చాక్రవర్మణీయ వ్యాకరణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టాధ్యాయి లో ఈత్ చాక్రవర్మణస్య (6-1-130) అను సూత్రమున చాక్రవర్మణుని నామము గోచరించబడినది. కాతంత్రపరిశిష్టములోని ఇతో వా (సంధి 43) సూత్రముపై వృత్తిలో శ్రీపతిదత్తుడు చాక్రవర్మణుని పేర్కొనినాడు. శకటి-శాకటి-శాకటాయనీయ త్రిముని వ్యాకరణమున కపశ్చాక్రవర్మణస్య అను సూత్రము కలదు. దానిపై వ్యాఖ్యలో ఉజ్జ్వలదత్తుడు కపాతే రేవ చాక్రవర్మణస్య ఆచార్యస్య మతేన కపప్రత్యయః సంప్రసారణంచ. కుపాపః సఏవ. స్వరేతు విశేషః అని వివరించాడు. దీనినిబట్టి ఇతడు శాకటాయమునికి పుర్వుడని తెలియుచున్నది. ఈ సూత్రములను, వృత్తులను ఆకాలమున ఈతని వ్యాకరణము తప్పక ఉండెనని భావించవచ్చును. కపః చాక్రవర్మణస్య వలన చాక్రవర్మణునకు మహర్షి శాకటాయనునకు పూర్వమే ప్రాతిపదికసుత్త్రములకు ధాతుజత్వకల్పన సమ్మతమని తెలియుచున్నది. ఈయన వ్యాకరణమున ద్వయశబ్దమునకు సర్వవిభక్తులలో సర్వనామత్వము స్వీకృతమయినట్లు ప్రతీతి. అందుచెతనే మాఘకవి వ్యధాం ద్వయేషా మపి మేదినీభృతాం అనుటయు, భట్టొజిధీక్షితుడు ఖండించుటయు సంభవించినది.

చాక్రవర్మణుడు చక్రవర్మపుత్రుడు. వాయు పురాణము ప్రకారము చక్రవర్మ కశ్యపదనాయుసుల పౌత్రుడు. దానవసంబంధ ముదుటచేతనే ధర్మశాస్త్రకారులలో ఇతని నామము కానరాదు. కశ్యపుడు బహుప్రాచీనమహర్షి. ఆయన ప్రప్రౌతుడనటచేతనే చాక్రవర్మణుడు ప్రాచీనుడు అనవలసి వచ్చినది.

మూలాలు[మార్చు]

1. భారతి మాస సంచిక.