చార్లీ ముంగెర్
చార్లీ ముంగెర్ | |
---|---|
జననం | చార్లెస్ థామస్ ముంగెర్ 1924 జనవరి 1 ఒమాహా, నెబ్రాస్కా, అమెరికా |
మరణం | 2023 నవంబరు 28 శాంటా బార్బరా, కాలిఫోర్నియా, అమెరికా | (వయసు 99)
విద్య |
|
వృత్తి | వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి, ఆర్థిక విశ్లేషకుడు, న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వారెన్ బఫ్ఫెట్తో బెర్క్‌షైర్ హాత్వేలో ప్రముఖ పెట్టుబడులు |
బిరుదు | వైస్ ఛైర్మన్, బెర్క్‌షైర్ హాత్వే |
జీవిత భాగస్వామి | నాన్సీ జీన్ హగ్గిన్స్
(m. 1945; div. 1953)నాన్సీ బారీ బోర్త్విక్
(m. 1956; died 2010) |
పిల్లలు | 7 |
Military career | |
సేవలు/శాఖ | యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ |
సేవా కాలం | 1943–1946 |
ర్యాంకు | రెండవ లెఫ్టినెంట్ |
యూనిట్ | ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ |
పోరాటాలు / యుద్ధాలు | రెండవ ప్రపంచ యుద్ధం |
సంతకం | |
చార్లెస్ థామస్ ముంగెర్ (ఆంగ్లం Charles Thomas Munger) (1924 జనవరి 1 - 2023 నవంబరు 28) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి. అతను బెర్క్‌షైర్ హాత్వే(Berkshire Hathaway) వైస్ ఛైర్మన్, వారెన్ బఫ్ఫెట్ వ్యాపార భాగస్వామి. పైగా ఆయనకు చార్లీ ముంగెర్ కుడిచేతి వ్యక్తిగా అభివర్ణింస్తారు.
చార్లీ ముంగెర్ 1984 నుండి 2011 వరకు వెస్కో ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు. అతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డైలీ జర్నల్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా, కాస్ట్‌కో హోల్‌సేల్ కార్పొరేషన్(Costco) డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు.
అతని ‘నో నాన్సెన్స్’ విధానంతో అమెరికన్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందాడు. నాణ్యమైన కంపెనీలు గుర్తించి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ కంపెనీల ఉత్పాదకత ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టి లాభం సంపాదించడంలో ఆయన దిట్ట.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన నెబ్రాస్కాలోని ఒమాహాలో జన్మించాడు. యుక్తవయసులో, అతను వారెన్ బఫ్ఫెట్ తాత, ఎర్నెస్ట్ పి. బఫ్ఫెట్ యాజమాన్యంలోని బఫ్ఫెట్ & సన్ అనే కిరాణా దుకాణంలో పనిచేశాడు. అతని తండ్రి ఆల్ఫ్రెడ్ కేస్ ముంగెర్ న్యాయవాది. అతని తాత థామస్ చార్లెస్ ముంగెర్, అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రతినిధి.[1][2]
గణితశాస్త్రం అభ్యసించడానికి అతను మిచిగాన్ విశ్వవిద్యాలయంలో చేరాడు.[3] ఆ సమయంలో, అతను సిగ్మా ఫై సొసైటీలో చేరాడు. 1943 ప్రారంభంలో, 19 ఏళ్ల వయసులో ఆయన అమెరికా ఆర్మీ ఎయిర్ కార్ప్స్‌లో సేవ చేయడానికి చదువు నుండి కొంతకాలం తప్పుకున్నాడు. అక్కడ అతను రెండవ లెఫ్టినెంట్ అయ్యాడు.[4] ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్‌లో అధిక స్కోర్ పొందిన తర్వాత, అతను కాలిఫోర్నియాలోని పసాదేనాలోని కాల్టెక్‌లో వాతావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. ఆయన లా స్కూల్‌లో రాణించాడు, 1948లో జె.డి.తో మాగ్నా కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. హార్వర్డ్‌లో, అతను హార్వర్డ్ లీగల్ ఎయిడ్ బ్యూరో సభ్యుడుగా ఉన్నాడు.[5][6]
అతను స్టాక్ ట్రేడింగ్‌కు సంబంధించిన విధానాన్ని వివరించడానికి కార్డ్ సారూప్యతను ఉపయోగించి ప్రసిద్దిచెందాడు. కంపెనీ షేర్లను బేస్‌బాల్ కార్డ్‌ల లాగా పరిగణించడం అనేది నష్టపోయే వ్యూహం అని అతను చెప్పాడు, ఎందుకంటే తరచుగా అహేతుక, భావోద్వేగ మానవుల ప్రవర్తనను అంచనా వేయడం అవసరం.[7]
కెరీర్
[మార్చు]ఆయన తన కుటుంబంతో కాలిఫోర్నియాకు వెళ్లాడు, అక్కడ న్యాయ సంస్థ రైట్ & గారెట్ (తరువాత మ్యూజిక్క్, పీలర్ & గారెట్)లో చేరాడు.[8] 1962లో, అతను ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ ఎల్ ఎల్ పి లో రియల్ ఎస్టేట్ అటార్నీగా స్థాపించి పనిచేశాడు.[9] అతను పెట్టుబడుల నిర్వహణపై దృష్టి పెట్టడానికి న్యాయవాద అభ్యాసాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఓటిస్ బూత్‌తో భాగస్వామి అయ్యాడు. అతను పసిఫిక్ కోస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సీటుతో కూడిన పెట్టుబడి సంస్థ అయిన వీలర్, ముంగెర్ అండ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి జాక్ వీలర్‌తో భాగస్వామి అయ్యాడు. 1973లో 32%, 1974లో 31% నష్టపోయిన తర్వాత 1976లో వీలర్, ముంగెర్ అండ్ కో నుంచి ఆయన తప్పుకున్నాడు.[10]
1959లో ఆయనకు తొలిసారిగా వారెన్ బఫెట్ పరిచయమయ్యాడు. కొన్ని దశాబ్దాల పాటు వారి స్నేహ బంధం కొనసాగింది. వారెన్ బఫెట్ స్థాపించిన బర్క్‌షైర్ హాథ్‌వేలో ఆయన 1978 నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించాడు. చిన్న టెక్స్‌టైల్ కంపెనీగా ఉన్న హాథ్‌వే బర్క్‌షైన్‌ను ఓ భారీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థగా అభివృద్ధి చేసాడు. చార్లీ ముంగెర్ భాగస్వామ్యం, స్ఫూర్తి లేనిదే బర్క్‌షైర్ హాథ్‌వే ఇంతగా అభివృద్ధి చెందేది కాదని వారెన్ బఫెట్ ప్రకటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1945లో, కాల్టెక్‌లో చదువుతున్నప్పుడు, చార్లీ ముంగెర్ ఫ్రెడరిక్ ఆర్. హగ్గిన్స్, ఎడిత్ ఎం. హగ్గిన్స్ కుమార్తె నాన్సీ హగ్గిన్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె స్క్రిప్స్ కాలేజీలో ఆయన సోదరి రూమ్‌మేట్.[11][12] వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు,
వెండి ముంగెర్ (Wendy Munger), మాజీ కార్పొరేట్ న్యాయవాది, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ట్రస్టీ, ది హంటింగ్టన్ లైబ్రరీ ధర్మకర్త.[13][14] మోలీ ముంగెర్ (Molly Munger) పౌర హక్కుల న్యాయవాది, ప్రభుత్వ విద్య కోసం కాలిఫోర్నియా పన్నులను పెంచడానికి బ్యాలెట్ చొరవకు నిధులు సమకూర్చింది.[15] ఇక టెడ్డీ ముంగెర్ (Teddy Munge) లుకేమియా సోకడంతో 9 ఏళ్ల వయస్సులోనే మరణించింది.
ఆయన, నాన్సీ హగ్గిన్స్ 1953లో విడాకులు తీసుకున్నారు.[16] డేవిడ్ నోబుల్ బారీ జూనియర్, ఎమిలీ హెవెనర్ బారీల కుమార్తె నాన్సీ బారీని ఆయన తిరిగి వివాహం చేసుకున్నాడు.[17] వారికి, నలుగురు పిల్లలు ఉన్నారు.
భౌతిక శాస్త్రవేత్త, రిపబ్లికన్ కార్యకర్త చార్లెస్ టి. ముంగెర్ జూనియర్, ఎమిలీ ముంగెర్ ఓగ్డెన్, బారీ ఎ. ముంగెర్, ఫిలిప్ ఆర్. ముంగెర్. అంతేకాకుండా, ఇద్దరు సవతి పిల్లలు విలియం హెరాల్డ్ బోర్త్‌విక్, డేవిడ్ బోర్త్‌విక్ ఉన్నారు.[18]
2002 జూలై 22న, ఆయన మొదటి భార్య నాన్సీ హగ్గిన్స్ ఫ్రీమాన్ 76 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో మరణించగా[19], 2010 ఫిబ్రవరి 6న రెండవ భార్య నాన్సీ బారీ ముంగెర్ 86 సంవత్సరాల వయస్సులో ఇంట్లో కన్నుమూసింది.[20][21]
మరణం
[మార్చు]చార్లీ ముంగెర్ 99 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.[22]
మూలాలు
[మార్చు]- ↑ "Charlie Munger: Background & bio". Value Walk. December 26, 2011. Retrieved March 8, 2016.
- ↑ "Munger, Thomas Charles | District of Nebraska | United States District Court". www.ned.uscourts.gov. Archived from the original on March 28, 2020. Retrieved June 28, 2019.
- ↑ Janet Lowe. Damn Right!: Behind the Scenes with Berkshire Hathaway Billionaire Charlie Munger (2000). John Wiley and Sons.
- ↑ "The World's Billionaires #1324 Charles Munger". Forbes. October 31, 2014. Archived from the original on September 15, 2017. Retrieved August 25, 2017.
- ↑ "The World's Billionaires #1324 Charles Munger". Forbes. October 31, 2014. Archived from the original on September 15, 2017. Retrieved August 25, 2017.
- ↑ "A Special Event". Harvard Law School Alumni Center. Archived from the original on March 8, 2016. Retrieved March 8, 2016.
- ↑ Griffin, Tren (2015). Charlie Munger: The Complete Investor (in ఇంగ్లీష్). New York: Columbia University Press. p. 24. ISBN 978-0-231-17098-7.
- ↑ Lowe, Janet (2000). Damn Right!: Behind the Scenes with Berkshire Hathaway Billionaire Charlie Munger (in ఇంగ్లీష్). New York: John Wiley & Sons. pp. 253. ISBN 0-471-24473-2.
- ↑ Janet Lowe. Damn Right!: Behind the Scenes with Berkshire Hathaway Billionaire Charlie Munger (2000). John Wiley and Sons.
- ↑ Janet Lowe. Damn Right!: Behind the Scenes with Berkshire Hathaway Billionaire Charlie Munger (2000). John Wiley and Sons.
- ↑ Lemann, p. 190.
- ↑ "Nancy Huggins Freeman". legacy.com. Archived from the original on October 27, 2020. Retrieved April 25, 2019.
- ↑ "Munger elected to Board of Trustees". Stanford University. February 12, 2003. Archived from the original on August 3, 2011. Retrieved March 3, 2012.
- ↑ "Trustees & Overseers". huntington.org. Archived from the original on April 12, 2019. Retrieved April 25, 2019.
- ↑ Steven Harmon (March 1, 2012). "Political novice no stranger to upending status quo". San Jose Mercury News. Archived from the original on February 17, 2013. Retrieved March 3, 2012.
- ↑ Lemann, p. 192.
- ↑ "Nancy Barry Munger". legacy.com. Archived from the original on October 27, 2020. Retrieved April 25, 2019.
- ↑ Janet Lowe (August 16, 2000). "Chapter One: An Extraordinary Combination of Minds" (PDF). Damn Right!: Behind the Scenes with Berkshire Hathaway Billionaire Charlie Munger. Wiley. Retrieved April 7, 2014.
- ↑ "Nancy Huggins Freeman". legacy.com. Archived from the original on October 27, 2020. Retrieved April 25, 2019.
- ↑ "Nancy Barry Munger". legacy.com. Archived from the original on October 27, 2020. Retrieved April 25, 2019.
- ↑ Sullivan, Kathleen J. (February 23, 2010). "Memorial to be held in March for former trustee Nancy Barry Munger". news.stanford.edu. Archived from the original on October 16, 2019. Retrieved April 25, 2019.
- ↑ "చార్లీ ముంగెర్ మరణం.. రూ.64 లక్షల కోట్ల కంపెనీకి సహకారం | Warren Buffet Condolence To Death Of Charlie Munger - Sakshi". web.archive.org. 2023-11-29. Archived from the original on 2023-11-29. Retrieved 2023-11-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- 1924 జననాలు
- 2023 మరణాలు
- అమెరికన్ బిలియనీర్లు
- బీమాలో అమెరికన్ వ్యాపారవేత్తలు
- ఆర్థిక సేవల కంపెనీల అమెరికన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు
- అమెరికన్ ఆర్థిక విశ్లేషకులు
- అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ వ్యవస్థాపకులు
- అమెరికన్ ఫైనాన్షియర్స్
- అమెరికన్ పెట్టుబడిదారులు
- అమెరికన్ మనీ మేనేజర్లు
- అమెరికన్ పరోపకారి
- అమెరికన్ స్టాక్ వ్యాపారులు
- బెర్క్‌షైర్ హాత్వే ఉద్యోగులు
- కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు
- కాలిఫోర్నియా రిపబ్లికన్లు
- బెర్క్‌షైర్ హాత్వే డైరెక్టర్లు
- హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్థులు
- నెబ్రాస్కా న్యాయవాదులు
- ముంగేర్, టోల్లెస్ & ఓల్సన్తో అనుబంధించబడిన వ్యక్తులు
- యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ అధికారులు
- రెండవ ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ సిబ్బంది
- మిచిగాన్ యూనివర్సిటీ ఆఫ్ లిటరేచర్, సైన్స్, అండ్ ది ఆర్ట్స్ పూర్వ విద్యార్థులు