Coordinates: 16°25′27″N 79°29′34″E / 16.42423°N 79.492722°E / 16.42423; 79.492722

మించాలంపాడు (దుర్గి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మించాలంపాడు, పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం.

మించాలంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మించాలంపాడు is located in Andhra Pradesh
మించాలంపాడు
మించాలంపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°25′27″N 79°29′34″E / 16.42423°N 79.492722°E / 16.42423; 79.492722
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్ 08642

ఈ ప్రాంతం పేరు వింటే 'పుల్లరి ఉద్యమం' గుర్తుకొస్తుంది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారిలో కన్నెగంటి హనుమంతురావు పుట్టిన పురిటి గడ్డ. అతని నడిపిన ఉద్యమాలకు చూసి ఆనాటి తెల్లదొరలు గడగడలాడారు. ఆనాటి 'అడవి పుల్లరి' ఉద్యమం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తెల్లదొరల హయాంలో పల్నాడు ప్రాంతంలో పశువులను అడవిలో మేపాలంటే ఒక్కొక్క పశువుకు రెండు రూపాయల చొప్పున 'పుల్లరి' కట్టాల్సి వచ్చేది. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడైన కన్నెగంటి హనుమంతు అడవి పుల్లరికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం లేవదీశాడు. దీంతో అతని మీద పగబట్టిన బ్రిటీష్ ముష్కరులు 1922 ఫిబ్రవరి 22న అత్యంత క్రూరంగా కాల్చి చంపారు.ఆ సందర్బంలో అనేక మందిని జైళ్లలో పెట్టారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]