Jump to content

చర్చ:భాష

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

cancel

Please eloberate what that one word in this context means and also signup so that we know whom to talk to --వైఙాసత్య 15:24, 19 August 2005 (UTC)

  • భయపెడుతున్న భాష!

ఉద్యోగులకూ ఇంగ్లిషు పాట్లు-స్వల్పకాల కోర్సులు నిష్ఫలం-గ్రామీణులకు పెద్ద బెంగ ఒకప్పుడు భారతీయుల్ని ఇంగ్లిషు వారు 'విభజించి' పాలించారు. ఇప్పుడా పని ఇంగ్లిష్ చేస్తోంది. ఈ భాషపై పట్టున్నవారు చదువుల్లో, ఉద్యోగాల్లో రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోతుంటే.. లేనివారు ఎక్కడికక్కడే చతికిలపడుతున్నారు. కార్పొరేట్ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ వీరు తీవ్రమైన న్యూనతలోకీ జారిపోతున్నారు. దీనంతటికీ చిన్నతనం నుంచీ సరైన ఆంగ్ల బోధన లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. ఇంగ్లిష్ అంటే ఒకప్పుడు విద్యార్థులకు మాత్రమే భయం. కానీ ఇటీవలి కాలంలో చాలా మందిని ఇది జీవితాంతం వెన్నాడుతోంది. ముఖ్యంగా ఉద్యోగార్థులకు కునుకు పట్టనీయడంలేదు. ఇంటర్వ్యూల్లో, ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో ప్రతి చోటా ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరవుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ ఉండీ, కేవలం ఇంగ్లిష్‌లో వెనకబడిన కారణంగా పైకెదగలేకపోతున్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయడంతో రెండుసార్లు పదోన్నతి వచ్చింది. ఇప్పుడు మా సంస్థ తరపున పొరుగు రాష్ట్రాలకూ వెళ్తున్నా. కానీ, ఇంగ్లిష్ అంతగా రాకపోవడంతో సరిగా మాట్లాడలేకపోతున్నా. కేవలం ఇంగ్లిష్ రావడం వల్లే మా సహచరుడొకరు చాలా పేరు తెచ్చుకున్నాడు. చివరికి హోటళ్లలో వెయిటర్లు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే నాకు ఎంత నామోషీగా ఉంటుందో అంటున్నారు బీమా కంపెనీ ఉద్యోగి శివలింగం. ఎలాగైనా ఇంగ్లిష్‌ను దారిలోకి తెచ్చుకోవాలని ఓ 'స్పోకెన్ ఇంగ్లిషు కోర్సు'లో చేరారాయన. అలాగే ఇటీవలే నార్కట్‌పల్లి నుంచి వచ్చిన వెంకటేశ్ ఓ హెచ్ఆర్ ట్రైనీ ఇంటర్వ్యూకి వెళ్లాడు. అక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ యూ ఆర్ డూయింగ్ అనే వాక్యాల్లో వ్యాకరణం పరంగా ఏది సరైనదో చెప్పమంటే తేల్చుకోలేకపోయాడు. ఉద్యోగం చేజారింది. ఇలాంటి చిన్నచిన్న తేడాలను గుర్తుపట్టడం కూడా ఎందుకంత కష్టంగా మారుతోంది? దీనికి, చిన్నతనం నుంచీ సరైన ఆంగ్లబోధన లేకపోవడం, చుట్టుపక్కల ఈ భాష మాట్లాడే వాతావరణం కొరవడడం, తెలుగులో ఆలోచించి ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించడమే కారణం అంటున్నారు 'రమేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్' డైరెక్టర్ సంజయ్. వీటన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం లేకపోవటం పెద్ద అవరోధంగా నిలుస్తోంది. నల్గొండలో ఎంబీఏ చేశా. ఇంటర్వ్యూల్లో ఇంగ్లిష్‌లోనే వివరాలు చెప్పమంటున్నారు. మాట్లాడితే ఎక్కడ తప్పులు దొర్లుతాయేమోనని, నవ్వుతారేమోనని భయం అంటున్నాడు 26 ఏళ్ల ఎం.శ్రీనివాస్. ఇలా ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్‌లో నైపుణ్యం కొరవడడం వల్ల.. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో 65%-75% మంది, ఇతర అభ్యర్థుల్లో 83% మంది ఎంపిక కావడం లేదని 'నాస్కామ్స్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్' కూడా తేల్చింది. వీరందరికీ ప్రస్తుతం ఆంగ్ల భాషణ శిక్షణ సంస్థలే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ విద్యార్థులే ఎక్కువగా చేరేవాళ్లు. కానీ ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నవారిలో 95% మంది ఉద్యోగార్థులే అంటున్నారు హైదరాబాద్‌లో రామకృష్ణమఠం నడిపే లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి అనుపమానంద. ఇంగ్లిష్ కోసం ఏటా 12 వేల మంది ఈ సంస్థను ఆశ్రయిస్తుండడం విశేషం. మరో సంస్థ రస్సెల్స్‌లో కూడా స్పోకెన్ ఇంగ్లిషు కోసం వచ్చేవారి సంఖ్య ఏటా 25% పెరుగుతోంది. గత రెండేళ్లలో పరిస్థితి చాలా మారిందంటున్నారు సంస్థ ప్రతినిధి. ఇప్పుడు చాలా సంస్థలు 'కార్పొరేట్ ఇంగ్లిష్', సాఫ్ట్ స్కిల్స్ కలిపి నేర్పించే కోర్సుల మీద దృష్టిపెడుతున్నాయి. చిన్నతనం నుంచీ పిల్లలకు స్కూళ్లలో సరైన ఆంగ్లబోధన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ భాషనైనా పూర్తిస్థాయిలో నేర్చుకోవడానికి ఆరేళ్లు చాలు. అందుకే మన దగ్గర పదో తరగతి దాకా తృతీయ భాషగా ఉన్న ఇంగ్లిష్‌ని ఇంటర్మీడియట్‌లో ప్రథమ భాషగా చేశారు. అంటే 5 నుంచి పదోతరగతి పూర్తయ్యేసరికి ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధిస్తారన్నదే మూల భావన. కానీ, ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పదో తరగతిలో 90% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఇంటర్‌లో ఇంగ్లిష్ అంటేనే బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ విద్యాసంస్థల్లో బోధనా సౌకర్యాలు కొరవడడం, నైపుణ్యంగల ఉపాధ్యాయులు లేకపోవడం, పిల్లలు కూడా ఆ సమయంలో ఇంగ్లిషు ప్రాధాన్యాన్ని అంతగా గుర్తించకపోవడం ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు స్వామి అనుపమానంద. ఇలాంటి వాతావరణంలో చదువుకున్నవారే డిగ్రీ పూర్తయినా ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లిష్ కారణంగా బోల్తా పడుతున్నారు. వెంటనే నేర్చేసుకోవాలని 'క్రాష్ కోర్సుల'ను ఆశ్రయిస్తున్నా.. నిజానికి అప్పటికప్పుడు ఇంగ్లిషు మాట్లాడడం అసాధ్యం. స్వల్పకాలిక కోర్సుల వల్ల అభ్యర్థులకు వచ్చేది నాలుగు ఇంగ్లిషు పదాలే తప్ప భాష కాదు అన్నది నిపుణుల వాదన. అందుకే వీరిలో చాలా మంది అక్కడా ఇమడలేక ఆ కోర్సులను మధ్యలోనే మానేస్తుంటారు. నేను మూణ్నెళ్ల స్పోకెన్ ఇంగ్లిషు కోర్సులో చేరా. గ్రామర్ అర్థమవుతున్నట్టున్నా మాట్లాడటం రాలేదు. ఇక నా వల్ల కాదని మానేశా అంటున్నారు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీహరి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నతనం నుంచీ ఇంగ్లిష్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో పత్రికలు, పుస్తకాలు చదవడం, బాగా వినడం, తోచిన ఆలోచనలను సొంతంగా రాయడం, బెరుకులేకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.(ఈనాడు15.10.2008)

భాష గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:భాష&oldid=3259046" నుండి వెలికితీశారు