జడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Inverted French Braid

జడ, జెడ లేదా జట, తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది స్త్రీలు ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా పిల్లలు రెండు జడలు వేసుకుంటారు. యోగుల శిరోజాలు జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో జట, జడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1]

ఆభరణాలు

[మార్చు]

జడకు ప్రత్యేకంగా చేసుకొనే అలంకరణలలో ముఖ్యమైనవి ఆభరణాలు. వీటిలో జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.

మూలాలు

[మార్చు]
  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం జడ పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2009-12-29.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జడ&oldid=3483817" నుండి వెలికితీశారు