జయవర్మ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రైల్వే బోర్డు సీఈవో చైర్ పర్సన్ గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఎంపిక చేయడం జరిగింది. ఈ బాధ్యతలు చేపట్టనున్న మహిళ జయవర్మ సిన్హా కావడం విశేషం[1]. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారిని అయిన జయవర్మ సిన్హా ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలుగా ఉన్నారు.2023 సెప్టెంబరు 1 నుండి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సీఈవో బాధ్యతలో కొనసాగనున్నారు.అలహాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థిని అయిన జయవర్మ సిన్హా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు[2].ఉత్తర, తూర్పు రైల్వే జోన్ లలో విధులు నిర్వహించారు.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హై కమిషన్ లో నాలుగేళ్ల పాటు రైల్వే సలహాదారుగా పనిచేశారు.ఆ సమయంలోనే కోల్ కతా నుండి ఢాకాకు మైత్రి ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది.ఇటీవల ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని వివరించడం ద్వారా వార్తల్లో నిలిచారు.వాస్తవానికి ఆమె 2023 అక్టోబరు 1 తేదీన పదవీ విరమణ చేయనున్నారు.అయితే పదవీకాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి విధుల్లో చేరనున్నారు[3].

  1. "Centre appoints Jaya Verma Sinha as first woman CEO, chairperson of Railway Board". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-08-31. Retrieved 2023-09-01.
  2. Bureau, The Hindu (2023-08-31). "Jaya Verma Sinha first woman to head the Railway Board". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-01.
  3. "Railway Board Gets First-Ever Woman CEO And Chairperson". NDTV.com. Retrieved 2023-09-01.