చర్చ:రసాయన శాస్త్రం
Jump to navigation
Jump to search
అణువు, బణువు, పరమాణువు
[మార్చు]- ఈ వ్యాసంలో "బణువు" అనగా molecule అని "అణువు" అనగా atom అని రాశారు.
- నేను చిన్నప్పుడు చదువుకొన్నపుడు "అణువు" అనగా molecule అని "పరమాణువు" అనగా atom అని ఉన్నట్లు గుర్తు.
ఎవరైనా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో వాడుతున్న తెలుగు పుస్తకాలు చూసి ఏది సరైనదో నిశ్చయించ గలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:53, 4 మే 2008 (UTC)
- "అణువు" అంటే molecule అయినప్పుడు
- అణుబాంబు = molecular bomb
- అణుశక్తి = molecular energy
- అణువిద్యుత్ కేంద్రం = etc.
- వగైరాలు అవాలి.
ప్రస్తుతం మనకి తెలుగులో sub atomic particles (like electron, proton, neutron), atom, molecule, mega molecule (like hemoglobin and many other biological molecules) వంటి ఇంగ్లీషు మాటలకి సర్వసమ్మతమైన తెలుగు మాటలు లేవు. బణువు అనే మాటని తెలుగు భాషా పత్రికలో ప్రయోగించేరు. అదే నేను వాడటం మొదలు పెట్టేను. మనకి ఒక కొత్త పేరు కావాలి. బణువు అనేది ఆ కొత్త పేరు. మీరు ఆంధ్ర ప్రదేశ్ ఎంత వెతికినా తెలుగు భాషా పత్రికలోనూ, నేను రాసే రాతలలోనూ తప్ప ఇంక ఎక్కడా కనబడదు- Vemurione 19:36, 4 మే 2008 (UTC)
- ఇదే మీకు వీరతాడు! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:52, 4 మే 2008 (UTC)
- అణువు = atom ; పరమాణువు = sub-atom లాగానూ స్ఫురిస్తాయి, మరియు అణువు మరియు పరమాణువు ఒకేలాగానూ అనిపిస్తాయి,
- ఉదాహరణకు అణుసంఖ్య లేదా పరమాణుసంఖ్య = atomic number (sub-atomic number అని అనం) ; అణుభారం లేదా పరమాణుభారం = atomic weight (sub-atomic weight అని అనం). మరి Molecule కు తెలుగులో సరైన పదం యేది అన్నప్పుడు, వేమూరి గారి (coining = క్రొత్తపేరు) 'బణువు' చక్కగా సరిపోతుంది. nisar 20:27, 4 మే 2008 (UTC)