చర్చ:మన్వంతరం
స్వరూపం
విలీనం
[మార్చు]మనువు వ్యాసాన్ని ఈ మన్వంతరము వ్యాసంతో విలీనం చేయడమైనది. కాని మనువు వ్యాసంలో మనువుల పేర్లు కాస్త తేడాగా (క్రింద ఇచ్చినట్లుగా) ఉన్నాయి. సరైన ఆధారాలు దొరికితే వీటిని సరిదిద్దగలరు.
- కాసుబాబు గారు ఇది మీరే వ్రాశినట్లు ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు రాయకండి ఇవి మీకు శోభనివ్వవు..(సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!)సరైన ఆధారాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు... సరైన అధారాలు లేకుండానే మీరు రామాయణం గురించి క్లుప్తంగా అంతఅందంగా వ్రాశారా...--మాటలబాబు 21:40, 3 జూన్ 2007 (UTC)
- ఎందుకుండవూ ఫలానా ఉపనిషత్తో ఫలానా పురాణాల ప్రకారం ఇవి మనువులపేర్లు అయితే ఈ ఈ పురాణాల్లో ఈ విధముగా ఇచ్చారు అని అధారయుక్తంగా రాయవచ్చు.--వైఙాసత్య 02:35, 4 జూన్ 2007 (UTC)
ఒక కల్పంలో మొత్తం 14 మన్వంతరాలుంటాయి. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. 14 మంది మనువుల పేర్లు:
- స్వాయంభువు
- స్వారోచిషుడు
- ఉత్తముడు
- తామసుడు
- రైవతుడు
- చాక్షుసుడు
- వైవస్వతుడు (ప్రస్తుత మనువు)
- సూర్యసావర్ణి
- దక్షసావర్ణి
- బ్రహ్మసావర్ణి
- ధర్మసావర్ణి
- రుద్రసావర్ణి
- రౌచ్యుడు
- భౌచ్యుడు
యుగాలు
[మార్చు]యుగాలు కాలములగూర్చి, వాటి కాల పరిమాణాలను ఇంత విశ్లేషణాత్మకంగా, ఇంత క్లియర్‌గా అర్థమయ్యేలా, బహుశా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తలూ లేదా ధార్మిక వేత్తలు వ్రాసి వుండరేమో! మానవుని మేథస్సు అంచులు తాకే ఈ విషయము మరియు విషయ సంగ్రహణ బహు అరుదైన గొప్ప విషయమనడంలో ఎలాంటి సంకోచమూలేదు. వ్యాసకర్త మరియు కృషి చేసినవారందరూ అభినందనీయులే. అహ్మద్ నిసార్ 12:59, 31 మే 2009 (UTC)