Jump to content

చర్చ:భైరవయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మన్మోహన్ సహాయ్ పేరు ఎందుకు?

[మార్చు]

భైరవయ్యగా చాలా ప్రసిధ్ధి చెందిన రచయిత అసలు పేరు మురుకుట్ల మన్‌మోహన్ సహాయ్. ఇంటిపేరు చూస్తే సాంప్రదాయక బ్రాహ్మణ కులంలో పుట్టినట్టు తెలుస్తున్నది. అటువంటి ఆయనకు ఆయన తల్లి తండ్రులు మన్‌మోహన్ సహాయ్ పేరు ఎందుకు పెట్టారు, లేదా ఆయనే తల్లి తండ్రులు తనకు పెట్టిన పేరు తీసేసుకుని, దిగంబర రచనా ఉద్యమంలోకి దిగినతరువాత ఈ పేరు పెట్టుకున్నారా? ఈ విషయంలో పక్కాగా సమాచారం సంపాయించి వ్రాయాలి.

తరువాత అద్భుతమైన కథలు వ్రాశారు. ఆయన రచనా శైలి చూస్తుంటే అమరావతి కథల శైలి గుర్తుకు వస్తుంది. ఆయన ప్రస్తుతం జీవించి లేరని తెలుస్తున్నది. వారు మరణించిన సంవత్సరం కూడా తెలియదు. ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలుపుతూ వ్యాసాన్ని పరిపుష్టం చెయ్యాలి.

నాకు తెలిసి ఉంటే నేను వ్రాద్దును. నాకూ తెలియదు. కనీసం, ఏఏ వివరాలు ఉండాలో అన్నా వ్రాద్దామని ఈ చర్చ మొదలుపెట్టాను. 115.98.112.33 04:39, 31 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]