చర్చ:భగవాన్ (చిత్రకారుడు)
స్వరూపం
Untitled
[మార్చు]భగవాన్ గురించి ప్రస్తుతం వివరాలు వెతుకులాటలో ఉన్నాను. త్వరలో మరిన్ని వివరాలు పొందుపరచగలను. ఈలోగా తెలిసిన సభ్యులు ఈ కార్టూనిస్ట్ గురించిన వివరాలను వ్యాసంలో పొందుపరచమని నా విన్నపం.--S I V A 17:17, 27 జనవరి 2009 (UTC)
- భగవాన్ పేరుతో కార్టూన్లు వేస్తున్నది వేరే వ్యక్తి అనుకుంటాను. ఆయన సొంత బ్లాగు http://bhagavancartoons.blogspot.com/ --Svrangarao 01:42, 28 జనవరి 2009 (UTC)
- నేను వ్రాస్తున్న వ్యాసం భగవాన్ అన్న పేరుతో వ్యంగ్య చిత్రాలు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు వేసిన క్యానం భగవాన్ దాస్ గారి గురించి. నాకు వారు వ్యక్తిగతంగా తెలుసు, ఆయన టైపురైటింగు ఇన్సిట్యూట్ లో టైపు నేర్చుకున్న అనేకమందిలో ఒకణ్ణి. ఆ పైన, నాకు వివరాలు, ఫొటో అంద చేసినది ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు. మరొక ప్రముఖ కార్టూనిస్ట్ బాబు గారు మరిన్ని వివరాలు పంపటానికి కృషి చేస్తున్నారు. ఒక కార్టూనిస్ట్ తెర మరుగైన తరువాత చాలా సంవత్సరాల తరువాత, అదే కలం పేరును మరొకరు వాడితే, ఆ పాత ఆయన లేరంటే ఎలాగ?? త్వరలో భగవాన్ గారు ప్రచురించిన కార్టూన్లను వెలికి తీసి వికీలోకి (తగిన కాపీ రైటు లైసెన్సు తో) అప్‌లోడ్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను.సభ్యులు తెలుసుకోగలరు.--S I V A 17
- 07, 28 జనవరి 2009 (UTC)
- వీరి కార్టూన్లు వేటపాలెం గ్రంధాలయంలో ఉన్నాయని సమాచారం. ఆ గ్రంధాలయానికి దగ్గరలో ఉన్న సభ్య్లులెవరైనా కొంత చొరవ చూపి, అక్కడకు వెళ్ళి కార్టూన్ల ప్రతులను (స్కాన్ లేదా ఫొటో) సంపాయించి, వికీలోకె అప్లోడ్ చేస్తే ఎంతయినా బాగుంటుంది. వీరి కుటుంబ సభ్యులనుండి అనుమతి విషయంలో సమస్య లేదు, ఎందుకంటే భగవాన్‌కు ముఖ్య స్నేహితుడు మరియు ప్రముఖ కార్టూనిస్ట్ బాబు గారు తెప్పించగలరు.--S I V A 01
- 07, 10 ఫిబ్రవరి 2009 (UTC)