చర్చ:వేదాంతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదములే మన మనుగడకు ఆధారము. ఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు.

నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండు భాగములుగా విభజించ వచ్చు. మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొన వచ్చు.

ప్రతి వేదములోని ప్రధమ భాగములో,కర్మ ఖాండ విషయములు అనగా ధర్మ భద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి వున్నాయి. దీని ఆధారముతోనే మనుస్మ్రుతి (మనువుచే వ్రాయబడినది),ధర్మ సూత్రములు( జైమిని కారులచే వ్రాయబడినవి)వచ్చాయి. యోగాదులు,ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పనవుసరము లేదు. హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మ సూక్ష్మములు ఇక్కడే లభ్యం.దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుందాము.

ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది వున్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి వున్నారు. అవే మనకు రక్ష అయి వున్నాయి. పరమాత్మ, సృష్టి కర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.

ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందుకే వానిని అపవురుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య,(అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యమ్ అని భోధించుతారు.ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగ నిషేదించ బడుతుంది. కర్మ ఖాండ నిషేదమునకు ఒప్పుకొ గల్గిన, శమ దమాదులు కల్గిన మనస్సునకు మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది.

పూర్వపు రోజులలో, వర్ణాశ్రమ ధర్మము ననుసరించి, బ్రంహచర్యములో గురుకులములకు వెళ్ళి, వర్ణముతో నిమిత్తము లేకుండ, విద్యనభ్యసించ వలెను. తరువాత గృహస్తాశ్రమములో తాము మునుపటి ఆశ్రమములో అభ్యసించిన విద్యతో, ధర్మమార్గములో జీవనము సాగించెడివారు. వర్ణాశ్రమ ధర్మములను గురించి ఇంకను వివరముగ చెప్పవలసి వున్నది.

ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రంహచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుఛేలుడు, అన్న బలరాముడు తో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు. అందువలననే గీత ఉపనిషత్ సారాంశము అయినది. అందులో పర్ అపర విద్యలు (అపర విద్య = కర్మఖాండ,పర విద్య = పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తయి. అంటే జీవన విధానము + జీవన రహశ్యము, ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు.

ఈ రెండు విద్యలను, రాముల వారు తన బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది.దానిని గీత అన్నను సరియే అగును. కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది. ఇది మరుగు పడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలలేదు. రహస్యమేమిటి. ఇది ఆతని అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు.

వేదాంతము గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి