చర్చ:యాదమరి/ఇంద్రపురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాదమరి చిత్తూరు జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం.ఈ ఊరికి ఇంద్రపురి అని పురాణ ప్రసిద్ది చెందిన మరో పేరు కూడా ఉంది. ఈ ఊరిగురించి ప్రస్తావన స్కాందపురాణంలో కనపడుతుంది. ఈ ఊరు నీవా నది ఒడ్డున ఉంది. ఇక్కడ మూడు చిన్న నదులు ఒకచోట కలిసి త్రివేణి సంగమంగా అలరారుతున్నది. ఇక్కడ ప్రాచీనమైన ఆలయాలు మూడు ఉన్నాయి అవి: 1.వరదరాజస్వామి ఆలయం,2. కోదండరామస్వామి ఆలయం,3. శివాలయం. ప్రతి సంవత్సరం మే/జూన్ నెలల్లో పది రోజులపాటు శ్రీ వరదరాజస్వామివారికి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా వైభవోపేతంగా జరుగుతాయి. తిరుమలలో వెంకటేస్వరస్వామికి, తమిళనాడులోని కంచి వరదరజస్వామికి జరిగే ఉత్సవాల లాగే ఉంటాయి. ఈ అలయాలలో మరో ప్రత్యేకత-మూలవిరాట్టులు వరదరాజస్వామి, కోదండరామస్వామి యిద్దరూ పచ్చిమాభిముఖులై ఉంటారు.కోరిన కోర్కెలు తీర్చేస్వామి కావున వరదరాజస్వామిగా ప్రసిద్ది చెందాడు. ఈ గుడిలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి.

యాదమరి/ఇంద్రపురి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి