Jump to content

చైతన్యం (2021 సినిమా)

వికీపీడియా నుండి
చైతన్యం
దర్శకత్వంసూర్య
రచనసూర్య
నిర్మాతమురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి
తారాగణంకౌటిల్య, యాషిక
సంగీతంఅర్జున్ రాము
నిర్మాణ
సంస్థ
జెఎమ్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లువన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
13 ఆగష్టు 2021 [1]
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చైతన్యం 2021లో విడుదలైన తెలుగు సినిమా. జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహించాడు. కౌటిల్య, యాషిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 6, 2021న విడుదల చేసి, సినిమా ఆగష్టు 13, 2021న విడుదలైంది.[2][3]

ప్రకాష్ (కౌటిల్య) గొప్పగా బ్రతకాలని కలలు కని దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అక్కడ సమస్యల వలయంలో చిక్కుకుని ఎన్నో ప్రయత్నాలు కష్టాల తర్వాత పూర్తిగా మారిపోయి, ఇండియాకి తిరిగి వస్తాడు. మరోపక్క మధు (యాషిక) విజయ్ అనే అబ్బాయి చేతిలో మోసపోయి కొన్ని కారణాల చేత, కొన్ని రోజుల పాటు ప్రకాష్ ఇంట్లో ఉండాల్సి వస్తోంది. ప్రకాష్ స్వదేశానికి తిరిగి వచ్చాక జీవితంలో ఎదగడానికి ఏమి చేశాడు ? అనేదే సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • కౌటిల్య
  • యాషిక
  • సుందరం
  • రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి
  • రామారావు
  • శివప్రసాద్
  • విష్ణుప్రియ
  • శేఖర్
  • రెడ్డయ్య
  • ప్రియా
  • ధ్రువ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జెఎమ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సూర్య
  • స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : మీరాఖ్హ్
  • సంగీతం: అర్జున్ రాము


మూలాలు

[మార్చు]
  1. The Times of India (12 August 2021). "Chaitanyam Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 14 August 2021. Retrieved 15 August 2021.
  2. Sakshi (11 August 2021). "ఈ నెల 13న విడుదలవుతున్న 'చైతన్యం'". Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  3. Andrajyothy. "'పథకాల పేరుతో ప్రజలను ఎలా చేతకాని వాళ్లని చేస్తున్నారో చూపించాం'". Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  4. News18 Telugu (11 August 2021). "Chaitanyam movie: ఆగస్ట్ 13న విడుదల కానున్న 'చైతన్యం'." Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)