చిట్లా కుప్ప
స్వరూపం
చిట్లా కుప్ప చిత్తూరు జిల్లా, పరిసర ప్రాంతాలలో గతంలో పశువుల పండగ రోజున ఊరి బయట ఒక చెట్టు క్రింద కాటమ రాజు గుడి ఏర్పాటు చేస్తారు. అక్కడ సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు నుండి ఆ దారిన వెళ్లే పశువుల కాపరులు, ఇతరులు తలా ఒక కంపను గాని, కర్రను గాని అక్కడ ఒక కుప్పగా వేస్తారు. పశువుల పండగ నాటికి అది పెద్ద కుప్పగా తయారవుతుంది. ఆ పండగ రోజున కాటమ రాజుకి ఊరు వారందరు పొంగలి పెట్టి పూజ చేసి, కోళ్లను కోసి, అందరి పశువులను అక్కడికి తోలు కొచ్చి పూజానంతరం ఆ కంపల కుప్పకు అదే చిట్లా కుప్పకు నిప్పు పెట్టి పశువులన్నింటిని తరుము తారు. అదే చిట్లా కుప్ప. ప్రస్తుతం ఈ సంప్రాదాయం కనుమరుగైనది.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |