చిత్తోర్గఢ్ ముట్టడి (1303)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Siege of Chittor
తేదీJanuary - August, 1303
ప్రదేశంChittor Fort
ఫలితంKhalji victory
ప్రత్యర్థులు
మూస:Country data Delhi SultanateMewar
సేనాపతులు, నాయకులు
మూస:Country data Delhi Sultanate Alauddin KhaljiRatnasimha

1303 లో ఢిల్లీ సుల్తానేటు పాలకుడు అలావుద్దీను ఖల్జీ ఎనిమిది నెలల సుదీర్ఘ ముట్టడి తరువాత గుహిలా రాజు రత్నసింహ నుండి చిత్తోరు కోటను స్వాధీనం చేసుకున్నాడు. చారిత్రాత్మకంగా ఆధారరహితమైన పద్మావతు కథనంతో సహా అనేక పురాణ వృత్తాంతాలలో ఈ వివాదం వివరించబడింది. ఇది రత్నాసింహ అందమైన భార్య పద్మావతిని పొందడం లక్ష్యంగా చేసుకుని అలౌద్దీను చిత్తోరు మీద చేసినదాడి అని పేర్కొంది.

నేపథ్యం

[మార్చు]

వాయవ్య భారతదేశంలోని మేవారు ప్రాంతాన్ని గుహిలా రాజవంశం పాలించింది. వారు చిత్తూరు కోట (చిత్తోర్‌గఢ్) కేంద్రంగా చేసుకుని పాలించారు. 1299 లో అల్లావుద్దీను జనరలు ఉలుగు ఖాను గుజరాతు వెళ్ళేటప్పుడు మేవారు ప్రాంతం మీద దాడి చేశాడు. అయినప్పటికీ ఇది తీవ్రమైన దండయాత్ర కాకుండా తేలికపాటి దాడి అని భావించబడింది. గుహిలా రాజు సమరసింహ తన దేశాన్ని దాడి నుండి రక్షించాడు.[1] బహుశా కప్పం అర్పించడం ద్వారా.[2]

1301 లో అల్లావుద్దీను ఢిల్లీ, చిత్తూరు మధ్య ఉన్న రణతంబోరును జయించి ఢిల్లీకి తిరిగి వచ్చాడు. అదే సంవత్సరం రత్నసింహ చిత్తోరు సింహాసనాన్ని అధిష్టించాడు.[3] మాలికు మొహమ్మదు జైసీ పురాణ కవిత పద్మావతు ఆధారంగా వచ్చిన పురాణాలు రత్నసింహ రాణి (ఈ ఇతిహాసాలలో రతను సేను లేదా రతను సింగు అని పిలుస్తారు) పద్మిని పొందటానికి అలావుద్దీన్ చిత్తోరు మీద దండెత్తినట్లు పేర్కొన్నాడు. ఈ ఇతిహాస కథనాల ఆధారంగా రాఘవ అనే వ్యక్తి పద్మిని అసాధారణ సౌందర్యం గురించి అలావుద్దీనుతో చెప్పాడు.[4] ఏది ఏమయినప్పటికీ అల్లావుద్దీను చిత్తూరును జయించిన తొలి రికార్డులలో పద్మిని గురించి ప్రస్తావించలేదు. అమీరు ఖుస్రావు, బారాణి, ఇసామి రాసిన చరిత్రలు. చాలా మంది ఆధునిక చరిత్రకారులు పద్మిని పురాణం ప్రామాణికతను తిరస్కరించారు.[5]

ముట్టడి

[మార్చు]
Chittor Fort in 2011

1303 జనవరి 28 న అలావుద్దీను పెద్ద సైన్యంతో చిత్తూరుకు తన దండయాత్రను ప్రారంభించాడు. కోట దగ్గరకు వచ్చిన తరువాత ఆయన బెరాచు, గంభీరి నదుల మధ్య ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన సైన్యం అన్ని వైపుల నుండి కోటను చుట్టుముట్టింది. అలావుద్దీను కోటకు ఉత్తరాన ఉన్న చితోరి కొండ వద్ద తన సైన్యాలను నిలబెట్టాడు.[6]

ముట్టడి దాదాపు 8 నెలలు కొనసాగింది. ఇది రక్షకులు బలమైన ప్రతిఘటనను సూచిస్తుంది. అలావుద్దీనుతో కలిసి చిత్తూరుకు వచ్చిన అమీరు ఖుస్రావు ఈ ముట్టడిని క్లుప్తంగా తన ఖాజైను ఉలు-ఫుతుహులో వివరించాడు. ఏదేమైనా ముట్టడి కార్యకలాపాల గురించి వివరణాత్మక ఆధారాలు అందుబాటులో లేదు.[7] ఆక్రమణదారుల దాడులు రెండుసార్లు విఫలమయ్యాయని ఖుస్రావు సూచిస్తున్నారు. వర్షాకాలం రెండు నెలలలో రక్షకులు కొండ "మద్యకు"కు చేరుకోగలిగారు. కాని మరింత ముందుకు సాగలేరని ఆయన చెప్పాడు. అల్లావుద్దీను కోటను ముట్టడి ఇంజిన్ల (ముంజానిక్సు)ద్వారా రాళ్ళతో కొట్టాలని ఆదేశించాడు. ఆయన సాయుధ సైనికులు అన్ని వైపుల నుండి దాడి చేశారు.[6]

కోట దండు కరువు లేదా అంటువ్యాధితో బాధపడి ఉండవచ్చు. 1303 ఆగస్టు 26 న అలావుద్దీను కోటలోకి ప్రవేశించాడు.[6]తన విజయం తరువాత అలావుద్దీను చిత్తోరు జనాభాను సాధారణ ఊచకోతకు ఆదేశించాడు. అమీరు ఖుస్రావు అభిప్రాయం ఆధారంగా ఈ దాడి ఫలితంగా 30,000 మంది హిందువులు "పొడి గడ్డి వలె నరికివేయబడ్డారు".[8]

రత్నసింహా విధి

[మార్చు]

చిత్తూరు పాలకుడు రత్నసింహకు ఏమి జరిగిందో వివరించే కథనాలు మారుతూ ఉంటాయి. ప్రారంభ ముస్లిం చరిత్రకారులు అమీరు ఖుస్రావు, జియావుద్దీను బరానీ, ఇసామి, చిత్తూరు పాలకుడు ("రాయ్") అలావుద్దీనుకు లొంగిపోయి తరువాత క్షమించి వదిలివేయబడ్డాడని పేర్కొన్నాడు.[9][10] జైను రచయిత కక్క సూరి (1336) అలావుద్దీను ఆయన సంపదను దోచుకుని "ఆయనను ఒక కోతిలాగా ఒక నగరం నుండి మరొక నగరానికి తరలించేలా చేసాడు" అని పేర్కొన్నాడు.[11]

ముట్టడి మొట్టమొదటి హిందూ నమోదిత ఆధారాలు అయిన సా.శ. 1460 నాటి కుంభల్గఢ్ ప్రశస్తి (యులోజిస్టికు శాసనం), రత్నసింహ యుద్ధభూమి నుండి "బయలుదేరాడు" అని పేర్కొంది. ఆ తరువాత లక్ష్మసింహ కోటను కాపాడుతూ మరణించాడు. ఎందుకంటే పిరికివారు మాత్రమే స్థిరపడిన సంప్రదాయాలను విడిచిపెడతారు"," ధైర్యవంతులు, స్థిరంగా ఉన్నవారు తమ వృత్తిని వదులుకోరు.[12][13] ఆధునిక చరిత్రకారులు" బయలుదేరిన " (సంస్కృతంలో టాస్మిను గేటు) అనే పదాన్ని విభిన్నంగా అన్వయించారు. అంటే రత్నసింహ పోరాడుతూ మరణించాడు లేదా ఆయన రక్షకులను విడిచిపెట్టి లొంగిపోయాడని అర్థం స్పురిస్తుంది.[14]

అలావుద్దీను కోటను ఆక్రమించుకునే ముందు, కుంభాల్నేరు పాలకుడితో జరిగిన పోరాటంలో రత్నసింహ ("రతను సేను") మరణించాడని పద్మావతు పురాణం పేర్కొంది.[15] రజపుత్ర పోషణలో రాసిన 17 వ శతాబ్దపు చరిత్రకారుడు ముహ్నోతు నైన్సీ, రత్నసింహ యుద్ధరంగంలో మరణించాడని పేర్కొన్నాడు.[4]

జౌహరు

[మార్చు]

16 వ శతాబ్దపు పురాణ కవిత పద్మావతు, రత్నాసింహ రాణి పద్మిని, ఇతర మహిళలు అలౌద్దీను చేత పట్టుబడకుండా ఉండటానికి జౌహరు (సామూహిక స్వీయ-ప్రేరణ) ద్వారా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వాదన తరువాత అనేక గ్రంథాలలో కూడా పునరావృతమవుతుంది. చరిత్రకారుడు కిషోరి శరణు లాలు పద్మావతును చారిత్రక గ్రంథంగా కొట్టిపారేశారు. కాని అలావుద్దీను విజయం తరువాత చిత్తూరు వద్ద జౌహరు జరిగిందని నమ్ముతారు.[16] మరోవైపు సమకాలీన రచయిత అమీరు ఖుస్రావు చిత్తూరు వద్ద ఏ జౌహరు గురించి ప్రస్తావించలేదని బనార్సీ ప్రసాదు సక్సేనా పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన ఇంతకు ముందు రణతంబోరును జయించిన సమయంలో జౌహరు గురించి ప్రస్తావించాడు. అందువలన చిత్తోరు వద్ద జౌహరు కథ తరువాతి రచయితల కల్పన అని సాక్సేనా అభిప్రాయపడ్డారు.[9]

తరువాత

[మార్చు]

ఆ సమయంలో 7 లేదా 8 సంవత్సరాల వయస్సులో ఉన్న తన కుమారుడు ఖిజ్రు ఖాను (లేదా ఖిదరు ఖాను) కు చిత్తోరుకు అలావుద్దీను కేటాయించాడు. చిత్తూరు కోటను యువరాజు తర్వాత "ఖిజ్రాబాదు"గా మార్చారు.[9] ఖిజ్రు ఖానుకు బంగారు-ఎంబ్రాయిడరీ వస్త్రాన్ని, ఎరుపు పందిరిని ఇచ్చారు. ఇది సాధారణంగా స్పష్టంగా వారసుడికి ఇవ్వబడుతుంది. అలావుద్దీను మరో 7 రోజులు చిత్తూరులో ఉండి, మంగోలు దండయాత్ర గురించి తెలుసుకున్న తరువాత ఢిల్లీకి బయలుదేరాడు. [4] 1310 మే 13 నాటి చిత్తూరులోని ఒక ముఖ్యమైన శాసనం అలావుద్దీనును పాలకుడిగా నమోదు ఖల్జీలు ఈ స్థలాన్ని ఖాళీ చేయలేదని సూచిస్తుంది.[17]

ఖిజ్రు ఖాను చిన్నపిల్లవాడు మాత్రమే కావడంతో అసలు పరిపాలన మాలికు షాహిను అనే బానిసకు అప్పగించబడింది. ఆయన నైబు-ఐ బార్బెకు పదవిలో ఉన్నాడు. అలావుద్దీను తన కొడుకును పిలిచాడు.[9] 14 వ శతాబ్దపు చరిత్రకారుడు ఇసామి అభిప్రాయం ఆధారంగా మాలికు షాహిను కొంతకాలం తరువాత వాఘేలా రాజు కర్ణుడికి భయపడి కోట నుండి పారిపోయాడు. అలావుద్దీను 1299 దాడి తరువాత పొరుగున ఉన్న గుజరాతు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. [18]

తరువాత హిందూ పాలకుడి ద్వారా పరోక్షంగా చిత్తూరును పరిపాలించడం ఉత్తమం అని అలావుద్దీను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన చిత్తోరు పాలనను ఖిజ్రు ఖాను నుండి చాహమాన ప్రతినిధి మలదేవ (మాల్డియో) కు బదిలీ చేశాడు. ఆయనకు స్థానికులు మద్దతు ఇచ్చారు. [18] మలదేవ కన్హాదదేవుడి సోదరుడు. కన్లాదదేవ అలావుద్దీను జలోరు కోటను ముట్టడి చేసిన సమయంలో అలౌద్దీను ప్రాణాలను ప్రమాదం నుండి కాపాడాడు.[16] మలదేవ ఆయన ఆదేశించినప్పుడల్లా 5,000 మంది గుర్రపు సైనికులను, 10,000 మంది పదాతిదళాలను అల్లావుద్దీను పోరాటానికి అందించాడు. ఆయన వార్షికంగా అలావుద్దీను రాజ్యసభను సందర్శించడానికి వచ్చే సమయంలో అలావుద్దీను కోసం బహుమతులు తీసుకువచ్చేవాడు. బదులుగా అక్కడ ఆయనకు తగిన గౌరవసత్కారాలు లభించాయి.[18] అలావుద్దీను చిత్తోరు వద్ద ఒక సామ్రాజ్య సైనికదండును నిర్వహించాడు. అక్కడ ఆయన శాసనాలలో ఒకటి (1310 మే నాటిది) కనుగొనబడింది. [18]

16 వ శతాబ్దపు చరిత్రకారుడు ఫిరిష్టా అభిప్రాయం ఆధారంగా అలావుద్దీను మరణ శిబిరంలో ఉన్నప్పుడు. చిత్తూరు పాలకుడు తిరుగుబాటు చేసి కోటలో ఉంచిన సామ్రాజ్య సైనికులను ఉరితీశాడు. 1321 లో మలదేవ మరణం తరువాత ఈ కోట గుహిలాసు సిసోడియా శాఖ పాలకుడు హమ్మీరు సింగు ఆధీనంలోకి వచ్చింది.[18] ఏది ఏమయినప్పటికీ మొదటి ఇద్దరు తుగ్లకు పాలకుల (1321-1350) పాలనలో, ఎపిగ్రాఫికు ఆధారాలు సూచించినట్లుగా ఈ కోట ఢిల్లీ నుండి పంపిన గవర్నర్ల నియంత్రణలో ఉందని చరిత్రకారుడు పీటరు జాక్సను అభిప్రాయపడ్డారు. జాక్సను ప్రకారం, మలదేవ, సిసోడియాసు గురించిన అంశాలు సంస్కృత ఇతిహాసం నుండి ఉద్భవించాయి. అయినప్పటికీ అవి చారిత్రక ఆధారాలుగా అంగీకారం పొందలేవు. [19]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kishori Saran Lal 1950, p. 84.
  2. Peter Jackson 2003, p. 197.
  3. Kishori Saran Lal 1950, p. 117.
  4. 4.0 4.1 4.2 Kishori Saran Lal 1950, p. 120.
  5. Satish Chandra 2004, p. 89.
  6. 6.0 6.1 6.2 Banarsi Prasad Saksena 1992, p. 367.
  7. Kishori Saran Lal 1950, p. 118.
  8. Kishori Saran Lal 1950, pp. 119–120.
  9. 9.0 9.1 9.2 9.3 Banarsi Prasad Saksena 1992, p. 368.
  10. Aditya Behl 2012, p. 177.
  11. Shyam Singh Ratnawat & Krishna Gopal Sharma 1999, p. 124.
  12. Rajendra Singh Kushwaha 2003, p. 273.
  13. Manjit Singh Ahluwalia 1978, p. 96.
  14. Akshaya Keerty Vyas 1937, pp. 313–314.
  15. Ramya Sreenivasan 2007, p. 209.
  16. 16.0 16.1 Kishori Saran Lal 1950, p. 130.
  17. Proceedings, Volume 28. Indian History Congress. 1966. p. 147.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 Banarsi Prasad Saksena 1992, p. 371.
  19. Peter Jackson 2003, p. 198.

జీవితచరిత్రలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]