Coordinates: 26°10′25″N 68°19′23″E / 26.17361°N 68.32306°E / 26.17361; 68.32306

చాన్హుదారో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chanhudaro
Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Sindh" does not exist.
ఇతర పేర్లుChanhu daro
స్థానంMullan Sandh, Sindh, Pakistan
నిర్దేశాంకాలు26°10′25″N 68°19′23″E / 26.17361°N 68.32306°E / 26.17361; 68.32306
రకంSettlement
వైశాల్యం5 ha (12 acres)
చరిత్ర
స్థాపన తేదీ40th century BC
వదిలేసిన తేదీ17th century BC
పీరియడ్‌లుRegionalisation Era to Harappan 4
సంస్కృతులుIndus Valley Civilization
స్థల గమనికలు
తవకాల తేదీలు1930, 1935–1936
పురాతత్వవేత్తలుNani Gopal Majumdar, Ernest John Henry Mackay
సింధులోయ ప్రాంతాలు
క్రీ.పూ.2500 నాటి హరప్పా అచ్చుపోసిన ఇటుక. చన్హుదారో, పాకిస్తాను

చాన్హుదారో (చాన్హు దారో లేదా చాన్హు దాడో) సింధు లోయ నాగరికత పట్టణానంతర జుకరు దశకు చెందిన ఒక పురావస్తు ప్రదేశం. ఈ ప్రదేశం పాకిస్తానులోని సింధు మొహెంజో-దారోకు దక్షిణాన 130 కిలోమీటర్లు (81 మైళ్ళు) దూరంలో ఉంది. ఈ స్థావరం క్రీ.పూ 4000 - 1700 మధ్య మానవనివాసితంగా ఉంది. కార్నెలియను పూసల తయారీకి ఒక కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతం మూడు తక్కువ ఎత్తైన మట్టిదిబ్బల సమూహంగా ఉంది. త్రవ్వకాలలో ఒకే స్థావరం భాగాలుగా సుమారు 5 హెక్టార్ల పరిమాణంలో విస్తరించి ఉంది.

చాన్హుదారో ప్రదేశంలో మొట్టమొదటగా 1930 మార్చిలో ఎన్. జి. మజుందారు తవ్వకాలు సాగించాడు. 1935-36 శీతాకాలపు ఫీల్డు సెషన్లో " అమెరికన్ స్కూలు ఆఫ్ ఇండికు అండు ఇరానియను స్టడీసు ", " మ్యూజియం ఆఫ్ ఫైను ఆర్ట్సు, బోస్టను బృందం ఎర్నెస్టు జాను హెన్రీ మాకే నేతృత్వంలో. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసరు డబ్ల్యూ. నార్మను బ్రౌను ఈ ప్రాజెక్టు కోసం నిధులను సేకరించడంలో కీలకపాత్ర పోషించారు.[1] పాకిస్తాను స్వాతంత్ర్యం తరువాత, " మహ్మదు రఫీక్యూ మొఘలు " కూడా ఈ ప్రాంతంలో అన్వేషణాత్మక పనులు చేశాడు.

చారిత్రక సాక్ష్యాలు[మార్చు]

సింధు నాగరికత ముఖ్యమైన ప్రదేశాలలో చాన్హుదారో ఒకటి. ఇప్పటి వరకు సింధు నాగరికతకు చెందిన 2500 కంటే అధికమైన ప్రదేశాలు గుర్తించబడ్డాయి. తవ్వకం కోసం అవకాశం ఉన్నట్లు గుర్తించబడిన పెద్ద ప్రాంతాలలో చాన్హుదారో ఒకటి. అయినప్పటికీ చాలాకాలం ఈ ప్రదేశాంలో తవ్వకాలు పురోగతిలో లేవు. ఈ ప్రదేశంలో నుండి వెలికితీసే వస్తువులు క్షీణించాయి. ఇది ఎడారి ప్రాంతంలో ఉంది. కాని సరస్వతి నది ఈ ప్రదేశానికి సమీపంలో ప్రవహిస్తుందని విశ్వసిస్తున్నారు. క్రీస్తుపూర్వం 2 వ సహస్రాబ్ది కాలంలో సరస్వతి నది ఎండిపోయిందని విశ్వసిస్తున్నారు.[2] దీని వలన చాన్హుదారో వద్ద జీవితం, సరస్వతి ఒడ్డున ఉన్న అనేక వందల నివాసాలలో నివసించిన ప్రజల జీవితాలు కష్టతరంగా మారాయి. ఫలితంగా అక్కడి ప్రజలు తమ నివాస స్థలాలను వదలివేయవలసి వచ్చింది. ఈ నివాసాలు (నగరాలు, గ్రామాలు) క్షీణించడానికి సరస్వతి నది ఎండిపోవడం ఒక కారణమని భావిస్తారు. ఇది సింధు నాగరికత క్షీణతకు దోహదపడింది.[3]

ఆరంభకాల త్రవ్వకాలు[మార్చు]

ప్రస్తుత సింధు నది మైదానానికి తూర్పున 12 మైళ్ళ దూరంలో చాన్హుదారో ఉంది. చాన్హు-దారోను 1931 లో భారత పురావస్తు శాస్త్రవేత్త ఎన్. జి. మజుందారు పరిశోధించాడు. ఈ పురాతన నగరం పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణ లే అవుటు వంటి అనేక అంశాలలో హరప్పా, మొహెంజదారోతో సమానంగా ఉందని గమనించబడింది.[4]ఈ స్థలాన్ని 1930 ల మధ్యలో అమెరికన్ స్కూలు ఆఫ్ ఇండికు అండు ఇరానియను స్టడీసు, బోస్టను మ్యూజియం ఆఫ్ ఫైను ఆర్ట్సు తవ్వించాయి. ఇక్కడ ఈ పురాతన నగరం సంబంధిత అనేక ముఖ్యమైన వివరాలు పరిశోధించబడ్డాయి.[5]

పట్టణ ప్రణాళిక[మార్చు]

చాన్హుదారో, మొహెంజో-దారో వద్ద ఇటుకలను విస్తృతంగా ఉపయోగించారు.[6] అనేక నిర్మాణాలు శిక్షణాలయాలు (పారిశ్రామిక గృహాలుగా) గుర్తించబడ్డాయి. చాన్హుదారో లోని కొన్ని భవనాలు గిడ్డంగులు అయి ఉండవచ్చు.[7]

పారిశ్రామిక కార్యక్రమాలు[మార్చు]

చాన్హుదారో వద్ద షెలు పని ఆధారాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రదేశంలో గాజులు, లేడిల్సు తయారు చేయబడ్డాయి.[8]పరిపాలనా నెట్వర్కుతో సంబంధం ఉన్న హరప్పా, మొహెంజదారో, చాన్హుదారో వంటి పెద్ద పట్టణాల్లో హరప్పా ముద్రలు సాధారణంగా తయారు చేయబడ్డాయి.[9]

కనుగొనబడిన కళాఖండాలు[మార్చు]

రాగి కత్తులు, ఈటెలు, రేజర్సు, పనిముట్లు,[10] గొడ్డలి, నాళాలు, వంటకాలు కనుగొనబడ్డాయి. దీని కారణంగా ఈ ప్రదేశానికి ఎర్నెస్టు మాకే "షెఫీల్డు ఆఫ్ ఇండియా" అని మారుపేరు పెట్టారు.[11] ఈ సైటు నుండి రాగి చేపల గాలాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.[12] టెర్రకోట బండి నమూనాలు ఒక చిన్న టెర్రకోట పక్షి ఎగిరినప్పుడు విజిలు వలె పనిచేస్తుంది. ప్లేట్లు, వంటకాలు కనుగొనబడ్డాయి. ఈటె విసిరే పురుషుడు లేదా నర్తకి - విరిగిన విగ్రహం (4.1 సెం.మీ.) చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది చాన్హుదారో వద్ద కనుగొనబడింది. ఇప్పుడు అమెరికాలోని బోస్టన్‌ఉలోని మ్యూజియం ఆఫ్ ఫైను ఆర్ట్సులో ప్రదర్శించబడింది.[13][14] చాన్హుదారో వద్ద సింధు ముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ ముద్రలను తయారు చేసిన కేంద్రాలలో చాన్హుదారో ఒకటిగా పరిగణించబడుతుంది.[15] చాన్హుదారో వద్ద చేతిపనుల ఉత్పత్తి మోహెంజోదారో వద్ద కంటే చాలా అధికంగా జరిగింది అనిపిస్తుంది. బహుశా ఈ చర్య కోసం పట్టణంలో సగం ఉపయోగించారని తీసుకోవచ్చు.[16]

రొట్టెల తయారీ పరిశ్రమ[మార్చు]

చాన్హుదారో వద్ద కనుగొనబడిన వస్తు తయారీ కార్యక్రమం జరిగిందనడానికి నిదర్శనంగా ఇందులో కొలిమి కూడా ఉంది.[17] చాన్హుదారో వద్ద షెలు గాజులు, అనేక పదార్థాల పూసలు, స్టీలిటు సీల్సు, లోహ పనులను తయారు చేశారు.[18]

వ్యవసాయం[మార్చు]

చన్హుదారోలో నువ్వులు పండించిన కారణంగా దీనిని హరప్పా సంస్కృతి అని పిలుస్తారు. బహుశా చమురు కోసం పండిస్తారు. [19] చాన్హుదారో వద్ద బఠానీలను కూడా పండిస్తారు.[20]

ప్రాముఖ్యత[మార్చు]

సింధు లిపికి సంబంధించి, || / గుర్తు చాన్హుదారో వద్ద ఉన్న శాసనాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది పదకొండు వస్తువులకు సంభవించింది, (లిఖిత వస్తువులలో ఆరవ వంతు చాన్హుదారో నుండి స్వాధీనం చేసుకోబడ్డాయి) ఇది పట్టణం పేరును సూచించవచ్చని అస్కో పారాపోలా సూచించటానికి ఇది దారితీసింది.[21]చాన్హుదారో వద్ద లభించిన వెండి లేదా కాంస్య వస్తువులలో భద్రపరచబడిన పత్తి వస్త్రం జాడలు హరప్పా, రాఖీగర్హి సంస్కృతికి చెందినవని భావిస్తున్నారు.[22] చాన్హుదారో, అహరు, రాజస్థాను (భారతదేశం), ముండిగాకు వద్ద లభించిన ఇనుము వస్తువుల ఆధారంగా ఇక్కడ క్రీ.పూ.3 లో సహస్రాబ్ధిలో ఇనుము ఉత్పత్తి చేయబడిందని పేర్కొన్నందున ఇది ప్రాముఖ్యతను పొందుతుంది.[23]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Possehl, Gregory L. (2004). The Indus Civilization: A contemporary perspective, New Delhi: Vistaar Publications, ISBN 81-7829-291-2, p.74.
  2. The Lost River by Michel Danino, Penguin India 2010
  3. The Lost River by Michel Danino. Penguin 2010
  4. Possehl, Gregory L. (2004). The Indus Civilization: A contemporary perspective, New Delhi: Vistaar Publications
  5. about.com.Archeology
  6. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 210
  7. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 229
  8. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO.
  9. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO Page 264
  10. [Paul Yule, A Harappan 'Snarling Iron' from Chanhu daro, Antiquity 62, 1988, 116–118, ISSN 0003-598X. URL: http://archiv.ub.uni-heidelberg.de/savifadok/volltexte/2008/145/]
  11. "Illustrated London News, November 21, 1936". Archived from the original on 2019-07-09. Retrieved 2019-10-30.
  12. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 135
  13. Museum of Fine Arts, Boston[permanent dead link]
  14. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 281
  15. McIntosh, Jane. (2008) The Ancient Indus Valle: New Perspectives. ABC-CLIO.Page 264 [1]
  16. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 303
  17. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 237
  18. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 150
  19. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. Page 114
  20. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO
  21. Asko Parpola (1994)
  22. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 333
  23. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 320 [2]