చర్చ:వ్యవస్థాపకత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

entrepreneur : పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004: వ్యాపార సమారంభకుడు, పారిశ్రామికవేత్త, వ్యవస్థాపకుడు entrepreneur: ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008: ఉద్యమి, వ్యవస్థాపకుడు, పారిశ్రామికుడు.

ఈ పదాల్లో వ్యవస్థాపకుడు అన్న మాట వేఱే సందర్భాల్లో వాడుకలో ఉన్నందు వలన, సమారంభకుడు అన్న పదం వ్యవహారంలో లేనందున ఆ పదాన్ని తీసుకుంటే బాగుంటుందని నా అనుకోలు. నిజానికి ("వ్యాపారి" వలె) లింగభేదం లేని పదమయితే ఇంకా బాగుంటుందేమో. "ఉద్యమి" అన్న పదాన్ని బూదరాజు వారు సూచించినా అందులో "ఆరంభకత" లేదు, ఒకింత (మాత్రమే) అసందర్భమైన విప్లవాత్మక స్ఫూర్తి ఉంది. కనుక ఇవేవీ కాక మఱేదైనా కొత్త పదమైనా వాడవచ్చునేమో పరిశీలించగలరు.

entrepreneurial, entrepreneurship వంటి పదరూపాలకు, పదబంధాలకు అవకాశం కల్పిస్తూ కొత్తగా పుడుతున్న technopreneur, agripreneur, wannapreneur, studentpreneur, robopreneur వంటి కొత్త పదాలను కూడా నిర్వచించే విధంగా వీలయిన పదాన్ని ఎంచుకోవటం అవసరం.- (సంతకం మరచిన వాడుకరి Kirandotc)