అడిగొప్పుల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడిగొప్పుల
—  రెవిన్యూ గ్రామం  —
అడిగొప్పుల is located in ఆంధ్ర ప్రదేశ్
అడిగొప్పుల
అక్షాంశరేఖాంశాలు: 16°26′17″N 79°37′24″E / 16.438021°N 79.623414°E / 16.438021; 79.623414
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం దుర్గి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వలపా చినరాములు
జనాభా (2011)
 - మొత్తం 8,816
 - పురుషుల సంఖ్య 4,424
 - స్త్రీల సంఖ్య 4,392
 - గృహాల సంఖ్య 2,280
పిన్ కోడ్ 522 612
ఎస్.టి.డి కోడ్ 08642

అడిగొప్పుల, గుంటూరు జిల్లా దుర్గి మండలములోని గ్రామము. పిన్ కోడ్: 522 612., ఎస్.టి.డి. కోడ్ = 08642.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామము పలనాడు ప్రాంతంలో ఉంది. ఈ గ్రామము మాచర్లకు 21 కి.మీ దూరంలో మరియు కారంపూడికి 12 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామము మాచర్ల నియోజకవర్గములో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

నిదానంపాడు 5 కి.మీ, ఓబులేశునిపల్లి 7 కి.మీ, ధర్మవరం 8 కి.మీ, నర్మలపాడు 2 కి.మీ, మిరియాల 5 కి.మీ, మాడుగుల 8 కి.మీ, రామాపురం 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన గురజాల మండలం, తూరుృ కారంపూడి మండలం, పశ్చిమాన దుర్గి మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

విద్యుత్తు ఉపకేంద్రo[మార్చు]

అడిగొప్పుల గ్రామంలో, గుట్టమీద సెంటరు సమీపంలో, కారంపూడి వెళ్ళే దారిలో, ఒక ఎకరం పోరంబోకు భూమిలో, ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రం నిర్మాణం పూర్తి అయినది. ఈ కేంద్రం వలన, అడిగొప్పుల గ్రామంతోపాటు, చుట్టుప్రక్క గ్రామాలయిన ధర్మవరం, ఓబులేశునిపల్లె, రాజానగర్, నిదానంపాడు గ్రామాలలో గూడా, లో వోల్టేజ్ సమస్య తీరిపోగలదు. ఈ కేంద్రం 2015, ఏప్రిల్-17వ తేదీనాడు ప్రారంభించారు. [8]

  • ఎస్.సి.కాలనీలోని కమ్యూనిటీ హాలు.
  • గ్రామంలో సి.సి.రహదారులు ఏర్పరచుకున్నారు.

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలో 32 ఎకరాలలో విస్తరించియున్న మంచినీటి చెరువులో, 3 సంవత్సరాల క్రితం, నెదర్లాండ్స్ దేశ సహకారంతో ఒక త్రాగునీటి పథకాన్ని ఏర్పాటుచేసారు. కానీ ఒక సంవత్సరం పనిచేసిన ఈ పథకం తరువాత మూలనపడినది. అందువలన గ్రామస్థులు వేసవిలో త్రాగునీటికి పలు కష్టాలు పడినారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులకు 3 లక్షల రూపాయలు మంజూరుకాగా, ఆ నిధులతో పూడికతీత పనులు నిర్వహించారు. రైతులు సారవంతమైన ఈ పూడికమట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొని పోయినారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గినదని రైతులు సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ కుడికాలువనుండి ఈ చెరువును, మోటార్లతో నీటిని నింపగా చెరువులో జలకళ సంతరించుకున్నది. [12]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామం సమీపం నుండియే నాగార్జునసాగర్ కుడికాలువ ప్రవహించుచుండటంతో, ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ, ఐకమత్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. [4]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామం నియోజకవర్గంలోనే అతిపెద్దది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వలపా చినరాములమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం (ఫోన్ నం. 08642/256333. సెల్= 9963574678) :- ఈ గ్రామం సమీపంలో ఉన్న నిదానంపాటి అమ్మవారి క్షేత్రం నల్లమల అటవి ప్రాంతానికి సమీపాన ఉంది. ఈ క్షేత్రానికి సుమారు 700 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాలుణమాసంలో పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ తిరుణాళ్ళకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. [3]
  2. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ గ్రామంలో 2014, మే-30 శుక్రవారం నాడు, బొడ్రాయి, శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు, పలు దేవతామూర్తుల ప్రతిష్ఠా వార్షికోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. [6]
  3. శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 12 ఎకరాల మాన్యంభూమి ఉంది. [7]
  4. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ గ్రామములో, 20 లక్షల రూపాయల గ్రామస్థుల, పలువురి దాతల సహకారంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంతోపాటు, ఆలయ ధ్వజస్తంభం, విమాన శిఖరం, బలిపీఠం ప్రతిష్ఠాపన మహోత్సవాలు 2015, జూన్-6వ తేదీ శనివారం ఉదయం నిర్వహించారు. పలువురు ఋత్విక్కులు వేదమంత్రాలనడుమ, ఉదయం 7-30 కి నిత్యపూజ, 8 గంటలకు గర్తపూజ, 8-20కి రత్నన్యాసం, 8-46 గంటలకు యంత్రస్థాపన, తదుపరి శ్రీ సీతారామాంద్రస్వామితోపాటు, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధవజస్తంభం, విమానశిఖరం, బలిపీఠం లను ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలనుండి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం గ్రామములో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [9]
  5. శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం:- అడిగొప్పుల గ్రామ శివారులో, సాగరు కుడికాలువ సమీపంలో, మేదరవారికుంట సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని, గ్రామానికి చెందిన మేదరసంఘంవారు, 8 లక్షల రూపాయలతో నూతనంగా పునర్నిర్మించారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-12వ తేదీ శుక్రవారం ఉదయం 9-20 గంటలకు, పలువురు ఋత్విక్కుల వేదమంత్రాల నడుమ, ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నివహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఈ గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసారు. [10]
  6. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, అడిగొప్పల గ్రామంలోని గుట్టమీద కూడలిలో ఉంది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉంది. [7]
  7. శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయం.
  8. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.
  9. శ్రీతలాదేవి (బొడ్డు రాయి)

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఒక్కపుడు ఈ గ్రామం మవోయిస్టులతో మారుమ్రోగేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. పిల్లలను ఉన్నత ఉద్యోగాల కోసం కష్టపడి చదివించుచూ పట్టణాలకు పంపించుచున్నారు. గ్రామంలోని పలువురు యువకులు రాష్ట్రంలోనేగాక, ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలో గూడా కొలువులు చేపట్టినారు. గ్రామంలోని కొందరు యువకులు, గ్రామాభివృద్ధిని కాంక్షించి, అన్ని కులాలవారితోనూ కలిసి, ఒక గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పరచుకొని, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టుచున్నారు. [11]

ఈ గ్రామానికి చెందిన కోండ్రు శాంతి అను విద్యార్థిని, చిలకలూరిపేటలోని ఎ.ఎం.జి. జూనియర్ కళాశాలలో చదువుచున్నది. ఈమె ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ క్యారంస్ ఛాంపియన్ షిప్ పోటీలలో, టీం ఛాపియన్ షిప్ విభాగంలో స్వర్ణపతకం మరియు వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది. [12]

గణాంకాలు[మార్చు]

2013 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 17250. పురుషుల సంఖ్య 9226, మహిళలు 8024, నివాసగృహాలు 4312, విస్తీర్ణం 5349 హెక్టారులు, సాగు భూమి 6,000 ఎకరాలు.

జనాభా (2011) - మొత్తం 8,816 - పురుషుల సంఖ్య 4,424 - స్త్రీల సంఖ్య 4,392 - గృహాల సంఖ్య 2,280

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మార్చ్-15; 11వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జూలై-22, 4వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఆగష్టు-5; 4వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మే-31; 4వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జూలై-3; 4వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మే-28; 4వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్; 2015, జూన్-7; 5వపేజీ. [10] ఈనాడు గుంటూరు రూరల్; 2015, జూన్-13; 4వపేజీ. [11] ఈనాడు గుంటూరు రూరల్; 2016, జనవరి-5; 4వపేజీ. [12] ది హిందు, ఆంగ్ల దినపత్రిక/విజయవాడ ఎడిషన్; 2016, ఏప్రిల్-7; 2వపేజీ.