జమ్ములపాలెం(టంగుటూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంటంగుటూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523274 Edit this on Wikidata


"జమ్ములపాలెం(టంగుటూరు)" ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన [1] పిన్ కోడ్ నం. 523274., యస్.టి.డీ కోడ్=08592.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గురుమాత పంచముఖేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

కార్తీకమాసంలో ఒక్క రోజైనా శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు హరిస్తాయని శాస్త్రాలు చెప్పుచున్నాయి. అయితే 1,116 శివలింగాలకు అభిషేకం చేసే భాగ్యం వస్తే ఆ భక్తుల జన్మ ధన్యమైనట్లే..... ఈ మహాక్రతువు ఈ ఆలయంలో నిత్యం జరుగుచున్నది.

ఈ గ్రామములో 1999,జనవరి-24న పాదర్తి వెంకటశేషుమాంబ, పేరిశెట్టిన్ రెలిజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, 1,116 శివలింగాలను ప్రతిష్ఠించారు. ప్రతి శివలింగానికీ, పంచలోహ నాగాభరణం అలంకరించారు. శివలింగాల మధ్యలో 108 శక్తిపీఠాలను ఏర్పాటుచేసి, మధ్య భాగంలో పంచముఖేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఒక్కసారి ఓం నమశ్శివాయ అనే పంచాక్ష్రీ మంత్రాన్ని జపించినయెడల, 1,116 సార్లు జపించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

కార్తీకమాసంలో ప్రతి సోమవారం, శివరాత్రి, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజులలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించెదరు. ఆ సమయంలో భక్తులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం పొందెదరు. అంతేగాకుండా కార్తీకమాసంలో ఈ ఆలయంలో, మహిళలు విశేషంగా దీపారాధన నిర్వహించెదరు. ప్రతి మాస శివరాత్రినాడు, రాత్రికి ఏకాదశ రుద్రాభిషేకం, రజత బిల్వాలతో అష్టోత్తర శతనామావావళి నిర్వహించెదరు.

ఈ ఆలయానికి ప్రతి నిత్యం జిల్లా నలుమూలలనుండి భక్తులు విశేషంగా తరలి వచ్చి, ఆలయంలో కొలువుదీరిన పంచముఖేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి నిత్యం ఈ ఆలయం ఓం నమశ్శివాయ, హరహర మహాదేవ, శంభోశంకర నినాదాలతో మార్మోగుతుంటుంది. [2]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామం కొండెపి శాసనసభ్యులు శ్రీ గుర్రాల వెంకటశేషు గారి స్వగ్రామం. 2002 లో మండల కార్యాలయం సమీపంలో, 250 మంది గ్రామస్తులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకుని అక్కడే ఉంటున్నా, ఇంతవరకు వీధిదీపాలు, రహదారులు ఏర్పాటుచేయలేదు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-15; 8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-3; 8వపేజీ.