Jump to content

చర్చ:భారతదేశంలో సెక్యులరిజం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Facebookలో నాకు పరిచయమైన స్నేహితులలో ఎక్కువ మంది ముస్లిం దేశాలకి చెందిన వారే కానీ వారిలో కొందరు నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికులు నరకంలో మంటలలో తగలబెట్టబడతారని ముస్లింల నమ్మకం కానీ ముస్లిం దేశాలలో కూడ బహిరంగంగానో రహస్యంగానో నాస్తిక ఉద్యమాలు నడిపేవారున్నారు. ఇక్కడ ఇస్లాం గురించి వ్యాసాలు ఎక్కువ ఉండడం చూసి ఇస్లాం పై పరిశోధనకి ఇది కూడ ఉపయోగ పడుతుందని ఇందులో ప్రవేశించాను. మీరు పెన్మెత్స సుబ్బరాజు గారి రచనలు చదివానన్నారు కాబట్టి మీ వ్యాసాల మీద కూడ దృష్టి పెట్టాను. నేను ఇస్లాం పై పరిశోధనలు చెయ్యడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో ఒక వీర ముస్లిం భక్తుడు నేను ఇంగ్లిష్ లో డిజైన్ చేసిన ఒక మార్క్సిస్ట్-లెనినిస్ట్ వెబ్ సైట్ చూసి నాకు కొన్ని మెయిల్స్ పంపాడు. అందులో మార్క్సిజాన్ని, ముఖ్యంగా చారిత్రక భౌతికవాదాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వ్రాశాడు. నేను అందులో ఇస్లాం పైన ఏ విమర్శ చెయ్య లేదు. గతితార్కిక భౌతికవాద శాస్త్రమైన మార్క్సిజానికి - భావవాద తత్వమైన ఇస్లాంకి మధ్య పొంతన కుదరదు. అయినా నేను ఇస్లాం పైన ప్రత్యేకంగా విమర్శలు చెయ్యలేదు. కానీ ఆ ముస్లిం భక్తుడు నన్ను తీవ్రంగా దూషిస్తూ మెయిల్స్ పంపాడు. అసలు ఖురాన్ లో ఏముందో తెలుసుకోవాలనే కోరిక అప్పుడు నాలో బలపడింది. అప్పట్లో నాకు ఖురాన్ గురించి తెలిసినది తక్కువ. హదిస్ గురించి నాకు ఏమీ తెలియదు. "ది శటానిక్ వర్సెస్" నవలలో ఖురాన్ లోని అసంగత విషయాల గురించి చదివిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. ఎలాగైనా ఇస్లాం గురించి నాకు మరింత పరిచయం చేసినందుకు థాంక్స్. ఈ మధ్య ఖురాన్ తెలుగు అనువాదం కూడా చదివాను. అది మీ ప్రభావం వల్లే.

  • మంచిది.కానీ మీరెవరో తెలపటానికి సంకోచం ఎందుకు? అకృత్యాలు హింస అన్ని మతాలలో ఉంది. హిందువులపై జరిగిన అకృత్యాలను చెబుతున్నారు.అంటే మీ ఉద్దేశం ఆ అకృత్యాలను ఈనాటి ముస్లిములు కూడా సమర్దిస్తున్నారనా ,చేస్తున్నారనా లేక వాటికి ఈనాటి ముస్లిములు కూడా బాధ్యులనా?అలాగైతే బౌద్ధులూ క్రైస్తవులు ముస్లిములపై జరిగిన అకృత్యాలను గురించీ చెప్పనివ్వండి.ఒకరి హత్యల్ని తప్పుల్ని మరొకరు ఎత్తి చూపుకుంటూ వ్యాసాలు కొనసాగిస్తారా? ప్రయోజనమేమిటీ? హింసావాద మతపిచ్చి మనిషి మానవత్వాన్ని వదిలి రాక్షసుడిగా మారేలా చేస్తుంది.హంతకుడు ఏ మతస్తుడైనా నేరస్తుడే.మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనండి.--Nrahamthulla 14:55, 8 డిసెంబర్ 2008 (UTC)

ఆ మధ్య ఒక కుర్దుల వెబ్ సైట్లో చదివాను డెన్మార్క్ లో ముహమ్మద్ ప్రవక్త పై ప్రచురించిన కార్టూన్ల గురించి. ఆ వెబ్ సైట్లో ఇలా వ్రాసారు "బైబిల్ లోనూ, ఇతర మత గ్రంథాలలో కూడా హింసావాద బోధనలు ఉన్నాయి కదా, ఇందులో కేవలం ముస్లింలని విమర్శించడం ఎందుకు" అని. ఆప్పుడు నాకు బైబిల్ లో మోషే విగ్రహారాధకుల్ని చిత్రహింసలు పేట్టి ఎలా చంపాడో గుర్తుకు వచ్చింది, ఆది శంకరాచార్యుడు నాస్తికుల్ని చిత్ర హింసలు ఎలా చిత్ర హింసలు పెట్టి చంపించాడో కూడా గుర్తుకు వచ్చింది. మతం చరిత్రలో చాలా సందర్భాలలో ప్రగతి నిరోధకంగా పనిచేసింది. కానీ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలలో మాత్రం ప్రగతి పాత్ర పోషించింది. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ఇప్పుడు కూడ కొంత మంది ఇస్లామిక్ మరియు క్రైస్తవ నాయకులు ఆంగ్లో-అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మిగిలిన విషయలలో మతం మనిషికి చేసిన మేలు చాలా తక్కువ.ముహమ్మద్ కి దేవదూత గేబ్రియల్ (జిబ్రయీల్) కనిపించడం, మోషే యహోవాతో మాట్లాడటం లాంటి కథలు వాస్తవికతకి చాలా దూరమైనవి. ఈ కథల్ని మీరు వ్యక్తిగతంగా నమ్మొచ్చు కానీ ఇవే అక్షర సత్యాలని మాత్రం వాదించొద్దు. 121.245.44.202

  • అవి నిజమో కాదో నాకు తెలిస్తేగా వాదించటానికి.ముస్లింలలో 72 రకాల అపవిశ్వాసాలున్నాయని నేనూ చెబుతున్నాను.వాటిపై విశదీకరణలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను అన్న నిసార్ బాయ్ నిష్క్రమించాడు.ఆయన ఉంటే మీసంగతి తేల్చేవాడు.

నా Facebook మిత్రులలో కూడా ఎక్కువ మంది పాకిస్తానీయులు మరియు తురుష్కులే. వాళ్ళకి ఇస్లాం మీద ఇంత బలమైన నమ్మకం లేదు. మరి వాళ్ళు కూడా అపవిశ్వాసులంటారా? వాళ్ళలో కొంత మంది వ్యక్తిగతంగా మత భక్తులైనా వాళ్ళలో సెక్యులర్ భావాలు కూడా కనిపిస్తాయి. నా మిత్రుడు ఆలీ సీనా గారికి కూడా సమాధానం చెప్పండి.

నేను కూడా ఒకప్పుడు ఇలాగే హిందూ మతం గొప్ప అనుకున్నాను. ముస్లింలు ఖురాన్ దేవుని సందేశం అని అనుకున్నట్టే నేను వేదాలు భగవత్ ప్రసాదితం అని నేను అనుకునే వాడ్ని. ఏ మతం చెందిన కుటుంబంలో పుట్టిన వారు ఆ మతమే గొప్ప అని అనుకుంటారు. నేను తురుష్క దేశంలో పుట్టి ఉంటే నేను ముహమ్మదీయ మతాన్నే నమ్మేవాడినేమో. మంగోలియాలో పుట్టి ఉంటే షామన్ మతాన్ని నమ్మేవాడినేమో. పుట్టుక, ప్రాంతం ఆధారంగా నమ్మకాలు, ఆచారాలని పాటించే సంకుచిత భావాల నుంచి నేను బయట పడ్డాను. హేతువాదులమని చెప్పుకునే కొందరే బయట పడడం లేదు. 121.245.24.100

తొలగింపు నిర్ణయం

[మార్చు]

ఈ వ్యాసంలో "తొలగించు" మూస చాలా కాలంనుండి ఉన్నది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కనిపించడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గనుక వోటింగ్ అవుసరం అని భావిస్తున్నాను. సభ్యులు గమనించవలసిన విషయం ఏమంటే ఈ వ్యాసం నచ్చకపోవడం అనేది తొలగించడానికి కారణం కారాదు. అది సభ్యుల వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. వికీ విధానాలకు వ్యతిరేకం అయితే మాత్రం వ్యాసాన్ని తొలగించాలి. దయచేసి మీ అభిప్రాయాలను, అందుకు కారణాలను క్రింద వ్రాయండి. సంతకం చేయడం మరచిపోవద్దు. --కాసుబాబు 11:15, 21 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


తొలగింపునకు అనుకూలం, కారణాలు



తొలగింపునకు వ్యతిరేకం కారణాలు
ఈ వ్యాసపు టైటిల్ బాగుంది, పరిచయం, మూల వస్తువులు, ఉదాహరణలు ఏమీ లేవు. ఆఖరులో సద్విమర్శలు వుండవచ్చు. అసమంజసమైన విమర్శాదృష్టికోణంతో ప్రారంభమైన ఈ వ్యాసం అందవిహీనంగానూ, సాహిత్యం మరియు విజ్ఞానలేమి కలిగి వుంది. తిరగరాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 15:08, 21 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు సమీక్ష

వ్యాసంలో ముఖ్యమైన విషయం లేదు. అసలు ప్రవేశిక లేదు. ఆధారాలు చూపలేదు. కాని అభ్యంతరకరమైనవి ఏవీ లేవు. ప్రస్తుతం వ్యాసం ఉంచవచ్చునని భావిస్తున్నాను. "తొలగించు" మూసను తీసివేస్తున్నాను --కాసుబాబు 19:41, 7 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]