చర్చ:సినిమాల్లో కొన్ని పాత్రలు
నటులు, రచయితల గురించి వ్యాసాలు వ్రాసినప్పుడు, వారు నటించిన లేదా వ్రాసిన పుస్తకాల గురించి మనం తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది. కాని, వారి సినిమాలు లేదా నవలల/కథల జాబితా వ్యాస భాగంగా ఉంచితే, వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు. ఒక్కసారి, ఆలోచించండి, రచయిత చలం గురించిన వ్యాసం ఒక వార పత్రికలో మనం చదువుతుంటే, మొత్తం 3 పేజీల వ్యాసంలో, 2 పేజీలు ఆయన వ్రాసిన కథల/నవలల జాబితాకే పోతే బాగుంటుందా!! మనకు కంప్యూటర్లో జాబితా మొత్తం వేరొక చోట ఉంచి, వ్యాసం చదివేవారు అవసరమనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబితా కనబడేట్లు చేసే చక్కటి అవకాశం వదులు కోవటం అంత సమంజసం అని నాకనించట్లేదు. కాబట్టి నటుల,రచయితల సినిమా/పుస్తకాల జాబితాలు, వారిగురించిన వ్యాసాలతో విలీనం చేయ వద్దని మరియు జాబితా, ఆవ్యాసానికి ఉప పుటగా ఉంచి జాబితాకు వ్యాసంనుండి ఒక లింక్ ఉంచితేనే బాగుంటుందని నా అభిప్రాయమ్ మరియు మనవి.--SIVA 18:53, 1 ఏప్రిల్ 2008 (UTC)