అక్షాంశ రేఖాంశాలు: 16°25′19.200″N 79°33′18.000″E / 16.42200000°N 79.55500000°E / 16.42200000; 79.55500000

ఓబులేశునిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓబులేశునిపల్లి
పటం
ఓబులేశునిపల్లి is located in ఆంధ్రప్రదేశ్
ఓబులేశునిపల్లి
ఓబులేశునిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°25′19.200″N 79°33′18.000″E / 16.42200000°N 79.55500000°E / 16.42200000; 79.55500000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలందుర్గి
విస్తీర్ణం
48.97 కి.మీ2 (18.91 చ. మై)
జనాభా
 (2011)
4,940
 • జనసాంద్రత100/కి.మీ2 (260/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,425
 • స్త్రీలు2,515
 • లింగ నిష్పత్తి1,037
 • నివాసాలు1,254
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522612
2011 జనగణన కోడ్589826

ఓబులేశునిపల్లి, పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుర్గి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1254 ఇళ్లతో, 4940 జనాభాతో 4897 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2425, ఆడవారి సంఖ్య 2515. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 746 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1029. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589826[1].యస్.టీ.డీ.కోడ్ 08642.

సమీప గ్రామాలు

[మార్చు]

దుర్గి 2 కి.మీ, నిదానంపాడు 5 కి.మీ, ఆత్మకూరు 6 కి.మీ, కోలగట్ల 6 కి.మీ, అడిగొప్పుల 7 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి మాచర్లలో ఉంది. సమీప జూనియర్ కళాశాల దుర్గిలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఓబులేశునిపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 3 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ముగ్గురు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఓబులేశునిపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఓబులేశునిపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 2715 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 347 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 153 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1682 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 1318 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 364 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఓబులేశునిపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 364 హెక్టార్లు
  • నెమలికంటి చెరువు.

తయారీ

[మార్చు]

ఓబులేశునిపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో) :

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ప్రత్తి, మిరప, కంది

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]
  1. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలో ఈ పాఠశాల భవనాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. [8]
  2. సేక్రెడ్ హార్ట్స్ ఆంగ్ల మాధ్యమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. ఈ గ్రామ పంచాయతీకి 1964 లో జరిగిన ఎన్నికలలో, మాజీ ఎం.పీ. కోట సైదయ్య పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికలలో అవిర్నేని సత్యనారాయణను సర్పంచిగా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటినుండి 2006 వరకూ జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచులను ఏకగ్రీవంగానే ఎన్నుకొనుచూ ప్రభుత్వం ఇచ్చే నజరానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ సర్పంచులుగా కోట సైదయ్య, అవిర్నేని సత్యనారాయణ, అయినాల రామయ్య, రామినేడి ఆదినారాయణ, కుంకటగుంట నారాయణమ్మ, ఉల్లిగడ్డల చిన వెంకటేశ్వర్లు, రమావతు ఏగమ్మ, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, శ్రీరాందాసు నాగాచారి, కొర్రకూటి గంగరాజు, గుండాల అచ్చయ్య, సర్పంచులుగా ఎన్నికైనారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కొమ్ము ఏసుపాదం, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ ఆలయంలో 2017, జూన్-21వతేదీ బుధవారం రాత్రి గ్రామస్థులు ఆదిదంపతుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్-21న స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది.

బొడ్డురాయి

[మార్చు]
  1. ఈ గ్రామంలో శీతలపరమేశ్వరితోపాటు పలు దేవాలయాలను 2005లో ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం మే-31న వార్షిక ఉత్సవాలు నిర్వహించెదరు.
  2. ఈ గ్రామంలో 2014, మే-31, శనివారం నాడు, బొడ్రాయి, కనకదుర్గమ్మ, అభయాంజనేయస్వామి, గంగాభవాని, పోలేరమ్మ, నవగ్రహాల ఆలయాలలో, విగ్రహ ప్రతిష్ఠ అష్టమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు పుణ్య దంపతులు పీటలపై కూర్చుని, ప్రత్యేకపూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం, మే-31వ తేదీనాడు నిర్వహించెదరు.
  3. గ్రామంలో బొడ్రాయి, కనకదుర్గమ్మ, అభయంజనేయస్వామి, గంగా భవాని, పోలేరమ్మ, నవగ్రహల దేవతామూర్తుల నవమ వార్షికోత్సవాన్ని, గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఋత్విక్కుల వేదమంత్రాల నడుమ, పలువురు పుణ్యదంపతులు పీటలపై కూర్చుని, బొడ్రాయికి, ఆయా దేవాలయాలలోని దేవతామూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోయినవి. [7]
  4. ఈ గ్రామంలోని శీతలాపరమేశ్వరి (బొడ్డురాయి) ప్రతిష్ఠ పుష్కరోత్సవం, 2017, మే-24వతేదీ బుధవారంనాడు ప్రారంభమైనది. ఋత్విక్కుల వేదమంత్రాల నడుమ ఉదయం, గ్రామ ప్రధాన కేంద్రంలో ఉన్న బొడ్డురాయికి ప్రత్యేకపూజలు నిర్వహించి, గ్రామంలోని గ్రామదేవతలకు, పలు ఆలయాలలోని దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. విశేష మండపారాధన, హోమాలు, సూర్యనమస్కారాలు, గణపతి, నవగ్రహ, చండీ, నక్షత్ర, రుద్ర, మృత్యుంజయ, సుదర్శనహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 2017, మే-30, మంగళవారం వరకు నిర్వహించారు. వారంరోజులుగా గ్రామంలోని దేవతా విగ్రహాలకు పుష్కరోత్సవాలు నిర్వహించి 31వతేదీ బుధవారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. పలువురు ఋత్విక్కుల వేదమంత్రాల నడుమ హోమాలు పూజలు చేసారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [10]&[11]

శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం

[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, 2015, మే-31వ తేదీనాడు నిర్వహించారు.

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణమహోత్సవాలు, 2016, ఏప్రిల్-2వతేదీ శనివారంనాడు, దేవాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణమండపంనందు వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలో నిర్వహించిన పూజలలో 30 మందికి పైగా దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందజేసినారు. సాయంత్రం కళ్యాణ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో ణక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [9]

శ్రీ మడేలయ్యస్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, 2015, మే-31వ తేదీనాడు నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, కందులు, మిరప..

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ విశేషాలు

[మార్చు]

ఎన్నికల సమయంలోనే రాజకీయ సమీకరణాలతో కుస్తీ పట్టే ఈ గ్రామ ప్రజలు, తరువాత గ్రామ పురోగతికి చేయీ చేయీ కలుపుతారు. గెలుపు ఎవరైనా పల్లె బాగుకోసం ఐకమత్యంగా ఉంటారు. శ్రీ కోట సైదయ్య ఎం.పి., ఆయన సోదరుడు కాశయ్య, 5 ఎకరాల స్థలం కొని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. పాఠశాలకు పాలకేంద్రం నిర్వాహకులు ఒక తరగతి గదినీ, శ్రీ యాగంటి చినరామయ్య, మునుగోటి రామలక్ష్మయ్య చెరి ఒక గదినీ, ఎరువుల వ్యాపారులు మూడు గదులనూ, గ్రామస్థులు రెండు తరగతి గదులనూ, నిర్మించి ఇచ్చారు. ప్రభుత్వం ఆర్.వి.ఎం. నిధులు నాలుగు గదులకూ రు. 20 లక్షలూ మంజూరు చేసింది. 1994లో 50 మందితో 6వ తరగతితో ప్రారంభమైన పాఠశాలలో నేడు 350 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన శ్రీ కోట హనుమంతరావు రు. 1.5 లక్షలతో పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రముఖ న్యూరాలజిస్టు శ్రీ సుందరాచారి, సైన్స్ ల్యాబ్ కు పరికరాలూ, పురుగు మందు వ్యాపారులు కంప్యూటరునూ పాఠశాలకు అందజేశారు. 2006లో గ్రామస్తులందరూ బొడ్రాయితోపాటు దుర్గ, అభయాంజనేయస్వామి, పోలేరమ్మ, గంగమ్మ, నవగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ఎస్.సి. కమ్యూనిటీ హాలు, గ్రామపంచాయతీ కార్యాలయం, హిందూ శ్మశానవాటిక, ఎస్.సి.పాఠశాలకు భవనాల నిర్మాణం, గంగాదేవి కుంటలో పూడికతీత వగైరా పనులు చేశారు. హైదరాబాదులో ఉంటున్న గ్రామస్థుడు శ్రీ రామినేడి రాము, రెండు లక్షల రూపాయలతో శుద్ధజల యంత్రాన్ని ఏర్పాటుచేశారు. 2006లో పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం అందజేసిన 5 లక్షల రూపాయలనూ సద్వినియోగం చేసుకున్నారు. రు. 11 కోట్లతో రైసు మిల్లు నిర్మాణం చేసేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువమంది రైతులు విద్యావంతులు కావడంతో బోరుబావులు వేసుకొని ప్రత్తి, మిర్చి పంటలను పండించుచున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి, మంచి ఉద్యోగాలలో చేర్పించుకున్నారు. [3]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,684. ఇందులో పురుషుల సంఖ్య 2,334, స్త్రీల సంఖ్య 2,350, గ్రామంలో నివాస గృహాలు 1,101 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 4,897 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".