చార్లెస్ విల్కిన్స్
Jump to navigation
Jump to search
సర్ చార్లెస్ విల్కిన్స్ | |
---|---|
Charles Wilkins | |
జననం | చార్లెస్ విల్కిన్స్ 1749 |
మరణం | 1836 మే 13 | (వయసు 86–87)
పౌరసత్వం | ఆంగ్లేయుడు |
వృత్తి | ప్రాచ్య భాషా పరిశోధకుడు, టైపోగ్రాఫరు (అచ్చు వేసేవాడు) |
సర్ చార్లెస్ విల్కిన్స్ (1749 – 13 మే 1836) ఒక ఆంగ్లేయ టైపోగ్రాఫరు. ఏషియాటిక్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు. భగవద్గీత ను ఆంగ్లంలోకి అనువదించిన మొట్టమొదటి వ్యక్తిగా పేరు గాంచాడు. పంచానన్ కర్మాకర్ అనే భారతీయుడితో కలిసి మొట్టమొదటి సారిగా బెంగాలీ అక్షరాల అచ్చు ముద్రలను తయారు చేశాడు.[1] 1788 లో రాయల్ సొసైటీ కి ఎంపికయ్యాడు.
నేపథ్యం
[మార్చు]విల్కిన్స్ 1749 లో సోమర్ సెట్ లోని ఫ్రోం లో జన్మించాడు.[2] మొదట్లో అచ్చు వేసే వృత్తిలో శిక్షణ తీసుకున్నాడు. 1770 లో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారతదేశానికి వచ్చాడు. భాషలతో పనిచేయాల్సి రావడం వల్ల పార్శీ, బెంగాలీ భాషలను సులభంగా నేర్చుకున్నాడు. బెంగాలీ అక్షరాలను మొదటిసారిగా అచ్చు వేయడంలో కీలక పాత్ర పోషించాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ "Book History – Ezra Greenspan, Jonathan Rose". Retrieved 2 June 2015.
- ↑ "DServe Archive Persons Show". Royalsociety.org. Retrieved 2 June 2015.[permanent dead link]
- ↑ (1837). "No. VIII, Sir Charles Wilkins, K.H.; D.C.L.; F.R.S.," The Annual biography and obituary for the year 1817–1837, pp. 69–72. Google Books