చర్చ:విపశ్యనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాళీ భాషలో "విపస్సనా" (VIpassanā) అని, సంస్కృత భాషలో "విపశ్యనా" (Vipashyanā) అని వ్యవహరిస్తారు. పాళీ భాషలోని "విపస్సనా" పదమే అసలు సిసలు పదం. ఇది ఉచ్చరణా వ్యవహార క్రమంలో "విపాసన" (Vipasana) గా మారింది. ఒక భాషలోని పేర్లు ఇంకొక భాషలోనికి పిలవాల్సి వచ్చినపుడు వాటిని ఒరిజినల్ భాషలో ఎలా ఉచ్చరించచబడేవో అలాగే వుండడం సబబుగా వుంటుంది అని భావిస్తున్నాను. ఆ ప్రకారం "విపాసన" పేరు కన్నా "విపస్సనా" పేరును హెడ్డింగ్ గా వాడవలసి వుంటుంది. అయితే తెలుగు భాషలో "విపస్సనా" అనే పదం కన్నా "విపశ్యనా" అనే సంస్కృత పదమే బాగా పాపులర్ అవుతున్నది. ఉదాహరణకు ధమ్మ (పాళీ భాషా పదం) కు సమానార్ధకమైన ధర్మ (సంస్కృతం) పదం ఉన్నప్పటికీ బాగా పాపులర్ అయిన ధర్మ పదాన్ని english wiki లో "DHARMA" హెడ్డింగ్ తో ఆర్టికల్ వుంది. dhamma ను దారిమార్పుతో Dharma కు మళ్ళించారు. అందుకే "విపాసన" హెడ్డింగ్ ను "విపస్సనా" కు బదులుగా "విపశ్యనా" గా మార్చవలసి వచ్చింది. దీని కనుగుణంగా దారి మార్పులుగా "విపస్సనా" "విపస్సనా ధ్యానం" "విపశ్యనా ధ్యానం" ఉంచబడినవి.


ఒకవేళ ఒరిజినల్ భాషా ఉచ్చారణయే వుండటం సబబు. అది తెలుగు వికి సంప్రదాయమయితే, ఎవరైనా "విపశ్యనా" హెడ్డింగ్ ను తిరిగి "విపస్సనా" అనే హెడ్డింగ్ కు చక్కగా మార్చవచ్చు. సమస్య వుండదు. దీనికి సమర్ధనీయమైన ఉదాహరణ: English wiki లో కూడా ఒరిజినల్ భాషా ఉచ్చారణ పదం (VIPASSANĀ) తోనే ఈ పేరుగల ఆర్టికల్ కూడా వుంది. కనుక ఆ విధంగా (విపస్సనా అనే హెడ్డింగ్ గా) మార్చవలసి వస్తే, దానికి దారి మార్పుగా "విపశ్యనా" పదం వుంచవలసి వుంటుంది.