చిటిక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చిటికను ఆంగ్లంలో స్న్యాప్ అంటారు. ఒక చేతి వేళ్లను అదే చేతిపై వేగంగా కొట్టడం ద్వారా విడుదలయ్యే శబ్దాన్ని చిటిక అంటారు. ప్రధానంగా బొటనవ్రేలుపై మరియొక వేలును ఉంచి గట్టిగా అదిమి జారేటట్టు చేస్తే జారిన వేలు అరచేతిపై పడి శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్నే చిటిక లేక చిటపట శబ్దం అంటారు. చిటిక వేయడానికి మధ్యవేలు అనువుగా ఉండటమేకాకుండా ఎక్కువ ధ్వని కూడా విడుదలవుతుంది. దీనికి కారణం మధ్యవేలు బలంగా ఉండటంతో పాటు ఉంగరపు వేలు నుండి కూడా అదే సమయంలో ధ్వని విడుదలవుతుంది. కాబట్టి చిటిక వేయడానికి ఎక్కువగా, ముఖ్యంగా మధ్యవేలును ఉపయోగిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

సంగీతంలా వినడానికి, ఇతరులను చిటికేసి పిలవడానికి ఈ చిటికలు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

చప్పట్లు

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చిటిక&oldid=856378" నుండి వెలికితీశారు