చర్చ:విష్ణుమాయా విలాసము
స్వరూపం
సత్యభామా గర్వభంగం
[మార్చు]సత్యభామ పెరటిలో పారిజాత వృక్షాన్ని నాటిన తర్వాత ఆమె హృదయాన్ని తెలుసుకోవాలని కృష్ణుడు మిగిలిన భార్యల ఇళ్ళలో కూడా పారాజాతాలను నాటించి, అందరిని అన్ని రూపాలతో క్రీడిస్తున్నాడు. అందరూ నా భర్త నా దగ్గరే ఉన్నాడు అనుకుంటున్నారు. సత్యభామకూడా అలాగే అనుకుంది. స్వామి విరహంతో మిగతా భార్యలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని తన పెరటిలో పూసిన పారిజాతాలను కోయించి, బుట్టలో పెట్టించి తన చెలికత్తెలను పిలిపించి అందరి ఇళ్ళలో ఇచ్చి వారి హావభావాలను తెలుసుకుని రమ్మని పంపించింది. రుక్మిణికి పూలు తీసుకొని వెళ్ళిన చెలికత్తెనుండి ఆ పూలను స్వీకరించి కృష్ణునితో ఇవిగో నీ ప్రియురాలు పంపిన పూలు అని తలలో తురిమింది రుక్మిణి.