Jump to content

చర్చ:ముదిగొండ వీరభద్రయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తొలగింపు మూస గురించి

[మార్చు]

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, వాడుకరి నిన్న (అక్టోబరు 7న) కొత్తగా ఖాతా సృష్టించుకొని ఈ వ్యాసం రాశారు. మీరు ఈరోజు (అక్టోబరు 8న) ఈ వ్యాసానికి తొలగింపు మూస పెట్టారు. ఈ వాడుకరికి వికీ నియమాల గురించి తెలియకపోయి ఉండవచ్చు. కానీ, వ్యాసంలో చాలా సమాచారం ఉంది. అది చూడకుండా మనం తొలగిస్తే మంచి సమాచారం కోల్పోయే అవకాశం ఉంది. పైగా వ్యాసం సృష్టించి ఒకరోజు కూడా గడవకుండా ఇలా వ్యాసం మీద చర్యలు తీసుకోవడం బాగోదు. అనుభమున్న వాడుకరి పదేపదే ఇలాంటి వ్యాసాలు సృష్టిస్తే అలాంటి వ్యాసాలమీద తక్షణ చర్యలు తీసుకోవచ్చుగానీ, కొత్తవాడుకరులు సృష్టించిన వ్యాసాలకు (వ్యాస నాణ్యతను, సమాచారాన్ని బట్టి) కొంత గడువు ఇస్తే బాగుంటుంది. ఇలాంటి సందర్బాల్లో వాడుకరి చర్చాపేజీకి వికీ నియమాల గురించి రాస్తూ వ్యాసాన్ని అభివృద్ధి చేసేలా సూచనలు చేయడమో, మంచి సమాచారం ఉన్న వ్యాసాలను, వికీలో ఉండవలసిన వ్యాసాలను మనమే వికీ నియమాలకనుగుణంగా మార్చడమో చేయాలి.

వాడుకరి:కరుణశ్రీ గారూ, వికీలో వ్యాసాలు రాయడానికి కొన్ని వికీ శైలీ, నియమాలు ఉన్నాయి. వాటికోసం చర్చాపేజీ చూడగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:34, 8 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ గారు, కొత్త వాడుకరికి వారి చర్చాపేజీలో నియమాలు ఉన్నాయి. అని నిన్ననే నేను సూచనలు చేశాను వారి నుండి ఎలాంటి జవాబు రాలేదు కాకపోతే కొద్ది సమయం 24 గంటలు మాత్రమే గడిచింది కానీ తొలగింపు మూసలో కూడా విశేష వ్యాసం అని కూడా చేర్చాను. గమనించగలరు. వారిని భయపెట్టే ఉద్దేశం నాకు లేదండి, కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని నా కూడా మూసను చేర్చిన తర్వాత అనిపించింది. ధన్యవాదాలు. అయితే ముదిగొండ వీరభద్రయ్య గారి లింకుల కోసం నేను వెతికాను పుస్తకాలు రచించిన వాటి మీద వారి పేరు కనిపిస్తుంది, కానీ ఏ వెబ్ సైట్ నుండి పేపర్లో గాని లింకులు లేవు, ఆ లింకు లన్ని బ్లాగులకు దారితీస్తూఉన్నట్టు గమనించి ఈ మూస పెట్టాను. కొంత సమాచారం ఉన్న కొత్త వ్యాసాలకు ఇకనుండి గడువు ఎంత ఇవ్వాలి అనేది మీరు చెప్పలేదు. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)12:06, 8 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారు, వ్యాసములో ఆచార్య పదం తొలగించి నందుకు ధన్యవాదాలు తొలగింపు మూస పెట్టడానికి అదికూడా చిన్న కారణం, వ్యాసం విస్తరించినందుకుగాను తొలగింపు మూస వెనక్కి తీసుకుంటున్నాను. వ్యాసం చాలా బాగా విస్తరించారు. మరోసారి ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)17:24, 8 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]