జన్యు మార్పిడి ఆహారపదార్ధములు
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(ఏప్రిల్ 2017) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
జన్యు మార్పిడి ఆహారపదార్ధములు , Genitically Modified foods
[మార్చు]పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.[1]
జన్యు మార్పిడి ఆహారపదార్ధములు, Genitically Modified foods : ఒకప్పుడు చిరుతిళ్లంటే-అమ్మ ఇంట్లో తయారుచేసినవే. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు. కానీ పిల్లల కోసం విక్రయిస్తున్న ఆహార పదార్ధాలు ఎంతమేరకు సురక్షితమైనవో ఏనాడైనా మనం ఆలోచిస్తున్నామా? రోజుకో కొత్త బ్రాండ్ పేరుతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. దిన, వార పత్రికలు, టెలివిజన్లలో అద్భుతమైన ప్రకటనలు ఇవ్వడం ద్వారా అతి సులువుగా ప్రజల మనసులో ఈ ఉత్పత్తులు స్థానం సంపాదించుకుంటున్నాయి. ఫలితంగా సహజ ఆహారానికి ప్రజలు, ముఖ్యంగా పిల్లలు దూరమైపోతూ ప్యాకేజ్డ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీనితో స్థూలకాయం పిల్లల విషయంలో కూడా ఒక సమస్యగా మారుతోంది. ఇది ఇప్పుడు మనదేశంలో కూడా ఒక ప్రధానమైన సమస్యగా గుర్తింపు పొందుతోంది. జెనటిక్ ఇంజనీరింగ్ అంటే? ఇటీవల కాలంలో ప్రాచుర్యాన్ని పొందిన సరికొత్త టెక్నాలజీ ఇది. ఒక జాతి నుంచి మరొక జాతికి జన్యువులను మార్పిడి చేసే ప్రక్రియ ఇది. ఈ విధానం ద్వారా జంతువు నుంచి మొక్కలకు కూడా జన్యువులను మార్చవచ్చు. జన్యు మార్పిడి ద్వారా కొత్తగా సృష్టించిన జెనటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్ (జిఎంఓ) తన కొత్త లక్షణాలను తన సంతతికి అందజేస్తుంది. జెనటిక్ ఇంజనీరింగ్ అభివృద్ధికి, వ్యాప్తికి ప్రధానంగా చేయూత నిస్తున్నది కార్పొరేట్ రంగమే. ఇండస్ట్రియల్ అగ్రికల్చర్‌లో ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతిక విధానం ద్వారా పండించిన ఆహారాన్ని 'జెనటికల్లీ మోడిఫైడ్ లేదా జి.ఎం. ఫుడ్'గా పేర్కొంటున్నారు. జన్యు మార్పిడి ఆహార పంటలు మానవు నిపై దుష్పరిమాణాలు చూపుతాయని పీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె . నిమ్మయ్య తెలిపారు. జన్యు ఆహారం విషతుల్యం? ప్రకృతి ప్రసాదించిన వనరులన్నీ ప్రజలు, సమస్త జీవకోటి సుఖ సంతో షాలతో జీవించడానికే కదా! కానీ సైన్స్ పేరుతో కొన్ని విదేశీ కంపెనీలు కోట్లాది రూపాయలు లాభం సంపాదించడానికి నడుం కట్టాయి. ప్రజలను హతమార్చి అయినా సరే తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తు న్నాయి. ఇందులో భాగంగా జన్యు మార్పిడి ఆహారపదార్థాలను మార్కెట్లో ప్రవేశపెడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ జన్యు మార్పిడి పంటలుఎవరికీ అంతుబట్టని రోగాలను వాపింపచేస్తాయని అమెరి కాకు చెందిన రెస్పాన్సిబుల్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు జెఫ్రీయం స్మిత్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని సాంకేతిక పరిజ్ఞానం పేరుతో విలయతాండవం చేస్తున్న కంపెనీలను, వాటిని ప్రోత్సహించే వారిని వ్యతిరేకించాలి. ముఖ్యంగా సామాన్యులు అత్యధికంగా తినే బిటి వంకాయలను పూర్తిగా నిషేధించాలి. -- జన్యుమార్పిడి ఆహారము వలన ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో ఇంకా నిర్ధారణ కాలేదు . ఆరోగ్యము పాడవుతందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఈవిషములో పరిశోధనలు జరగాల్సి ఉంది . అభివృద్ధిని ఆశ్వాధించాలి కాని అందుకు ఆరోగ్యము ఫణముగా పెట్టకూడదు . భారతదేశంలో తిండి గింజలకు కొరత లేదని అనవసరమైన టమాట, బిటి వంకాయ, విటమిన్ ఏ పేరుతో గోల్డేన్ రైస్ పేరుతో ప్రవేశ పెట్టుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు . జన్యుమార్పిడి ఎలా ? : అసలు జన్యు పరంగా మార్పిడి చెందిన ఉత్పత్తులు (జిఎం), అలాగే బాసిల్లస్ తురుంజెనిసెస్ (బీటీ) ఉత్పత్తులన్నవి ఎంత వరకూ ఆరోగ్య కరమైనవి అన్నది సమాధానం లేని ప్రశ్న . సోయాబిన్, మొక్కజొన్న, ప్రత్తి తదితర ఉత్పత్తులను ఈ రకమైన జన్యుమార్పిడి ద్వారా దిగుబడిని పెంచుకునే విధంగా ఎక్కువ పోషక విలువలు కలిగేలా శాస్తవ్రేత్తలు మార్పులు చేయగలిగారు. అంటే ఈ ఉత్పత్తుల జన్యుమూలం డిఎన్‌ఏలే కొన్ని మార్పులు చేయడం ద్వారా వీటి ఉత్పాదకతను, దిగుబడిని పెంచే ప్రయత్నం చేసారు. అందుకే ఇవన్నీ కూడా జన్యుపరమైన మార్పులకు లోనైన ఉత్పత్తులుగా, పంటలుగా మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా జన్యుపరమైన మార్పిడుల ఫలితంగా మార్కెట్లోకి వస్తున్న ప్రతి ఉత్పత్తులను జిఎం ఉత్పత్తులుగానే పేర్కొంటారు. తాజాగా కొన్ని నేళ్ళ క్రితం దేశంలో తీవ్ర వివాదాన్ని సృష్టించిన బీటీ కాటన్ సమస్య సమసి పోయిందనుకుంటే ఇప్పుడు బీటీ వంకాయ దాన్ని మించిన స్థాయిలో అలజడులకు కారణమైంది. సాంకేతికంగా చెప్పాలంటే నేలల్లో వుండే బాసిల్లస్ తురుంజెనిసిస్ అనే బాక్టీరియాను ప్రత్తి, వంకాయల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా వాటి ఆకారాన్ని, దిగుబడిని గణనీయంగా పెంచవచ్చనేది ఈ ప్రయత్నాల్లో ముఖ్య ఉద్దేశం.
ప్రతి జీవీ మౌలిక లక్షణాలు అన్నీ కూడా డిఎన్‌ఏలో నిక్షిప్తమైవుంటాయి. ప్రతి కణ మూలంలోనూ ఈ డిఎన్‌ఏ వుంటుంది. జన్యు పటంగా మనం పేర్కొనే డిఎన్‌ఏను అర్ధం చేసుకోవడం లేదా గుర్తించడం అన్నది ఇటీవలే మానవుడికి సాధ్యమైంది. ఈ డిఎన్‌ఏలో ఉండే జన్యువులే ఒక జీవి శరీరానికి అవసరమైన ప్రక్రియను కొనసాగించడానికి దోహదం చేస్తాయి. ప్రొటీన్లు ఉత్పత్తి చేయాలన్నా, రసాయన ప్రక్రియను నియంత్రించాలన్నా అందుకు ప్రధాన ఆధారం జన్యువులే. అసలు ఏ జన్యువు ఏరకమైన విధులను ఒక జీవి శరీరంలో నిర్వహిస్తుందన్నదిన ఇప్పటికే సోదాహరణగా శాస్తవ్రేత్తలు రుజువు చేసారు. ఇప్పుడు బాసిల్లస్ తురుంజెనిసిస్‌పై పరిశోధలు జరిపిన శాస్తవ్రేత్తలు అందులో ఒక రకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువువుందని గుర్తించారు. ఆ జన్యువు కొన్ని రకాల చీడపురుగులకు ప్రాణాంతకమవుతుందనే విషయాన్ని గుర్తించారు. ఈరకమైన పురుగులు ప్రత్తి, వంకాయ పంటలను ప్రధానంగా నాశనం చేయడంతో వాటిని వదిలించుకునే ఉద్దేశంతోనే బీటీని ఈ పంటలకు విస్తరింప చేయాలని సంకల్పించారు. ఈ బాసిల్లస్ తురంజెనిసిస్ అనే బాక్టీరియా నుంచి జన్యువును తొలంగించి వాటిని ప్రత్తిలేదా వంకాయ మొక్కల డిఎన్‌ఏలో చేర్చడం ద్వారా వాటి పోషక విలువలను పెంచడంతో పాటు దిగుబడిని ఇనుమడించవచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ రకంగా జన్యుపరంగా సవరించిన కణం ఆ మొక్కలో పెరుగుతుంది. దాని విత్తనాలు కూడా పంటలను ధ్వంసం చేసే చీడలను నిరోధించగలికే శక్తిని సంతరించుకుంది. ఈ మొక్కలను తినడానికి ప్రయత్నించే చీడపురుగులు అందులోని ప్రతికూల బాక్టీరియా సోకి మరణిస్తాయి. ఆ విధంగా పంటకు పంటా వస్తుంది. దిగుబడికి దిగుబడీ వుంటుంది. లాభానికి లాభం వస్తుంది. ఇవీ బీటీ వల్ల, జిఎం ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలంటూ అంతర్జాతీయ ఉత్పాతదక సంస్థలు, బహుళజాతి సంస్థలు నమ్మబలుకుతున్నాయి. అలాగే సంప్రదాయకంగా మనం ఉపయోగించే బంగాళా దుంపలు మరింత తియ్యగా మారడానికి, బియ్యంలో విటమిన్ ఎ శాతం పెరగడానికి ఈ జన్యుపరమైన మార్పులే దోహదం చేస్తాయని చెబుతున్నారు. 1996లో జిఎం ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేక దేశాలు ఈ పద్ధతినే అవలంబిస్తూ తన ఆహార, అవసరాలను తీర్చుకుంటున్నాయి. ప్రస్తుతం 26 దేశాల్లో జిఎం విత్తనాల వినియోగం గణనీయంగా పెరిగింది. దాదాపు 125 మిలియన్ హెక్టార్ల నెలలో జిఎం పంటలే పండుతున్నాయంటే పరిస్థితి ఎంతగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సాగులో ఉన్న 150 బియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 8 శాతం ఈ జిఎం పంటలకే పరిమమైందన్న మాట. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికాల్లోని అనేక దేశాల్లో ఎక్కువగా ఈ రకమైన పంటలపైనే ఆధారపడ్టాయి. సోయాబిన్, మొక్కజొన్న వంటివి ఇక్కడ వినియోగంలోకి వచ్చిన పంటలు.
సగానికి పైగా జిఎం ఉత్పత్తులు అమెరికాలోనే వుండడం గమనార్హం. ఐరోపా యూనియన్‌లో అయితే కేవలం ఏడు దేశాలు మాత్రమే జిఎం ఉత్పత్తులను అనుమతించాయి. అనియంత్రిత వ్యవసాయ పద్ధతులపై ఐరోపా యూనియన్ నిషేధం కూడా విధించింది. ఆఫ్రికాలో కేవలం మూడు దేశాలు, భారత్, చైనా సహా ఆసియాలో మూడు దేశాలు జిఎం పంటలను అనుమతించాయి. భారత్ విషయానికి వస్తే 7.6 మిలియన్ హెక్టార్ల పంట పొలాలు జిఎం పరిధిలోకి వచ్చాయి. అంటే ఇక్కడ ఎక్కువగా జిఎం పంటలనే పండిస్తున్నారు. అయితే బీటీ కాటన్‌తోపోలిస్తే బీటీ వంకాయకు సంబంధించి అనూహ్యరీతిలో ప్రతిస్పందన వచ్చింది. దీన్ని వాణిజ్యపరమైన వినియోగంలోకి తీసుకొస్తే ప్రమాదకరమన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడానికి వారాల తరబడి నిరసనలు, ప్రదర్శనలు చేయాల్సి వచ్చింది. బయోటెక్నాలజీని అనుమతించకూడదని ఎవరూ అనరు గానీ సరైన పరిశోధనలు లేకుండా అధ్యయనం లేకుండా బహుళజాతి సంస్థల ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా క్షమార్హం కాదు. విచక్షణ, వాస్తవికత అన్నది ఏ నిర్ణయానికైనా గీటురాయి కావాలి. బీటీ ప్రత్తి విషయంలో ఇంతగా నిరసనలు తలెత్తపోవడానికి కారణం అది ఆహార పంట కాకపోవడమే. కానీ వంకాయను కూడా వక్రంగా మార్చే ప్రయత్నం చేస్తే ఎవరూ సహించే పరిస్థితి వుండదు. బయోటెక్నాలజీ ప్రజలకు ఉపయుక్తం కావాలి. అప్పుడే దానికి సార్థకత. జిఎమ్ పంటలను పరీక్షించే సదుపాయాలు లేవు : జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే మేలు లేదా కీడును అంచనా వేసేందుకు వీలుగా జీవసురక్షిత పరీక్షలు నిర్వహించడానికి వీలైన సదుపాయాలు దాదాపు వంద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేవని అమెరికాకు చెందిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. మానవుల ఆరోగ్యం, జీవ వైవిధ్యంపై కలిగించే దుష్పరిణామాలను అంచనా వేయడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం ఆయా దేశాల్లో అందుబాటులో లేదని వారు స్పష్టం చేస్తున్నారు. చాలా దేశాలు జిఎం పంటలు పండించడానికి ముందుకు వస్తున్నప్పటికీ ఈ రంగంలో అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగుతున్నదని వారు పేర్కొన్నారు. లాభాలు, ఖర్చులు, ప్రభావాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వివియోగించడం వంటి వాటిల్లో ఆయా దేశాలు తగిన శ్రద్ధ వహించడం లేదని వారు చెబుతున్నారు. ఆయా దేశాలు సరళమైన, సమర్ధవంతమైన జీవ వైవిధ్య నియంత్రణ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా వున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. బిటి వంకాయపై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువరించడం గమనార్హం. మూలము :బి. రాజేశ్వరప్రసాద్ -- ఆంధ్రభూమి దినపత్రిక
మూలాలు
[మార్చు]- ↑ "Population Density Information and Statistics" (PDF). webarchive.nationalarchives.gov.uk. Retrieved 2021-08-31.