్ల బృహస్పతికి జీవుడనే పేరు వచ్చిందని కథనం. అట్టి బృహస్పతి పుష్కరిని కలిసి 12 సంవత్సరాల కొకసారి పవిత్ర నదులను ఆవహిస్తాడు. అటువంటి పవిత్ర నదుల్లో 12 నదులు పుష్కర నదులుగా పేర్కొన బడుతున్నాయి.
ఇలా బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక్కొరాశిలో ప్రవేశించడం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పుణ్యజీవనది అధిష్టానమై ఉండడం, ఆ సమయంలో ఆయా పుష్కర నదుల్లో ముక్కోటి దేవతలు వసించడం జరుగుతుంది.ఇట్టి పుష్కర స్నానం పవిత్రనదిగా పురాణోక్తి.

జన్మ ప్రభృతి యాత్పాపం స్త్రీయా వాపురుషేణవా పుష్కరేస్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అంటే స్త్రీ చేతగాని, పురుషుని చేతగాని పుట్టి నప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానమాచరిస్తే తొలగి పోతాయని శాస్త్ర వచనం. ప్రాత:కాల పుష్కర స్నానం ఉత్తమమైనదనీ, ఉత్తమ ఫలితాల్నిస్తుందని, పుష్కర నదీ స్నానం వల్ల పాపహరణం, పుణ్యఫలమేకాక ఇహపర సాధకమని తెలియుచున్నది.

పుష్కర శ్రాద్ద క్రియవల్ల సద్గతులు కల్గుతాయనే ప్రగాఢ విశ్వాసం ఉండడం వల్ల పుష్కర కాలంలో చేయబడే తీర్థ శ్రాద్దంలో మాతా, పితరులకు, మాతామహిమాతా మహావర్గత్రయానికి, భాతృ, గురు లాంటి మరణించిన సంబంధులందరికీ పిండ ప్రదానం చేయడం పుణ్య ప్రదంగా శాస్త్రం ఘోషిస్తోంది. సాధారణ కాలంలో చేసే పితృకర్మల కంటే పుష్కర సమయంలో చేసే శ్రాద్ద ఫలితం అధికంగా ఉంటుందని, ఉత్తమ గతులీయగల సామర్థ్యం కలిగి ఉంటాయని చెప్పబడుతుంది.
సువర్ణ, రజిత, ధాన్య, భూదాన, వస్త్రం, లవణ, శాక, ఫలదానాలు, ఘృత, తైల, కర్పూర, కస్తూరి, చందన, కంబళ, సాలగ్రామ, పుస్తకదానాలు మిక్కిలి ప్రశస్తమైన దానాలు పుణ్య ప్రదంగా పుష్కర సమ యంలో చేయాలని పురాణాలు తెల్పుతున్నాయి.
పుష్కర పర్వం ప్రతినదికి సంవత్సర కాలం ఉంటుంది. కాని బృహస్పతి ప్రవేశకాలం నుండి మొదటి 12 రోజులు ప్రధాన పుష్కరమని, సంవత్సర మధ్యాన్ని మధ్య పుష్కరమని, ఆంత్యభాగాన్ని అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. పుష్కర నదులలో చేసే ఏ పవిత్ర కార్యమైనా సద్య: ఫలితాన్ని అను గ్రహిస్తుంది.
బృహస్పతి మీనరాశిలో ప్రవేశం జరగడంచే ప్రాణహితనదికి ఈసారి పుష్కరాలు సంభవించాయి.
ప్రణీతానదినే 'ప్రాణహిత' నదిగా పిలువబడుతుంది. ఈ నది సహాద్రి పర్వత శ్రేణుల్లో జన్మించి, వార్ధ, పెనగంగా, వైన్‌ గంగా అనే మూడు చిన్న నదులను కలుపుకొని ఏర్పడినది. ఈ నది ఆదిలాబాదు జిల్లా చెన్నూర్‌ వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాణహితనదీ తీరంలో కాళేశ్వర క్షేత్రం ఉన్నది. త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వర క్షేత్రం ముక్తేశ్వర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది.
ఈ క్షేత్రంలో ప్రణీతా, గోదావరి, అంతర్యాహినిగా సరస్వతి అను మూడు నదుల సంగమం. అయినందున దక్షిణ త్రివేణి సంగమం అని, దక్షిణ ప్రయాగ అని కూడా అంటారు.
మనోవాక్కాయ, కర్మలా అహింస ధర్మాన్ని పాటిస్తూ బాహ్య శుద్ధిద్వారా శరీర శుభ్రత, తద్వారా పవిత్రతను సమకూర్చే పుష్కరస్నానాన్ని మన సంప్రదాయంలో ఋషులు ప్రవేశపెట్టారు. పన్నెండు రోజుల పుష్కర సమయంలో పుష్కర నదుల్లో ఒకరోజైనా ప్రాణహితానదీ స్నానం చేసినా సంపూర్ణమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణోక్తి.
తీర్థ రాజ నమస్తుభ్యం సర్వలోకైక పానవ|
త్వయి స్నానం కరోమధ్య భవబంధ విముక్తయే||' 
అనే శ్లోకాన్ని పఠిస్తూ దుర్లభమైన మానవ జన్మను పొందాము కనుక ప్రాణహితానదీ పుష్కరిణిలో స్నానమాచరించి పునీతలమవుదాం!

Posted by తవ్వా ఓబుల్ రెడ్డి at 6:53 PM No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest

పుష్కర శోభలో ప్రాణహిత శ్రీ కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం/కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం' కాళేశ్వరమందు నివసించిననూ, కాళేశ్వరాన్ని చూసిననూ, కాళేశ్వరాన్ని స్మరించిననూ, జ్ఞానాజ్ఞాన జనితములు మనోవాక్కాయజములైన పాపాలన్నీ కూడా నశించి ముక్తీశ్వరస్వామి కృపవల్ల ముక్తి కలుగునన్నది సూక్తి. కాశీ నగరంలో మరణించిన ప్రాణులకు మాత్రమే కాశీవిశ్వేశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తే, కాళేశ్వరంలో నివసించు సకల ప్రాణులకు కాళేశ్వర ముక్తీశ్వరుడు ముక్తి ప్రసాదిస్తాడు.

అందుకే కాశీ క్షేత్రం కంటే కాళేశ్వరక్షేత్రం వరముల్లు వాసి ఎక్కువయని ప్రతీతి. గోదావరికి దక్షిణంలో తెలుగు నేలపై త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, తెలుగు నేల సరిహద్దుగా, యమునిచే స్థాపించబడి ద్విలింగ క్షేత్రంగా భాసిల్లుతూన్న కాళ్వేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయం కాళేశ్వర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
కరీంనగర్ జిల్లాలో జిల్లా కేంద్రానికి ఈశాన్యంలో 130 కి.మీ. దూరంలో వున్న మహదేవ్‌పూర్ మండలంలో ప్రాణహిత నది గోదావరిలో సరస్వతి సాక్షిగా సంగమించే త్రివేణీ సంగమక్షేత్రం కాళేశ్వరం. ప్రయాగ కూడా త్రివేణీ సంగమ క్షేత్రమే.
ప్రయాగ గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ క్షేత్రమైతే, కాళేశ్వర క్షేత్రంలో బ్రహ్మచే సృష్టించబడి సర్వతీర్థములకు ప్రధానమైన ప్రణీతానది, వరదానది, వింధ్యపర్వత శిఖరం నుంచి బయలుదేరిన శివప్రియమగు వైన్యగంగ, లోకపావని గౌతమీ నది, ప్రణీత గోదావరి నదుల గుప్తగామినిగా ప్రవహించుచున్న బ్రహ్మపత్నియగు సరస్వతీ నదియను ఐదు నదులు పంచగంగగా సంగమిస్తాయి.
కాబట్టే కాళేశ్వరం ప్రయాగకంటే గొప్పనైన పుణ్యక్షేత్రం. 'ఏరుల జన్మం శూరుల జన్మం ఎవరెరుగుదుర'న్నట్టు చిన్నచిన్న వాగులు, ఏరులై, సెలయేరులై, ఉపనదులై, జీవనదులై తమ ఉనికిని చాటుకుంటూ జనజీవన సౌభాగ్యానికి చేయూత నిస్తూంటాయన్నది జగమెరిగిన నిజం.
గోదావరి నదికి ఉపరితలాన ఎట్టి అడ్డు అదుపు లేకుండా నిర్మిస్తున్న ఆనకట్టల కారణంగా వర్షాకాలంలో తప్ప మిగిలిన సమయాల్లో గోదావరీ నది బలహీనమై, అక్కడక్కడ సన్నగిల్లి జీవనదిగా దాని ఉనికిని కాపాడుకోవడానికి తల్లడిల్లే పరిస్థితి ఏర్పడుతున్న సందర్భంలో గోదావరికి అండదండనిచ్చే ఎన్నటికీ ఎండిపోకుండా నిల్చిన సార్థకనామధేయ 'ప్రాణహిత'. గోదావరీనదికి ప్రధానమైన ఉపనది ప్రాణహితానది.
ఈ నదికే 'ప్రణీతా'నది యన్నది మరోపేరు. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల పవిత్రక్షేత్రం వేమనపల్లి నుంచి కోటపెల్లి మండంలంలోని సిర్స, అన్నారం, అర్జున గుట్ట ప్రాంతాలగుండా ప్రవహిస్తూ, కాళేశ్వరంవద్ద ఈ ప్రాణహితానది సరస్వతి సాక్షిగా గోదావరిలో సంగమిస్తోంది. ప్రజాకవి వేమన కొంత కాలం నివసించినట్లు చెప్పబడుతున్న ప్రస్తుత మండల కేంద్రం వేమనపల్లి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహితా నదీ తీరంలో గల ఒక పవిత్ర క్షేత్రం.
కాలగమనంలో నవగ్రహాలు తమ తమ కాల పరిమితికి లోబడి వివిధ రాశుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు, పంచాంగకర్తల గణాంకాలు చెబుతుంటాయి. అదే నేపథ్యంలో పన్నెండు నెలల పాటు ఒక్కో రాశిలో తిరిగే బృహస్పతి (గురువు) ఒక్కోరాశి ప్రవేశించినప్పుడు ఒక్కోనది 'పుష్కరిణి'గా దేశంలోని పన్నెండు నదులకు ఒక క్రమపద్ధతిలో పుష్కరాలను పురాతన శాస్త్రజ్ఞులు రూపొందించారు.
అందులో భాగంగానే గురువు మేషరాశి లో ప్రవేశిస్తే గంగానదికి, వృషభరాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి, మిథునంలోనయితే సరస్వతీ నదికి, కర్కాటకం లో యమునా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ నదికీ, కన్యలో ప్రవేశిస్తే కృష్ణానదికీ, తులారాశిలోనయితే కావేరీ నదికీ, వృశ్చికంలో తామ్రపర్ణీ నదికీ పుష్కరాలుగా భావిస్తారు. గురువు ధనస్సులో ప్రవేశిస్తే సింధూనదికీ, మకరంలో ప్రవేశిస్తే తుంగభద్రా నదికీ, కుంభంలో ప్రవేశిస్తే భీమరథీ నదికీ, మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహితా నదికి పుష్కరాలు వస్తాయి.
ప్రాణహిత, వరద, వైన్యా, గోదావరీ, సరస్వతీ నదుల సంగమక్షేత్రం పంచగంగగా పిలువబడుతుంది. అట్టి సంగమ క్షేత్రంలో మీనరాశిలో బృహస్పతి ఉన్న సమయంలో అంటే పుష్కరాల సమయంలో ముప్పదిమూడు కోట్ల దేవతలు కొలువుంటారు. పుష్కరాల సమయంలో స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, పితృ తర్పణంగానీ, పిండప్రదానం గానీ చేసినా సకల పాపాలు హరిస్తాయని పురాణోక్తి.
ఈ ప్రాణహిత నదీ పుష్కరాలు ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన స్వస్తిశ్రీ వికృతినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశీర మాసం, శుద్ధపాడ్యమి, బృహస్పతి గురువు మీనరాశిలో ప్రవేశించిన సందర్భంలో ప్రారంభమవుతాయి. పన్నెండు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే పుష్కరోత్సవ సందర్భంగా ఎంతోమంది భక్తులు ప్రాణహిత నదిలో పుష్కర స్నానాలు చేస్తారు.
'స్నాత్నేన సంగమేశంచ స్మృత్యా కాళేశ్వరేశివే/ పిండప్రదానం కర్తవ్యం పితౄణాం మోక్షదాయకం'

అన్నట్లు పిండితోగాని, అన్నం వండిగాని హిరణ్యశ్రాద్ధం, చిటికె శ్రాద్ధం, తీర్థశ్రాద్ధం చేసినట్లయితే పితరులు వున్నామ నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి చేరుకుంటారు.

పుష్కర సమయంలో పేదలకు, బ్రాహ్మణులకు, మనస్సులోప్రేమించే వారికి దానాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి. మొదటిరోజు, ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు, జొన్నలు); రెండవరోజు వస్త్రములు, ఉప్పు, గోవులు; మూడవరోజు శాఖములు, పళ్లు; నాల్గవరోజు నూనె, నెయ్యి, పాలు; ఐదవరోజు నాగలి, ఆవు, మహిష దానాలు; ఆరవరోజు పళ్లు, సెజ్జలు (మంచాలు), పీటలు, కుర్చీలు; ఏడవరోజు పెసర, కంది, మినుము, శనగ, బబ్బర, పప్పుధాన్యాలు;
ఎనిమిదవరోజు సుమంగళ ద్రవ్యాలు, గాజులు, పూలు, పసుపుకుంకుమ, చీరలు, సారెలు; తొమ్మిదవరోజు పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, రుద్రాక్షలు, పూజా సామాగ్రి; పదియవరోజు నవరత్నాలు, నగదు సొమ్ము; పదకొండవరోజు గో.భూ. తిలదశ దానాలు; పన్నెండవరోజు షోడశ దానాలు చేస్తే పుణ్య ఫలాలు లభిస్తాయి. అన్నింటికీ మించి తల్లిదండ్రులను, గురువులను, పేదవారిని, ఆకలితో ఉన్న ఆర్తజనులను ఆదరిస్తే కడు పుణ్యం లభిస్తుంది.
ప్రాణహిత, గోదావరి, సరస్వతీ నదుల సంగమక్షేత్రమై తెలంగాణలో విలసిల్లే ఒకే ఒక శైవక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది కాళేశ్వరం. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి జరిగే ప్రాణహిత పుష్కరాల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కాశేళ్వరక్షేత్ర నాయకుడు ముక్తీశ్వరుడు సకల శుభాలను కలుగజేయాలని అర్థిద్ధాం! ముక్తీశ్వరుణ్ణి ప్రార్థిద్ధాం!!
-డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.ఎస్.

Posted by తవ్వా ఓబుల్ రెడ్డి at 6:45 PM No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest

ప్రాణహితా నది పుష్కరాలు సకల ప్రాణులకు హితమైన నది ప్రాణహిత. ప్రాణహిత గోదావరి నదికి ఉపనది. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను రక్షిస్తూ, పుణ్య స్నానాలకు శ్రేష్ఠమైన పన్నెండు ముఖ్యనదుల్లో ఒకటి. బృహస్పతి మీనరాశిలో సంపూర్ణంగా ప్రవేశించే రోజున ప్రాణహితానది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో ప్రాణహితా నది సంగమిస్తోంది. గంగ, యమున, నర్మద, గోదావరి, కృష్ణానదులకు ఎంత ప్రాశస్త్యం ఉందో ప్రాణహిత అంతే ప్రాముఖ్యం సంతరించుకొంది. ప్రాణహిత నదిలో వరదా నది, పెన్‌గంగ, చికిలీ, పెద్దవాగు మొదలైన ఉపనదులు సంగమిస్తున్నాయి. వరదానది, పెన్‌గంగ రెండూ ముందుకు ప్రవహించి, ఆదిలాబాదు జిల్లా ధర్మసాగరం వద్ద, మహారాష్ట్రలోని 'ఆస్టి'లకు సమీపంలో కలసి ప్రాణహితగా మారిపోయాయి. ప్రాణహితా నది గురించి ఎన్నో విషయాలు పద్మ పురాణంలోను, అగ్ని పురాణంలోను, బ్రహ్మ పురాణంలోను, స్కాంద పురాణాంతర్గత కాళేశ్వర ఖండంలోనుమనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని గఢ్‌చిరోలి జిల్లా 'మూల్‌'కు 40 కి.మీ. దూరంలో మార్కొండ శిల్పాలు, ఆలయాలు ఎంతో పురాతనమైనవి. మార్కండేశ్వరుని ఆలయం 10, 11 శతాబ్దాల్లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. బ్రహ్మ, విష్ణు, శివుల ఆలయం ఉన్న ఈ 'మార్కొండ' ప్రాణహితా నది ఒడ్డున ఉంది. ఇక్కడ శివుడు మూడు ముఖాలు, నాలుగు కాళ్లు, ఎనిమిది బాహువులు గల విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. మహారాష్ట్రలోని 'ఆస్టి' వద్ద పెన్‌గంగ, ప్రాణహితల సంగమం కంటె ముందు పెండలవాడ ఆంజనేయ క్షేత్రం ఉంది. 'చేప్రాడ' ఆశ్రమం ఇక్కడే ఉంది. అవధూత కార్తీక మహారాజు నివాసం ఈ నదీ తీరంలోనే ఉంది. సత్సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మికత నిండిన భక్తిమార్గంలో ఎంతోమంది భక్తులు ఈ క్షేత్రాలను దర్శిస్తుంటారు. అక్కడి నుంచి దక్షిణంగా ప్రవహించి, ఆదిలాబాద్‌ జిల్లా దేవులవాడ, మహారాష్ట్రలోని 'సిరోంచ', మనరాష్ట్రంలోని 'కాళేశ్వరం' మధ్యన గోదావరి నదిలో ప్రాణహితా సంగమం జరుగుతోంది. కాళేశ్వరం వద్ద అంతర్వాహిని సరస్వతి కలవటంతో 'త్రివేణీ సంగమం'గా మారింది.

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం కరీంనగర్‌ జిల్లా మహాదేవపూర్‌ మండలంలో ఉంది. ఇక్కడే ఘనంగా ప్రాణహితా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పౌరాణిక కథనాల ప్రకారం పుష్కరుడు శివుని జలత్వ సిద్ధిని సాధించడం, బ్రహ్మ తన కమండంలో చేర్చుకోవడం, ఇంద్రుడు తనకు గౌతముని ద్వారా ప్రాప్తించిన సహస్రాక్షుడు అనే శాపాన్ని విముక్తి చేసుకోవడం కోసం దేవతలను ప్రార్థించి సిద్ధిపొందటం, ఆ తరవాత పుష్కరుడు ప్రతిఏటా ఒక్కో నదిలో బృహస్పతి వెంట ప్రవేశించడం, ముఫ్ఫై మూడు కోట్ల దేవతలు పుష్కర సమయంలో ఆ నదిలో నివాసం చేయడం వంటి ఎన్నో కథలు మనకు లభిస్తాయి. పుష్కర కాలంలో భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి ముక్తి కలిగించుకోవటం, దానధర్మాలు చేసి పాపవిముక్తులు కావడం, దైవదర్శనంతో పునీతులు కావటం వంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తారు. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై నిలిచిన కాళేశ్వర ముక్తేశ్వర లింగాలు భక్తులపాలిట కల్పవృక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తాయని భక్తుల నమ్మకం. - డాక్టర్‌ మాడుగుల భాస్కరశర్మ Posted by తవ్వా ఓబుల్ రెడ్డి at 5:14 PM No comments: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Pinterest

సకల ప్రాణులకు హితమైన నది ప్రాణహిత 2010,డిసెంబరు 6 నుంచి 17 వరకు పన్నెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. పుష్కరాల కోసం కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా తుమ్డిహేటి, వేమనపల్లి, అర్జునగుట్ట వద్ద ఏర్పాట్లు చేసింది. ప్రణీతావరదావైన్యా గౌతమీచ సరస్వతీ నద్యః పంచ వహంత్యత్ర ప్రయాగా త్కోటిశోధికం ప్రాణహితానది, వైన్య, వరద, సరస్వతీ నదులు గోదావరిలో సంగమించే క్షేత్రంలో స్నానమాచరిస్తే... త్రివేణి సంగమ క్షేత్రమైన అలహాబాదు (ప్రయాగ)లో స్నానం చేసిన దానికంటే కోటిరెట్లు అధికమైన ఫలం లభిస్తుందని స్కంధపురాణంలోని కాళేశ్వర ఖండం చెబుతోంది. అంతటి ప్రత్యేకత గల క్షేత్రం మన కరీంనగర్‌జిల్లాలోని కాళేశ్వరం.

పవిత్ర జీవనదీమతల్లిగా గుర్తింపు పొంది అధిక భాగం తెలుగు నేలలో ప్రవహిస్తున్న గోదావరి నదికి ప్రధాన ఉపనది ప్రాణహిత (ప్రణీత) నది. సహ్యాద్రి పర్వత శ్రేణులు ప్రాణహిత జన్మస్థలం. మహారాష్ట్రలోని అహెరి వద్ద పెన్‌గంగా నది వేయిన్‌ గంగాతో కలుస్తుంది. మరోవైపు వేయిన్‌ గంగా, వరదా నదీ ప్రవాహంతో కలిసి ప్రాణహిత నదిగా రూపుదిద్దుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల గుండా 130 కి.మీ.లు ప్రవహంచి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో సంగమిస్తుంది. ఎగువన నిర్మిస్తున్న ఆనకట్టలతో వర్షాకాలంలోనూ గోదావరమ్మ ఎండిపోతోంది. ఈ తల్లిని జీవనదిగా నిలిపేందుకు.. కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమించే ప్రాణహిత గోదారమ్మకు అండదండనిచ్చి ఎన్నటికీ ఎండిపోకుండా జలసిరులు పొంగిస్తూ తన పేరును సార్థకం చేసుకుంటోంది. కాళేశ్వరంలో క్రితంసారి 1999 జనవరి 12 నుంచి 23 వరకు ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. అలాగే 1991-92, 2003లో గోదావరి పుష్కరాలు, 2001లో సరస్వతి పుష్కరాలు జరిగాయి. ఈ క్షేత్రంలో పుష్కర స్నానమాచరించి ముక్తీశ్వరుణ్ని దర్శించుకుంటే వోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పుష్కర ప్రాశస్త్యం పురాణ గాథల ప్రకారం... పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం ఘోర తపమాచరించాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అందుకు పుష్కరుడు... జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమవుతున్నాయనీ నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుందనీ ఆలోచించి 'దేవా... నా శరీర స్పర్శచే సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడట. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాపవిముక్తులవుతారు' అని వరమిచ్చాడట. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు (బృహస్పతి) తనకూ పుష్కరత్వం ప్రసాదించమని బ్రహ్మను గురించి తపమాచరించగా అందుకు పుష్కరుడు అంగీకరించలేదు. పుష్కర, బృహస్పతులిద్దరికీ నచ్చజెప్పిన బ్రహ్మ వారిద్దరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాడట. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగానూ చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగానూ వ్యవహరించి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగ పుష్కరాలు నిర్వహిస్తారు. అలాగే వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మద, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీనది పుష్కరాలు... ఇదే కోవలో మీనరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేవే ప్రాణహిత పుష్కరాలు. ఆ సమయంలో బ్రహ్మాదిదేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు కాబట్టి ఆయా నదుల్లో స్నానాలాచరించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ... అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ భక్తుల విశ్వాసం. కాళేశ్వర క్షేత్రం

కాళేశ్వర క్షేత్రం కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో జిల్లా కేంద్రానికి 140 కి.మీ.ల దూరంలో ఉంది కాళేశ్వర క్షేత్రం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ(అంతర్వాహిని) నదులు కలిసే ప్రాంతం కావడంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి కెక్కింది. త్రివేణి సంగమంలో కలిసే పెన్‌గంగ, వరదా నదులను కలిపి పంచగంగ అంటారు. కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలుగా శివుడు ఇక్కడ ఒకే పానవట్టంపై కొలువుండటం విశేషం. ఇందులో ముక్తీశ్వరుని లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉండి.. వాటిలో ఎన్ని నీళ్లు పోసినా కనిపించకుండా పోవడం ఇక్కడి మరో ప్రత్యేకత. ప్రధాన దేవాలయానికి ఆగ్నేయ భాగంలో యమకోణం ఉంది. ఈ యమకోణం ముందు తలవంచి పడమర నుంచి తూర్పునకూ దక్షిణం నుంచి ఉత్తరం వైపూ దూరి బయటకు వస్తే పాపాలన్నీ పరిహారమవుతాయని భక్తుల నమ్మకం.

ప్రాణహిత నది గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి