చిత్రకోట్ జలపాతం

వికీపీడియా నుండి
(చిత్రకూట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చిత్రకోట్ జలపాతం
చిత్రకోట్ జలపాతం
చిత్రకోట్ జలపాతం is located in Chhattisgarh
చిత్రకోట్ జలపాతం
ప్రదేశంబస్తర్ జిల్లా, చత్తీస్‌గఢ్
అక్షాంశరేఖాంశాలు19°12′23″N 81°42′00″E / 19.206496°N 81.699979°E / 19.206496; 81.699979
రకంCataract
మొత్తం ఎత్తు29 మీటర్లు (95 అ.)
బిందువుల సంఖ్య3
నీటి ప్రవాహంఇంద్రావతి నది

చత్తీస్‌గఢ్‌ లోని జగదల్‌పూర్ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఉన్న జలపాతమే చిత్రకోట్ జలపాతం. దీన్ని చిత్రకూట్ జలపాతం అని కూడా అంటారు. చిత్రకోట్ జలపాతముల దగ్గర పర్యాటకుల కోసం నిర్మించబడిన అతిథి గృహములు కూడా ఉన్నాయి.

ఈ జలపాతం ఎత్తు 29 మీటర్లు.[1][2] ఇది భారతదేశంలోకెల్లా వెడల్పైన జలపాతం. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు ఉంటుంది.[3] దీని వెడల్పు కారణంగా దీన్ని భారతదేశపు నయాగరా అని అంటారు.[4] నీటి ప్రవాహం తక్కువగా ఉన్నపుడు ఈ జలపాతం మూడు పాయలుగా దూకుతుంది.

చిత్రకోట్ జలపాతం గుర్రపునాడా ఆకరంలో ఉంటుంది. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు, గుర్రపు నాడా మొత్తంపై నీరు దూకుతూ ఉంటుంది. వరదనీరు వచ్చే కాలంలో ప్రవాహంలో మట్టి కూడా వస్తుంది. .[5][6]

ఈ జలపాతం వద్ద ఒక శివాలయం ఉంది. జలపాతానికి ఎడమ వైపున సహజంగా ఏర్పడీన గుహలున్నాయి. వీటిని పార్వతి గుహలు అంటారు..

చిత్రకోట్ జలపాతం, కింద జలాశయం

మూలాలు

[మార్చు]
  1. "Chitrakote Waterfalls, Bastar". Chhattisgarh Tourism Board. Archived from the original on 26 June 2015. Retrieved 25 June 2015.
  2. Kale 2014, pp. 251–53.
  3. Singh 2010, p. 723.
  4. Puffin Books (15 November 2013). The Puffin Book of 1000 Fun Facts. Penguin Books Limited. p. 12. ISBN 978-93-5118-405-8.
  5. Patro, Jagdish (14 December 2013). "Chitrakoot Waterfalls – The Niagara Falls of India". India Study channel. Archived from the original on 12 జూన్ 2020. Retrieved 12 జూన్ 2020.
  6. Terryn 2011.