Jump to content

చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి

వికీపీడియా నుండి
(చిరుమామిళ్ళ సుబ్బదాసు నుండి దారిమార్పు చెందింది)
చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి
జననం1802[1]
ధర్మవరం, దుర్గి మండలం, గుంటూరు జిల్లా[1]
మరణం1882
ధర్మవరం
మరణ కారణంస్వచ్ఛంద మరణం
ఇతర పేర్లుచిరుమామిళ్ళ సుబ్బదాసు
వృత్తికవి, వాగ్గేయకారుడు
తల్లిదండ్రులు
  • చిరుమామిళ్ళ నరసయ్య (తండ్రి)
  • తిరుమలమ్మ (తల్లి)

చిరుమామిళ్ళ సుబ్బదాసుగా పేరు గాంచిన చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి (1802-1882) గుంటూరు జిల్లాకు చెందిన వాగ్గేయకారుడు. ఆయన పలనాటి ప్రాంతంలో సుప్రసిద్ధ కవిగా నిలిచారు.[2] ఈయన దుర్గి వేణుగోపాలుని భక్తుడు. ఈయన ఆధ్యాత్మిక గురువు అద్దంకి తిరుమల తాతాచార్య దేశికులు. ఎన్నో భక్తి రచనలు చేసినా కులవృత్తియైన వ్యవసాయాన్ని మాత్రం వీడలేదు.

జీవిత విశేషాలు

[మార్చు]

గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతం దుర్గి మండలం ధర్మవరం (దుర్గి) గ్రామంలో చిరుమామిళ్ల నరసయ్య తిరుమలమ్మ కుమారునిగా సుబ్రహ్మణ్య కవి 1802లో జన్మించారు. అద్దంకి తిరుమల తాతాచార్యదేశికుల వద్ద గురూపదేశాన్ని పొంది సుబ్బదాసుగా ప్రసిదుడయ్యారు. సంగీత సాహిత్యాలపై మక్కువ కలిగిన సుబ్బదాసు అంబరీషోపాఖ్యానము కావ్యా న్ని రచించి దుర్గి వేణుగోపాలునికి అంకితమిచ్చారు. సహజ పాండిత్యం ఉన్న సుబ్బదాసు నానార్ధ స్తవము, రుగ్మాంగద చరిత్ర, త్రిలోక వందిత శతకము, చిత్తశతకము, భక్త వశవర్తి శతకము, గోపాల శతకము, కేశవ శతకము, శ్రీదుర్గి పురీశ శతకము, నిఖిల విచిత్ర శతకము, నృశింహ సీస పంచకము, శ్రీరామస్తుతి, రామసీస పంచకము, కంద పంచవింశతి, శ్రీకృష్ణస్తవములను రచించారు. అనేక కీర్తనలను రచించి స్వయంగా పా డుతూ భక్తులకు వినిపించేవారు. పలనాటి పోతనగా పేరుపొందిన సుబ్ర మణ్య కవి భక్తి చరితములు, సీసార్ధములు, కందార్ధములు, దరువులు, తత్వములు, కీర్తనలు, దండకాలు, సూర్ణికలను రచించారు. అడిగొప్పుల, ఒప్పిచెర్ల గ్రామాల్లో అంటు రోగాలు ప్రబలినప్పుడు వారికి వైద్య సాయాన్ని అందించి అందరి మెప్పు పొందారు. సుబ్బదాసు తన స్వీయ చరిత్రను రచించినట్లు తెలుస్తున్నప్పటికీ అది అలభ్యంగా ఉంది. సుబ్బదాసు 1882 పుష్య బహుళ అష్టమినాడు ధర్మవరంలో స్వచ్ఛంద మరణము పొందారు. ప్రజలు ఏటా వారి ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 రామారావు, నల్లూరి (1989). శ్రీ చిరుమామిళ్ళ సుబ్బదాసు జీవితం-శతక సాహిత్యం. నరసరావుపేట: నల్లూరి రామారావు. p. 1. Archived from the original on 2017-09-06. Retrieved 2019-05-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-27. Retrieved 2016-07-20.