చిత్త భ్రంశం (డెమెన్షియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్త భ్రంశం (డెమెన్షియా)
ఇతర పేర్లుడెమెన్షియా
చిత్తవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి చిత్రం
ప్రత్యేకతన్యూరాలజీ, మానసిక వైద్యము
లక్షణాలుఆలోచించడం, గుర్తుంచుకోగల సామర్థ్యం తగ్గడం, భావోద్వేగ సమస్యలు, భాష తో సమస్యలు, ప్రేరణ
సాధారణ ప్రారంభంక్రమంగా
కాల వ్యవధిదీర్ఘకాలికము
కారణాలుమతిమరపు వ్యాధి, వాస్కులర్ డిమెన్షియా, లెవీ బాడీలతో డిమెన్షియా, ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా
రోగనిర్ధారణ పద్ధతికాగ్నిటివ్ టెస్టింగ్, మినీ మానసిక స్థితి పరీక్ష
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిమతిభ్రంశం
నివారణప్రారంభ విద్య, అధిక రక్తపోటును నివారించడం, స్థూలకాయం నిరోధించడం, ధూమపానం మానడం, సామాజికంగా చురుకుగా ఉండడం
చికిత్సఇంటా బయటా సహాయం
తరుచుదనము46 మిలియన్ (2015)
మరణాలు1.9 మిలియన్ (2015 నాటికి)

చిత్త భ్రంశం (డెమెన్షియా) లేదా చిత్తవైకల్యం అనేది మేధస్సు పనితీరులో గణనీయమైన క్షీణత కలిగించే ఒక వైద్య సంబంధమైన రుగ్మత.[1] వృద్ధాప్యంలో చిత్త భ్రంశం డెమెన్షియా ఒక ప్రధానమైన సమస్య. డెమెన్షియాలో బ్రెయిన్ ఫంక్షన్ చాలా వకు తగ్గిపోతుంది. మెదడు సరిగ్గా పనిచేయదు. బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోవడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆలోచించే తీరులో మార్పు వస్తుంది. మాట తీరు కూడా మారుతుంది. నిర్ణయాలు తీసుకోవడం సరిగ్గా ఉండవు. ప్రవర్తనలో కూడా మార్పు రావడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల ఏర్పడే పరిణామం[2]. ఆల్జీమర్స్ డిసీజ్ డెమెన్షియాలో ప్రధానమైనది. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళల్లో నూటికి రిశాతం మందిలో ఆల్జీమర్స్ డిసీజ్ కనబడుతుంది. స్త్రీలల్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళల్లో కంటే 2-3 రెట్లు ఎక్కువ ఈ వ్యాధి కనబడుతుంది. వాళ్ళల్లో ఈస్ట్రోజన్ తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా భావించాలి.డెమెన్షియా 65 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో 3 - 11 శాతం మందిలో ఉంటుంది.డెమెన్షియా అనేది ఒక వ్యాధి కాదు. అది వివిధ లక్షణాలు సమ్మేళనం.వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియా వ్యాధికి చికిత్సలేదని కేవలం నివారణ ఒక్కటే మార్గం.వ్యాధికి గల కచ్చితమైన కారణాలు కూడా సరిగ్గా చెప్పలేము అయితే వంశపారంపర్యంగానూ, జీవన విధానం వల్ల మాత్రం వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి.పెళ్లయిన వారితో పోల్చితే ఒంటరిగా ఉన్నవారికి డెమెన్షియా ముప్పు రెట్టింపు ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల మత్తు మందుకి అలవాటు పడడం వల్లన కూడా ఈ వ్యాధి రావచ్చు.

సాధారణంగా ముడిపడి ఉన్నలక్షణాలు: జ్ఞానం సామర్థ్యం తగ్గిపోవడం జ్ఞాపకశక్తి తగ్గిపోవడం శారీరక, మానసిక స్థితి మార్పులు మానసికచలనం మందగించడం

ప్రారంభ దశ లక్షణాలు: నిరాశ, ఉదాసీనత

తరువాత దశ లక్షణాలు: ఆందోళన, చిరాకు, విభ్రాంతి, క్రమరహితంగా తిరుగుతూ ఉండడం

చివరి దశ లక్షణాలు: నిగ్రహరాహిత్యం, గందరగోళ నడక, మ్రింగుటలో కష్టాలు, కండరాల సలుపు

చిత్త భ్రంశం (డెమెన్షియా) రావటాని కొన్ని కారణాలు[3]

చెవుడు - 9 శాతం

చదువులో విఫలం చెందటం - 8 శాతం

ధూమపానం - 5 శాతం

కుంగుబాటుకు చికిత్స తీసుకోకపోవడం - 4 శాతం

శారీరక శ్రమ లేకపోవడం - 3 శాతం

ఒంటరితనం - 2 శాతం

అధిక రక్తపోటు - 2 శాతం

స్థూల కాయం - 2 శాతం

మధుమేహం - 1 శాతం

చిత్త భ్రంశం (డెమెన్షియా) లో రకాలు

[మార్చు]

ఇడియోపతిక్ లేదా ప్రైమరీ డిజెనెరేటివ్ డెమెన్షియా : వృద్ధాప్యం రావడంతో బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోయి ఏర్పడే పరిస్థితి ఇటువంటి డెమెన్షియా మెదడులోని కార్డికల్ ఏరియా, సభకార్డికల్ ఏరియా రెండింటిలోను డిజనరేటివ్ ప్రాసెస్స్ కొనసాగుతుంది. ఆల్జీమర్స్ డిసీజ్ ఈ కేటగిరీకి చెందినది.

వాస్క్యులర్ డెమెన్షియా : మెదడుకి రక్తం అందించే రక్తనాళాలు సన్నబడటంతో వచ్చే చిత్త భ్రంశం

సెకండరీ డెమెన్షియా : కొన్ని కారణాల వల్ల బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినడంతో మెదడుకి వైరల్ ఎస్కీ ఫైటిస్, ఎయిడ్స్ ఇతర మెదడు వ్యాధులు రావడం వల్ల తలకి తీవ్రంగా గాయాలు అవడం వల్ల కూడా డెమెన్షియా ఏర్పడుతుంది[4].

అంతేకాక థైరాయిడ్ డిసీజ్ వల్ల, మూత్రపిండాలు, కాలేయం వ్యాధులు వల్ల, మధుమేహం విటమిన్ బి - 12, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా డెమెన్షియా వస్తుంది. పౌష్టికాహారం లోపం వల్ల కూడా బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది. ముఖ్యంగా మెదడులో కంతులు (ట్యూమర్) ఆవడం వల్ల కూడా డెమెన్షియా కలుగుతుంది.

ఇది కూడా చూడండి

[మార్చు]

మతిమరపు వ్యాధి లేదా అల్జీమర్స్

మూలాలు

[మార్చు]
  1. "చిత్తవైకల్యం (డెమెన్షియా): లక్షణాలు, కారణాలు, చికిత్స, మందులు, నివారణ, వ్యాధినిర్ధారణ - Dementia in Telugu". myUpchar. Retrieved 2020-09-09.
  2. https://tv9telugu.com/35-years-crossed-memory-loss-soon-137829.html[permanent dead link]
  3. "పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!". BBC News తెలుగు. Retrieved 2020-09-09.
  4. Hospitals, Yashoda (2020-05-11). "దెబ్బ కారణంగా మెదడుకు గాయం లక్షణాలు, చికిత్స | Concussion Causes and Treatments". Yashoda Hospitals (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-09.