చిక్కీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిక్కీ
శనగ పలుకుల చిక్కీ
మూలము
ఇతర పేర్లుకడలాయి మిఠాయి, గుడ్ బాదం, పల్లీ పట్టీ, కప్పలంది ముతాయ్
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంభారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్
వంటకం వివరాలు
వడ్డించే విధానంస్నాక్
ప్రధానపదార్థాలు పల్లీలు, బెల్లం

చిక్కీ అనగా వేరుసెనగ పప్పు, బెల్లంతో తయారుచేయబడిన ఒక తినుబండారము[1].

ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో దీనిని "లాయియా పట్టీ" అంటారు. భారతదేశంలోని సింధు ప్రాంతంలో దీనిని లాయీ అనీ, ఇతర రాష్ట్రాలలో దీనిని గాజక్ లేదా మారోండా అని పిలుస్తారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ లతో పాటు బెంగాలీ భాష మాట్లాడే ప్రాంతాలలో దీనిని "గుర్ బాదం" అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో దీనిని పల్లీ పట్టీ అని పిలుస్తారు. కేరళలో దీనిని కప్పలాండి ముతై అని పిలుస్తారు. ఇదే విధమైన పదార్థం బ్రెజిల్ లో కూడా ప్రాచుర్యం పొందింది.

తయారీ

[మార్చు]

తయారికి కావలసిన వస్తువులు.

[మార్చు]

1. వేయించిన వేరుశనగ పప్పులు. 2. బెల్లం.

తయారు చేయు విధానము:

[మార్చు]

బెల్లాన్ని పాకం చేసుకొని అందులో వేయించిన వేరుశనక పప్పులను కలిపి అచ్చులలో పోసి పూర్తిగా ఆరక ముందే దాన్ని మనకు కావలసిన ఆకారంలో కోసుకోవాలి. ఆరిన తర్వాత అవి ముక్కలుగా విడిపోతాయి. ఇవి తినడానికి చాల రుచిగా వుంటాయి. ఇది మంచి భలవర్థక పదార్థం. ప్రస్తుతం ఈ చిక్కీ తయారి పెద్ద పరిశ్రమగా మారింది. గతంలో ఇళ్లలో అప్పటి కప్పుడు పిల్లల కొరకు తయారు చేసి ఇచ్చే ఈ తినుబండారము ఇప్పుడు బారీఎత్తున పరిశ్రమలో తయారయి అంగళ్లలో అమ్ముతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Chitrodia, Rucha Biju. "A low-cal twist to sweet sensations". The Times of India. Archived from the original on 23 October 2012. Retrieved 19 August 2012.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిక్కీ&oldid=3175139" నుండి వెలికితీశారు