చెరువుకొమ్ముపాలెం (పొన్నలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెరువుకొమ్ముపాలెం, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన చిన్న గ్రామం.[1]. ఈ గ్రామం చెరువు గట్టున ఉంటుంది కనుక ఆ పేరు వచ్చిందంటారు. ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ ఊరికి నేరుగా బస్సు సౌకర్యం కూడా లేదు, ప్రక్కన వున్న కోటపాడు అగ్రహారంలో దిగి 1 కిలోమీటరు నడవాలి. ఊరిలోని పెద్దమనుషులు అందరు ఉదయం, సాయత్రం అగ్రహారంలో రచ్చబండ మీద కూర్చొని ఉంటారు.


చెరువుకొమ్ముపాలెం
గ్రామం
చెరువుకొమ్ముపాలెం is located in Andhra Pradesh
చెరువుకొమ్ముపాలెం
చెరువుకొమ్ముపాలెం
నిర్దేశాంకాలు: 15°16′59″N 79°48′00″E / 15.283°N 79.8°E / 15.283; 79.8Coordinates: 15°16′59″N 79°48′00″E / 15.283°N 79.8°E / 15.283; 79.8 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపొన్నలూరు మండలం
మండలంపొన్నలూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523 111 Edit this at Wikidata

సుమారుగా 200 కుటుంబాలు ఉంటాయి. ఊరి చెరువు క్రింద 200 ఎకరాలు సాగులో ఉంది. ప్రధానంగా మెట్ట పంటలు పండుతాయి. ముఖ్యంగా పొగాకు, కంది, జొన్న పండిస్తారు. గ్రామంలో కొంతమందికి తోటలు ఉన్నాయి.

1987లో ఊరికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఊరికి 2, 3 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది. ప్రక్కగా లింగాల కొండ దాని కింద పాలెటి గంగమ్మ దేవాలయం. ప్రతి ఏడు జరిగే గంగమ్మ తిరునాళ్ళ చాలా ప్రసిద్ధి. ఈ రెండింటి మధ్య పాలేరు. ఇది కోటపాడు - అగ్రహారం మధ్య ప్రవహిస్తుంది.

మూలాలు[మార్చు]