జంగుబాయి పుణ్యక్షేత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జంగుబాయి ఆదివాసుల దేవత , కుంరం భీం జిల్లా కేరమెరి మండలం కొటాపరందోలి బిడ్ వార్ సమీపంలో తెలంగాణ , మహరాష్ట్ర సరిహద్దులో అడవి ప్రాంతంలో జంగుబాయి పుణ్యక్షేత్రం ఉంది.[1] [2] [3] [4] [5]

జంగుబాయి పుణ్యక్షేత్రం
జంగుబాయి
జంగుబాయి
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:కుంరం భీం ఆసిఫాబాద్
ప్రదేశం:కోటాపరందోలి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:జంగుబాయి

చరిత్ర[మార్చు]

పుష్యమాసం లో నెల రోజులపాటు ఆదివాసీలు నియమ నిష్ఠలతో ఉంటు జంగుబాయిని దర్శించుకుంటారు. జంగుబాయి ఒక వెలుగు,చీక‌ట్లను పార‌ద్రోలే దీపాన్ని జంగూబాయి దేవ‌త రూపంగా ఆదివాసులు ఆరాధిస్తారు. దట్టమైన అడవిలో ఓ టోప్లకస న‌ది ప‌క్కన ఎత్తైన కొండ మ‌ధ్యలోని గుహ‌ లోప‌ల కాంతులు వెద‌జ‌ల్లే దీప‌మే జంగుబాయి దేవ‌త‌. ఆ దీపం ఉంచిన స్థల‌మే జంగూబాయి మహాల్.[6][7]

జంగుబాయి దర్శనము[మార్చు]

జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల (నాలుగు దిక్కులు) దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు.డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పునకాలతో సూపరీలు బయలుదేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పేన్ ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమల గుళ్ళలను పెట్టి మొక్కులు చెల్లించి, అవ్వల్ పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ మూడు స్థలాల్లో పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటారు. అవ్వల్ పేన్ పూజ దర్శనం తర్వాత అక్కడ నుండి జంగుబాయి మహాళ్ వద్దకు చేరుకొని, రాయితాడ్ పేన్ కు పూజలు చేసి జంగుబాయి గుహ‌పైకి ఎక్కి గుహ లోపల జంగుబాయి దీపాన్ని ద‌ర్శించుకుంటారు. జంగుబాయి పూజల అనంతరం అందరు కలిసి తమ తమ కుటుంబాలతో సందడిగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తరువాత అందరు కలిసి విందు చేస్తారు. స్వచ్చమైన నువ్వుల నూనే ఇప్ప నూనేలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు గారేలు, బురేలు చేస్తారు.[8] [9] [10] [11]

నియమ నిబంధనలు[మార్చు]

పుష్య‌మాసంలో నెలవంక క‌నిపించిన రోజు నుండి పుస్య అమ‌వాస్య వ‌ర‌కు ఆదివాసులు ప‌విత్రమాసంగా భావిస్తుంటారు. తమ ఇల్లు, వాకిలి అంత శుభ్రం చేసి ఆవుపేడ‌తో అలుకు చ‌ల్లి ప‌విత్రంగా ఉంచుకుంటారు. నెలరోజుల పాటు ఆదివాసీలు తప్ప ఎవరిళ్ళలోను కనీసం మంచినీళ్ళు కూడా తాగరు.. నెల రోజుల వరకు పాద‌రక్షలు ధ‌రించ‌రు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో కూడా అవి లేకుండా చూసుకుంటారు. నిషాపాని మ‌ద్యానికి దూరంగా ఉంటారు. జంగుబాయిని కొలిచే భ‌క్తులు బ‌య‌ట భోజ‌నాలు చేయ‌రు. హోటల్ లో భోజ‌నం, తాగునీరు కూడా ముట్టరు. ఇంటివంట‌కే ప‌రిమితం అవుతారు. జంగూబాయి వ‌ద్దకు వ‌చ్చే భ‌క్తులు చాలా మంది కాలిన‌డ‌క‌నే వ‌స్తుంటారు. దూర ప్రాంతాల వారు వాహనాల్లో వస్తుంటారు. ఈ జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా ఎనిమిది గోత్రాల వారు క‌టోడాలు ప్రక‌టించిన రోజున నియ‌మ‌నిష్టల‌తో జంగుబాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధ‌న కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజ‌ర‌య్యే భ‌క్తుల‌కు ముందుండి సంప్రదాయ పూజ‌లు చేయిస్తారు. భ‌క్తులు న‌డుచుకుంటూ వ‌చ్చే స‌మ‌యంలో ఎక్కడైనా ఆగాల్సి వ‌స్తే పూజా సామ‌గ్రి ఉన్న గంప‌ను ఎక్కడ‌ప‌డితే అక్కడ పెట్టకుండా నేల‌పై మూడు రాళ్లను పేర్చి నీటితో శుభ్రం చేసి గో మూత్రం చ‌ల్లిన త‌ర్వాతే అక్కడ ఉంచుతారు. తమ తమ గ్రామాల నుండి సైతం వారి వారి కుటుంబ దైవాలను జంగుబాయి సన్నిధిలోకి తిసుకొచ్చి గంగ స్నానం చేయించి తమ సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహిస్తారు.[12] [13]

గోత్రాలు-పని విభజన[మార్చు]

జంగుబాయి జాత‌ర స‌మ‌యంలో దేవ‌త ర‌క్షణ కోసం ఎనిమిది గోత్రాల‌కు సంబంధించిన తెగ‌లు ప‌నిచేస్తాయి. గోత్రాన్ని బ‌ట్టి ప‌ని విభ‌జ‌న చేసుకుంటూ ముందుకు సాగుతారు.

1.త్రుమం గోత్రం వారు పెద్ద ఇంటి వారు. వీరికి ఆ దేవ‌త ముందు గాధీ పూజ చేసే హ‌క్కు ఉంటుంది.

2. మ‌ర‌ప గోత్రం వారు ప్రధాన పూజారులుగా ఉంటారు.

3.కొడప గోత్రం వారు కారోబారీలుగా ఉంటారు. అంటే గ్రామ పంచాయ‌తీ పెద్దగా వ్యవ‌హ‌రిస్తారు.

4. వేట్టి గోత్రం వారు ప‌టేళ్ల లాగా వ్యవ‌హ‌రిస్తారు.

5.స‌లాం గోత్రం వారు దేవ‌త‌కి చిట్టచివ‌రి పూజ నిర్వహిస్తారు. శుద్ధి కార్యక్రమం కూడా వారే నిర్వహిస్తారు.

6.హెరేకుమ్ర గోత్రం వారు కూడా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

7.రాయ్‌సిడాం గోత్రం వారు దేవ‌త‌కి జ‌న్నె విడిచిన ప‌శువుల‌ను మేపుతూ వాటి సంఖ్యను పెంచేలా చూసుకుంటారు.

8. మండాడి గోత్రం వారు దేవ‌స్థానానికి వెళ్లి నాలుగు శాఖ‌ల వారికి కండువాలు, శాలువాలు బ‌హుక‌రించాలి. ఈ ఎనిమిది గోత్రాల వారు వారి దేవుళ్ళకు సంభందించి వారిని సార్ పేన్ స‌గ అని కూడా అంటారు.

జంగుబాయి దీక్షలు[మార్చు]

జంగుబాయి దీక్షల్లో పురుషులు (పసుపు రంగు ) ,స్త్రీలు (తెల్లని వస్త్రాలు) ప్రత్యేకమైన దుస్తులు ధరించి నెల రోజులు నియమ నిష్ఠలతో ఉంటారు.[14]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2024-01-23). "Minister Seethakka | జంగుబాయి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క". www.ntnews.com. Retrieved 2024-03-29.
  2. "23న జంగుబాయి క్షేత్రానికి మంత్రి సీతక్క". Sakshi. 2024-01-22. Retrieved 2024-03-29.
  3. Today, Telangana (2022-01-03). "Asifabad: Adivasis to celebrate Jangubai Jatara from January 4". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-03-29.
  4. ABN (2022-12-30). "జంగుబాయి క్షేత్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పూజలు". Andhrajyothy Telugu News. Retrieved 2024-03-29.
  5. telugu, NT News (2024-01-23). "Minister Seethakka | జంగుబాయి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క". www.ntnews.com. Retrieved 2024-03-29.
  6. Desam, A. B. P. "ఛలో జంగుబాయి జాతర, నెలరోజులు ఇక సందడే - ఏంటి గొప్పతనం?". ABP Telugu. Retrieved 2024-04-01.
  7. telugu, NT News (2024-01-24). "అడవి ఒడిలో ఆరాధ్య దైవం". www.ntnews.com. Retrieved 2024-04-01.
  8. telugu, NT News (2023-01-07). "వైభవంగా జంగుబాయి మహాపూజ". www.ntnews.com. Retrieved 2024-03-29.
  9. kranthi (2024-01-24). "జంగుబాయి జాతరకు సర్వం సిద్ధం..!". tnewstelugu.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-29.
  10. "● నేటి నుంచి జంగుబాయి ఉత్సవాలు.. ● తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పుణ్యక్షేత్రం ● ఆరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీల ఆగమనం ● నేనెలరోజుల పాటు పూజలు జాతర ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ నిర్వాహకులు". Sakshi. 2024-01-14. Retrieved 2024-03-29.
  11. Today, Telangana (2022-01-03). "Asifabad: Adivasis to celebrate Jangubai Jatara from January 4". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-01.
  12. Desam, A. B. P. "దీపమే ఆదివాసీలకు ఆరాధ్య దైవం - అంతరాష్ట్ర సరిహద్దులో జంగుబాయి జాతర". ABP Telugu. Retrieved 2024-04-01.
  13. Velugu, V6 (2022-01-07). "అడవితల్లి జాతర". V6 Velugu. Retrieved 2024-04-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  14. telugu, NT News (2022-01-15). "గిరి'జన'జాతరలు". www.ntnews.com. Retrieved 2024-04-01.