ఛాయా మొఘల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛాయా మొఘల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఛాయా మొఘల్
పుట్టిన తేదీ (1986-06-20) 1986 జూన్ 20 (వయసు 37)
భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయ ఫాస్ట్ /మీడియం బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 1)2018 7 జులై - నెదర్లాండ్స్ తో
చివరి T20I2023 ఏప్రిల్ 25 - యుగాండా తో
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 48
చేసిన పరుగులు 430
బ్యాటింగు సగటు 13.43
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 36
వేసిన బంతులు 844
వికెట్లు 31
బౌలింగు సగటు 19.51
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 16/4
మూలం: Cricinfo, 13 నవంబర్ 2022

ఛాయా మొఘల్ భారతీయ సంతతికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1986 జూన్ 20 న భారతదేశంలో జన్మించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతుంది. ఆమె ప్రస్తుత జాతీయ జట్టు కెప్టెన్.[1]

మొఘల్ జమ్మూ కాశ్మీర్‌లో పెరిగింది. ఆమె వృత్తి రీత్యా కిండర్ గార్టెన్ పాఠశాల ఉపాధ్యాయురాలు, 2009లో UAEకి వెళ్లింది. 2022 జనవరి నాటికి ఆమె దుబాయ్‌లోని అంబాసిడర్ స్కూల్‌లో బోధించుతూఉంది.[2] కానీ ఆటను వదల లేదు.

యుఎఇ మహిళా క్రికెట్ జట్టు గురించి విన్న వెంటనే, షార్జా వెళ్లి అక్కడ మహ్మద్ హైదర్‌ దగ్గర శిక్షణ తీసుకుంది. 2015లో, ఆమె UAE జట్టులో చేరింది. UAE కొరకు T20Iలో 'చమనీ సెనెవిరత్న' తో కలిసి ఉమ్మడి అత్యధిక వికెట్లు (28 వికెట్లు) తీసుకుంది.[3]

క్రికెట్ కెరీర్[మార్చు]

ఆమె ఆల్ రౌండర్. కుడి చేతి బ్యాట్స్ వుమన్, కుడిచేతి మీడియం బౌలింగ్. యుఎఇకి వెళ్లడానికి ముందు, మొఘల్ భారత దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది.[2] 2018 జూలైలో, ఆమె 2018 ICC మహిళల ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఆడడం కోసం UAE జట్టులో ఎంపికైంది.[4] ఆమె 2018 జూలై 7న తన మొదటి WT20I ఆట ఆడింది.[1]

ఛాయా మొఘల్ 2021 ICC మహిళల T20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్‌లో UAEకి నాయకత్వం వహించింది. ఆమె జట్టు 2022 ICC మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌కు అజేయంగా దారి తీసింది.[5] 2022 సెప్టెంబరులో UAE ఆతిథ్యమిచ్చిన క్వాలిఫయర్‌కు ఆమె కెప్టెన్సీని కొనసాగించింది. 2022 అక్టోబరులో, ఆమె మహిళల ట్వంటీ20 ఆసియా కప్‌లో UAE జట్టుకు నాయకత్వం వహించింది.[6]

ప్రస్తావనలు[మార్చు]

  1. 1.0 1.1 "Chaya Mughal". ESPN Cricinfo. Retrieved 7 July 2018.
  2. 2.0 2.1 Bhattacharyya, Gautam (5 January 2022). "Meet Chaya Mughal: from Jammu & Kashmir to UAE women's cricket captain". Gulf News.
  3. "Women's T20 Asia Cup: Who is Chaya Mughal, captain of UAE". SPORTSTAR. 2 October 2022. Retrieved 19 August 2023.
  4. "ICC announces umpire and referee appointments for ICC Women's World Twenty20 Qualifier 2018". International Cricket Council. Retrieved 27 June 2018.
  5. "'A star is born': Meet Chaya Mughal, a teacher from Jammu and Kashmir who leads UAE national women's cricket team". The Kashmir Monitor. 22 December 2021. Retrieved 27 April 2022.
  6. "ECB announces team to represent UAE at upcoming T20I Women's quadrangular". Emirates Cricket Board. Retrieved 9 September 2022.

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

ఛాయా మొఘల్ at ESPNcricinfo