చలనచిత్రోత్సవం

వికీపీడియా నుండి
(చలన చిత్రోత్సవం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

చలనచిత్రోత్సవం వివిధ దేశాల్లో జరిగే చలనచిత్రాల పోటీలు.

అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం

[మార్చు]

పండిట్ జవహర్‌‌‌లాల్ నెహ్రూ పుట్టిన రోజైన నవంబరు 14 న మొదలై 20 వ తేదీ వరకు జరిగే సినిమా ఉత్సవం ఇది. ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతుంది. 1995 మే నెలలో "చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ)"ను ఏర్పాటు చేశారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పండిట్ హృదయ్‍‌నాథ్ కుంజ్రా పని చేశారు.[1] ఆ తరువాత 1968లో సీఎఫ్ఎస్ఐ పనితీరుపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం నిపుణుల సలహా మేరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను జరపాలని నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్సవాలు ముంబయి తరువాత చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, హైదరాబాద్.. నగరాలలో వరుసగా నిర్వహించారు1997వ సంవత్సరం తరువాత హైదరాబాద్ నగరాన్ని భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించే శాశ్వత వేదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్నించి ప్రతి రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలను నగరం వేదికగా మారింది.

ఈ ఉత్సవాల్లో.. 60 నిమిషాలకంటే ఎక్కువ నిడివిగల చిత్రాల విభాగంలో ఉత్తమ కథా చిత్రాన్ని ఎంపికచేసి బంగారు ఏనుగు, రెండు లక్షల రూపాయల నగదును ప్రదానం చేస్తారు. ద్వితీయ ఉత్తమ చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. అలాగే 60 నిమిషాలకంటే తక్కువ నిడివి కలిగిన ఉత్తమ లఘు కథా చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల బహుమతిని ఇస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-02-06.