జల విజ్ఞాన సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ లోని రూర్కీ నందు రితేష్ ఆర్య సమావేశం @ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, ఐఐటి రూర్కీ, భారత ప్రభుత్వం

జాతీయ జలవిజ్ఞాన సంస్థానం (National Institute of Hydrology), కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక భారత ప్రభుత్వ సంఘము. ఇది 1978నుండి జలవిజ్ఞాన, జలవనరుల రంగాలలో దేశానికే తలమానికమైన సంస్థానంగా ఉన్నది. ఇది స్వయప్రతిపత్తి కలిగి, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖచే పోషింపబడుతూ, క్రింది లక్ష్యాలను కలిగియున్నది.

1. జలవిజ్ఞానానికి సంబంధించిన అన్ని వ్యవస్థీకృత, శాస్త్రీయ కార్యాలను ప్రారంభించడం, సహాయపడడం, ప్రచారం చేయడం, సమన్వయ పరచడం,

2. జలవిజ్ఞాన రంగానికి చెందిన వివిధ జాతీయ, విదేశీ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయుట

3. పై లక్ష్యాలకి సంబంధించిన పరిశోధన, సూచనా గ్రంథాలయాన్ని స్థాపించటం, పోషించటం, అందుకు సంబంధించిన గ్రంథాలు, విశ్లేషణలు, పత్రికలు, ఇతర ప్రచురణలను సేకరించటం.

4. ఏ లక్ష్యాలని సాధించుటకై ఈ సంస్థానం ఏర్పడిందో అట్టి లక్ష్యాలసాధనకు ఒక సంస్థగా అవసరమైనవి, ఆకస్మికంగా చేయవల్సినవి, పరిశీలించి జరుపవలసినవి అయినట్టి అన్ని పనులూ చేయటం

ఈ సంస్థానం ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ లోని రూర్కీ నందు ఉన్నది. దీనికి బెల్గాం, కాకినాడ, జమ్ము, సాగర్‌లలో ప్రాంతీయ కేంద్రాలు; పాట్నా, గువహతిలలో వరద నిర్వహణా పద్ధతుల అధ్యయన కేంద్రాలు ఉన్నవి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]