Jump to content

చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి

వికీపీడియా నుండి
చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 మార్చి 1955 నుంచి 1 మార్చి 1962

వ్యక్తిగత వివరాలు

జననం 1930
నాగిరెడ్డిపల్లె
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అన్నపూర్ణమ్మ
సంతానం చింతకుంట మద్దిలేటిరెడ్డి, చింతకుంట రామకృష్ణారెడ్డి, చింతకుంట శివశంకర్‌రెడ్డి

చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శిరివెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉమ్మడి మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయాక 1955లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శిరివెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి స్వామిరెడ్డిపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1956లో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక ఆళ్లగడ్డ నియోజకవర్గం ఏర్పడగా 1957లో రాష్ట్రంలోని 85 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. శిరివెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సీపీ తిమ్మారెడ్డిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఆళ్లగడ్డ స్థానానికి 1957లో ఎన్నికలు నిర్వహించలేదు దీనితో ఆయన 1962 వరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగించాడు. సీపీ తిమ్మారెడ్డి శిరివెళ్ల నియోజకవర్గానికి చివరి, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా 1955 మార్చి 3 నుంచి 1962 మార్చి 1 వరకు 2,555 రోజులు ఎమ్మెల్యేగా పనిచేసి రికార్డు సాధించాడు.

సీపీ తిమ్మారెడ్డి తరువాత కాంగ్రెస్ర్ పార్టీలో తరువాత 1962 నుంచి 1972 వరకు కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు డీసీసీ అధ్యక్షుడిగా, 1967 నుంచి 1983 వరకు ఆళ్లగడ్డ తాలూకా సమితి అధ్యక్షుడిగా, 1980 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబర్‌గా పనిచేశాడు. ఆయన 2003 జూలై 3న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (31 March 2019). "ఆళ్లగడ్డ తొలి ఎమ్మెల్యే సీపీ తిమ్మారెడ్డి". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.