Jump to content

చర్చ:రామాయణ విషవృక్షం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నాకు తెలిసినంతవరకు, విశ్వనాధ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం వ్రాస్తే, ముప్పాళ రంగనాయకమ్మ ఆ గ్రంధ విమర్శగా రామాయణ విషవృక్షం వ్రాసింది. ఆ తరువాత విష వృక్ష ఖండన కూడ ఇతరులు వ్రాశారు. రామాయణ విష వృక్షానికి, భూస్వామ్య వ్యవస్థకు సంబంధం ఎక్కడనుంది వచ్చింది??--SIVA 11:45, 25 డిసెంబర్ 2008 (UTC)

విశ్వనాథ సత్యనారాయణ బ్రాహ్మణ భూస్వామ్యవాద రచయిత. రామాయణం నేర్పించేది భూస్వామ్య సంస్కృతే. నేను రామాయణం ఆంగ్లంలో చదివాను. రామాయణ విషవృక్షం గ్రంథం తెలుగులో చదివాను. రాముడు శంభూకుడు లాంటి శూద్రుల్ని చంపడాన్ని ఉదహరించేటప్పుడు కూడా రంగనాయకమ్మ వ్రాసారు రామాయణం నేర్పేది భూస్వామ్య నీతేనని.


రామాయణ విషవృక్షం నేనూ చదివాను. ఎక్కడో ఒకచోట భూస్వామ్య నీతి అని ఉండవచ్చును గాక. "భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా" ఆ పుస్తకం వ్రాసినట్లయితే ఆ వాక్యాన్ని యధాతధంగా ఉదహరించండి. రచయిత్రి వ్రాసిన సుదీర్ఘమైన ఉపోద్ఘాతంలో ఆ పుస్తకం తానెందుకు వ్రాస్తున్నదో వివరించారు చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:05, 25 డిసెంబర్ 2008 (UTC)

అబద్దాలు చెప్పకు. నువ్వు ఈ పుస్తకంలో ఒక్క ముక్క కూడా చదవలేదు. ఇంట్రొడక్షన్ లోనే రంగనాయకమ్మ వ్రాసారు "రామాయణం నేర్పించేది భూస్వామ్య సంస్కృతేనని". సంస్కృతి, నీతి ఒక దానికొకటి విడదీయలేని సంభందం ఉన్నవి. ఈ విషయం కూడా తెలియనట్టు నటిస్తూ పచ్చి అబద్దాలు వ్రాయడం ఎందుకు? రంగనాయకమ్మ హిందూ పురాణాలతో పాటు గ్రీక్ పురాణాలు కూడా చదివారు. అన్ని మతాలు, పురాణాలు నేర్పించేది భూస్వామ్య సంస్కృతేనని రంగనాయకమ్మే వ్రాసారు. ఒక పాఠకురాలు రంగనాయకమ్మకి ఉత్తరం వ్రాసారు. మత గ్రంథాలలో ఇంత మురికి ఉందని తనకి తెలియదని, తన పిల్లలు కూడా ఈ గ్రంథాలు చదివి మురికి భూస్వామ్య సంస్కృతి నేర్చుకుంటారని భయంగా ఉందని ఆమె అన్నారు. కొంత మందేమో నిజం మాట్లాడకు, పరువు పోతుంది అన్నట్టు రామాయణం గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు.

అట్లాగా!? మరి ఈ వ్యాఖ్య వ్రాసినవారు పేరు వ్రాసుకోవటానికి భయమెందుకో?? ఏదో కొన్ని పడికట్టు మాటలు నోట బిగించి విమర్శలకు దిగటం భావ్యం కాదు భూస్వ్యామ్య వాదం,బూర్జువా అని మాట్లాడటం 1960లలో, 70లలో కొంతమందికి ఫ్యాషన్‌గా ఉండేది.--S I V A 14:46, 15 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ సత్యనారాయణ రాసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షానికీ, ఈ రామాయణ విషవృక్షానికీ ఎలాంటి సంబంధమూ లేదు. పేరులో కాంట్రాస్టు మూలంగా మొదటిదానికి రెండోది విమర్శ అని కొందరు పొరబడుతుంటారు. రామాయణ విషవృక్షం పుస్తకం విశ్వనాథ రామాయణంపై కాదు; వాల్మీకి రామాయణంపై చేసిన విమర్శ. - Venu Ch.