జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్
జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్ | |
---|---|
స్థానం | |
సమాచారం | |
రకం | ప్రభుత్వ |
Motto | ప్రజ్ఞానః బ్రహ్మ |
స్థాపన | 1987 |
ప్రిన్సిపాల్ | ఏం.వెంకటరమణ |
తరగతులు | 6 నుండి 12వ తరగతి |
విద్యార్ధుల సంఖ్య | 464 |
Campus size | 25-ఎకరం (100,000 మీ2) |
Campus type | గ్రామీణ |
పరీక్షల బోర్డు | సిబిఎస్ఈ |
Website | అధికారిక జాలస్థలి |
జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్(ఆంగ్లం:Jawahar Navodaya Vidyalaya, Hindi: जवाहर नवोदया विद्यलया) ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాల. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోసం స్థాపించబడింది. ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ నిర్వహిస్తుంది. భారతదేశంలో మొత్తం 661 నవోదయ విద్యాలయాలున్నాయి, వీటన్నింటిని నవోదయ విద్యాలయ సమితి నిర్వహిస్తోంది.
సంక్షిప్తంగా దీన్ని జేఎన్వీ నిజాంసాగర్ అని పిలుస్తారు.[1][2]
చరిత్ర
[మార్చు]1986లో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ నవోదయ విద్యాలయాలు చేయబడ్డాయి. వాటిల్లో ఒకటి ఈ జేఎన్వీ నిజాంసాగర్.
ప్రవేశ విధానం
[మార్చు]ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారు 10000 నుండి 20000 దరఖాస్తులు వస్తాయి, జేఎన్వీఎస్టి(JNVST) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది. తరగతులు 9 ఇంకా 11 లో కూడా పాఠశాలలో ఉన్న ఖాళీలను బట్టి దరఖాస్తుల ద్వారా ప్రవేశం ఉంటుంది.
విద్య, వసతి
[మార్చు]ఈ పాఠశాలలో 6 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు చదువు చెప్తారు. అన్ని తరగతుల వారికి సి.బి.యస్.ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది.ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో పాఠశాల భవనం, విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు వసతి గృహములు ఉన్నాయి. ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంది.