చర్చ:భారతదేశం తాలూకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొత్తం 5684 తాలుకాలు/మండలాలు ఉన్నాయి :-) --వైజాసత్య 15:20, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


తర్జుమా గురించి[మార్చు]

గ్రామాల పేజీల తర్జుమాలో ఒక పొరపాటు చేశామని నాకు అనిపించింది. అదేమంటే ఇంగ్లీషు పేర్లను తొలగించడం. ఎందుకంటే వ్యాసం ప్రారంభంలో - వ్యాసం పేరు (english name) - ఉంచడం మన శైలిలో ఒక భాగం గదా!


ఉదాహరణ: Gurudaspur ను తర్జుమా చేసేప్పుడు ఇంగ్లీషు పేరు చెరపకుండా గురుదాస్‌పూర్ (Gurudaspur) అని ఉంచితే మెరుగని అనుకొంటాను. బాట్లద్వారా పేజీలు చేసేప్పుడు కూడా

'గురుదాస్‌పూర్  (Gurudaspur) ఫలానా రాష్ట్రం లో ఒక మండలం

అని చేయవచ్చును.

--కాసుబాబు 20:17, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చెప్పింది నిజమే. అలా ఆంగ్ల పేర్లను ఉంచడం వలన చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి. ఆంగ్ల పేర్లను కూడా ఉంచడం వలన బాటుతో వ్యాసాలన్నిటినీ నిర్వహించడానికి ఇంకొంచెం వెసులుబాటుగా ఉంటుంది. అయితే ప్రస్తుత ఈ వ్యాసంలో మొత్తమ్మన్ని పేర్లను తర్జుమా చేసిన తరువాత తెలుగు పేర్ల పక్కన ఆంగ్ల పేర్లను కూడా చేరుద్దామని అనుకున్నాను. కానీ అనువాదం చేస్తున్నప్పుడే ఆ ఆంగ్ల పేర్లను కూడా అలా ఉంచేస్తే బాగుంటుందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:32, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాసుబాబు గారి ఆలోచన చాలా బాగుంది. గ్రామాల పేజీలు చేసిన తర్వాత నా కనిపించింది ఏంటంటే ఈ గ్రామాలకు సెన్సెసు వాళ్లు ఇచ్చిన కోడ్ సంఖ్యను పేజీలో ఎక్కడో ఒకచోట అదృశ్యంగా నిక్షిప్తం చేసి ఉంటే ఆ తరువాత గణాంకాలు చేర్చటానికి మరళా 2011లో కొత్త గణాంకాలు వచ్చినప్పుడు వాటిని అప్డేట్ చెయ్యటానికీ సులువయ్యేదేమో అని అనిపించింది. --వైజాసత్య 22:19, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ప్రదేశ్ మండలాలు[మార్చు]

ఈ తాలూకాల ప్రాజెక్టులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ మండలాల గురించి ఏంచెయ్యాలనుకుంటున్నారు? వీటిని కూడా ఈ పేజీలో అనువదించాలా? (మొత్తం 5600+ తాలూకాలు ఉంటే ఆంధ్ర ప్రదేశ్ మండలాలే 1200+ ఉన్నాయి) --వైజాసత్య 22:51, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సత్యా గారికి భలే ముందు చూపు. సత్యాగారు ముందు ముందు వికీ లొ ఎన్ని మార్పులు రానున్నాయౌ. నాకు ఒక సందేహం ఈ తాలుకా ల జాబిత తయ్యారు ఆయ్యక మీరు కాని బాటు నడుపుతారా , దయచేసి చెప్పండి లేకపోతే ఈ రాత్రి కి నాకు నిద్ర పట్టదు. మీ సమయం ఎంత అయ్యింది. ఇంత రాత్రి కూడా కార్యకలాపాలు కానిస్తున్నారు. --మాటలబాబు 23:09, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఒరిస్సా తాలూకాలు[మార్చు]

ఒరిస్సా తాలూకాలను నేనిక్కడ సభ్యులు:వైజాసత్య/ఇసుకపెట్టె3 అనువదిస్తున్నాను..కాబట్టి ఒరిస్సాను నాకొదిలెయ్యండి :-) --వైజాసత్య 08:45, 9 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


అనువాదం[మార్చు]

చాలా కాలం స్తబ్దంగా ఉన్న పేజీని అనువదించడం మొదలుపెట్టి నిస్సార్ గారు మంచి పని చేస్తున్నారు. ఈ పేజీ ఒక ఉపపేజీలా కాకుండా "జాబితా పేజీ" వ్యాసంలా ఉండడం సరి అనుకొంటాను. తర్జుమా చేశాక మార్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:46, 24 డిసెంబర్ 2008 (UTC)

పేజీ విభాగాలు[మార్చు]

ఈ పేజీని ఓపెన్ చేస్తే చాలా నెమ్మదిగా తెరచుకుంటూ వుంది. అలాగే అనువదించి సేవ్ చేయాలంటేనూ చాలా సమయం తీసుకుంటూ వుంది. ఈ పేజీ చాలా పెద్దదిగా వున్నది, కావున, దీనిని విడగొట్టి కొన్ని పేజీలుగా తయారుచేస్తే బాగుంటుందా, సభ్యులు తెలుపగలరు.

ఉదాహరణకు ప్రస్తుత పేజీ : భారతదేశంలో అన్ని తాలూకాలు : ఇందులో రాష్ట్రాల వారిగా జాబితా లింకు చేర్చి, ప్రతి రాష్ట్రానికి ఒక పేజీ వుంటే బాగుంటుందా కొంచె సెలవివ్వండి. ఇలా చేస్తే గల లాభాలు; పెద్ద జాబితా కుదింపు ద్వారా మరింత స్పష్టంగా మారవచ్చు. పేజీలు ఓపెన్ చేసినపుడు సుళువుగా ఓపెన్ గావచ్చు. అహ్మద్ నిసార్ 06:14, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


నిస్సార్ గారూ! పై వ్యాఖ్యను నేనిప్పుడే చూశాను. జనవరిలో నేను సెలవులో ఉన్నాననుకొంటాను. పేజీని రాష్ట్రాల వారీగా విభాగాలు చేయడమే ఉత్తమం. సంబంధిత ఇతర వ్యాసాలు పరిశీలించి ఒకవారంలో విభజిస్తాను. --కాసుబాబు 18:51, 4 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు, అలాగే. అహ్మద్ నిసార్ 16:31, 7 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]