చర్చ:రామాపురం (రేవూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాపురం , సూర్యాపేట,జిల్లా, మేళ్లచెరువు మండలానికి చెందిన గ్రామము.రామాపురం మేళ్లచెరువు మండలంలోనే రెండవ అతి పెద్ద గ్రామము. రామాపురం నందు ప్రభుత్వ పాఠశాల (శిశు తరగతి నుండి పదవ తరగతి వరకు) కలదు. అంతే గాక ఇంకా ప్రైవేటు పాఠశాలలు కూడ కలవు. రామాపురం కు తూర్పు భాగం లొ సున్నపురాయి వేలఎకరాల్లో పరచుకుని ఉంది. ఒకపుడు... ఆ భూములు పశువులకు మేతకోసం ఉపయోగపడేవి. ఇపుడు సింమెంట్ పరిశ్రమల ఆధీనంలోకి వెళ్లాయి. తూర్పు భాగంలో ఉన్న నల్లరేగడి భూములే రామాపురం కు ప్రధాన వ్యవసాయ క్షేత్రం. అంటే... మాగాణి భూములు లేవని కాదు... ఊరు పక్కే ప్రవహించే న్సాగ్ర్ార్జున సాగర్ ఎడమ కాలవ ఆసరాగా వందల ఎకరాల్లో వరి పండుతుంది. మరో విషయం ఏంటంటే.... రామాపురం కు వందల ఎకరాల చెరువు ఉంది. ఊరి జనానికి ఉపయోగ పడుతోంది. చెరువు కింద మాగాణి ఉంది చెరువు గట్టు మీద ఒక ఆంజనెయ స్వామి గుడి ఉంది. ఇక రామాపురం లో ఉన్న సామాజిక పరిస్థితులు చుట్టుపట్టు మరే ఊరిలో ఉండవు. నైజాం కాలం నుంచి.... ' మొహర్రం ' కుల, మతాల తేడాల్లేకుండా ప్రజలందరూ పండుగను జరుపుకుంటారు. పీర్లపండక్కి అందరి ఇళ్లలో కోడిపలావు ఘుమఘుమలే మరి. అందుకే రామాపురం అంటే... ఓ సెక్కూలర్ కంట్రీ కిందనే లెక్క . రామాపురం చుట్టూ సిమెంట్ పరిశ్రమలు (ప్రియా,భీమ,) వెలిసినవి. ఊరిలో పుట్టి ఇంటర్నేషనల్ లెవల్లో ఉన్నపెద్దలూ ఉన్నారు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హైలెవల్లో బతుకుతున్న సంపన్నులూ ఉన్నారు.రామాపురం లొ దాదాపు ప్రధాన వీధులన్నీ సిమెంటు వీధులుగా మార్చబడ్డాయి.గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం అమలులో ఉంది. గ్రామంలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు కలవు. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిల సౌకర్యం కల్పించటం కూడా జరిగింది.రామాపురం గ్రామంలో రామాలయం,వినాయకుని గుడి,సాయి బాబా గుడి, ముత్యాలమ్మ గుళ్లు కలవు. ఈ గ్రామంలో హిందూ దేవాలయాలతో పాటు ఒక మసీదు, చర్చి లు కూడా కలవు.అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, శివరాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశికి రామాలయంలో 24 గంటల హరే రామ సంకీర్తన చేస్తారు. శ్రీ రామ నవమికి శ్రీరాముని కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు.హిందువుల పండుగలే కాక ముస్లిం సోదరులు రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ లను క్రైస్తవ సోదరులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లను జరుపుకొంటారు.ఈ గ్రామం జాతీయ రహదారి-65 కి 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది.