చిత్రం భళారే విచిత్రం (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రం భళారే విచిత్రం అనే ఈ పాటకు సంగీతం అందించిన పెండ్యాల నాగేశ్వరరావు చిత్రం

చిత్రం భళారే విచిత్రం ...... అను ఈ పాట దానవీరశూరకర్ణ (1977) అను ఈ సినిమా లోనిది.ఈ పాటకి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించగా...డా. సి. నారాయణ రెడ్డి సాహిత్యంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించగా, ఎన్. టి. రామారావు, ప్రభ అభినయించారు.

పాట[మార్చు]

పల్లవి :

అతడు:

చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం

ఆమె:

చిత్రం...అయ్యారే విచిత్రం

అతడు:

ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం..

ఆమె:

పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం..

చిత్రం అయ్యారే విచిత్రం..

అతడు:

చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం...

చరణం1 :

అతడు:

రాచరికపు జిత్తులతో.. రణతంత్రపుటెత్తులతో..ఓ ఓ ఒ హొ హొ..

రాచరికపు జిత్తులతో.. రణతంత్రపుటెత్తులతో

సతమతమౌ మా మదిలో..మదనుడు సందడి సేయుటే

చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం

ఆమె:

ఎంతటి మహారాజైనా..ఆ ఆ ఆ..

ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో..

ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం!

అతడు:

ఆయ్... భళారే విచిత్రం.

ఆమె:

అయ్యారే విచిత్రం..

చరణం2 :

అతడు:

బింబాధరా మధురిమలు ..బిగికౌగిలి ఘుమఘుమలు..ఆ ఆ ఆ..

బింబాధరా మధురిమలు ..బిగికౌగిలి ఘుమఘుమలు..ఆ ఆ ఆ..

ఇన్నాళ్ళుగ మాయురే..మేమెరుగక పోవుటే ..చిత్రం

ఆమె:

ఆ హ ఆ ఆ...

వలపెరుగనివాడననీ...

వలపెరుగనివాడననీ.. పలికిన ఈ రసికమణి..

తొలిసారే ఇన్ని కళలు కురిపించుట..

అవ్వ..నమ్మలేని చిత్రం..

అయ్యారే విచిత్రం..

అతడు:

ఆయ్... భళారే విచిత్రం.

ఆమె:

అయ్యారే విచిత్రం

అయ్యారే విచిత్రం

అయ్యారే విచిత్రం

అయ్యారే విచిత్రం.

విశేషాలు[మార్చు]

  • ఈ సినిమా పేరుకి, కర్ణుడి గురించి అయినా ధుర్యోధనుడి పాత్రను మలిచిన తీరు అద్భుతం. ఎందుకంటే ఇంతవరుకు ఏ తెలుగు సినిమాలోని ప్రతినాయకుడి పరిచయానికి పాట లేదు. ఈ సినిమాలో ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.అలాగే ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే, ప్రతినాయకుడి పాత్రకి డ్యూయట్ సాంగ్ పెట్టాలనే అలోచనే ఒక అద్భ్తతం. ధీరోదాత్తుడు, మాన ధనుడయిన ధుర్యోధనునికి ఒక యుగళ గీతం పెట్టడమనేది ఒక సాహస మైన ప్రయోగము. ఎవరెన్ని సందేహాలను వెలిబుచ్చినా...... శ్రీ ఎన్.టి.రామావు వాటినన్నిటిని ప్రక్కన బెట్టి స్వీయ దర్శకత్వంలో ఆ పాటను చిత్రీకరించి అందరి మన్ననలు పొంద గలిగారి. ఆ సన్నివేశానికి అనుగుణంగా శ్రీ సి.నారాయణ రెడ్డి పాటను అత్యద్భుతంగా వ్రాసి శబాష్ అనిపించుకున్నారు.
  • ఇదే పాట పేరుతో చిత్రం భళారే విచిత్రం 1992 సంవత్సరంలో తెలుగు సినిమా విడుదలైనది.