జాక్ ది రిప్పర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాక్ ద రిప్పర్
Drawing of a man with a pulled-up collar and pulled-down hat walking alone on a street watched by a group of well-dressed men behind him
1888 అక్టోబర్ 13 నాటి ద ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ నుంచి "తూర్పు కొసన విజిలెన్స్ కమిటీతో: ఒక అనుమానిత వ్యక్తి"
అలియాస్
  • "ద వైట్ చాపెల్ మర్డరర్"
  • "లీథల్ యాప్రాన్"
ప్రేరణతెలియదు (బహుశా సెక్సువల్ శాడిజం డిజార్డర్, ఉద్వేగ స్వభావం)

జాక్ ది రిప్పర్ 1888లో ఇంగ్లాండ్‌లోని లండన్‌లోని వెనుకబడిన వైట్‌చాపెల్ జిల్లాలోనూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సంచలనాత్మకంగా మారిన హత్యలు చేసిన గుర్తించబడని సీరియల్ కిల్లర్.[1] క్రిమినల్ కేసు ఫైళ్ళలోనూ, ఆనాటి పత్రికా కథనాల్లోనూ ఈ హంతకుడిని వైట్‌చాపెల్ మర్డరర్ అనీ, లెదర్ ఆప్రాన్ అనీ ప్రస్తావించారు.[2]

జాక్ ది రిప్పర్‌ చేశాడని ఆపాదించిన దాడులు సాధారణంగా లండన్ నగరపు తూర్పు కొసన ఉన్న మురికివాడలకు చెందిన వేశ్యలపై జరిగినవి. హంతకుడు వారి గొంతులు కోసి, పొత్తికడుపులను వికృతీకరించాడు. బాధితుల్లో కనీసం ముగ్గురి శరీరాల నుంచి అంతర్గత అవయవాలను తొలగించడం హంతకుడు కొంత శరీర నిర్మాణ సంబంధమైన లేదా శస్త్ర చికిత్సా పరిజ్ఞానం కలిగి ఉన్నాడన్న ఊహాగానాలకు దారితీసింది. 1888 సెప్టెంబరు, అక్టోబరులో హత్యలకు సంబంధించిన పుకార్లు తీవ్రమయ్యాయి. హంతకుడిగా భావించే వ్యక్తుల నుండి మీడియా సంస్థలకు, స్కాట్లాండ్ యార్డ్‌కు అనేక లేఖలు అందాయి.

మూలాలు

[మార్చు]
  1. Whittington-Egan, pp. 91–92
  2. The Crimes, London Metropolitan Police, archived from the original on 29 January 2017, retrieved 1 October 2014