Jump to content

జాజి కుటుంబము

వికీపీడియా నుండి
జాజి కుటుంబము

జాజి చెట్టు ముప్పది నలుబది అడుగు లెత్తు పెరుగును. ఇది ఏక లింగ పుష్పము.

ఆకులు
ఒంటరి చేరిక, లఘు పత్రములు చిన్నవి. సమాంచలము. సమ గోళాకారము. విషమ రేఖ పత్రము. ఆకు బిరుసుగా నుండును. కొన వాలము గలదు.
పుష్పమంజరి
మగ పుష్పములు తెలలు, ఏక లింగ పుష్పములు చిన్నవి. అసంపూర్ణము. స్త్రీ పుషమొక కణుపు సందున నొకటియె. ప్రతి పువ్వు వద్ద చేటిక గలదు.
పురుష పుష్పము
పుష్పవిగోళము
సంయుక్తము 3 చిన్న తెమ్మెలు, నీచము
కింజల్కములు
తొమ్మిది మొదలు పండ్రెండు వరకు అన్నియు గలసి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
పుష్పనికోశము
పైదాని వలె నుండును.
అండకోశ ముచ్చము. ఒకటియే స్త్రీ పత్రము, అండము ఒకటి గింజకు బీజ పుచ్ఛము గలదు., కీలము లేదు. కీలాగ్రములు రెండు.

ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో చిన్న చిన్నమొక్కలు లేవు. ఆకులు ఒంటరి చేరిక. సమాంచలము చిన్న ఏక 366

లింగ పుష్పములు. అండాశయమునందొక గదియు అందొక గింజయు ఉన్నాయి.

జాజి చెట్టు ఒండ్రు మట్తి నేలలలో బాగుగ పెరుగును. వీనికి ఇసుక నేలలు పనికి రావు. శీతల ప్రదేశములును కూడవు. గింజలను పాతిననే మొక్కలు మొలచును. ఈ చిన్న మొక్కల కనుదినము నీరు పోయు చుండవలెను. అవి రెండు మూడడుగులు ఎత్తు పెరిగిన తరువాత తీసి 25 - 30 అడుగులదూరములో పాతవలెను. వీని కంతగా ఎండ తగులనీయ కూడదు. తరుచుగా నీరు పోయు చుండ వలెను. చెట్లు పెద్దవై పుష్పించుట కారంభింపగానే, అవి ఆడ చెట్లో పోటు చెట్లో తెలిసి కొని, పది పండ్రెండు ఆడచెట్లు కొక మగ చెట్తు చొప్పునవుంచి మిగిలిన మగ చెట్లను కొట్టి వేయవచ్చును. వీనిన్ ఉండి పుప్పొడి ఆడ చెట్లను సులభముగా చేరుటకీమగ చెట్లను గాలి వచ్చెడు మార్గమందుంచ వలెను. ఏడవ ఏడు నుండియు కాయలు కాయుటకారంభించి ఏబది ఏండ్ల వరకు కాయ చుండును. ఒక్కొకచెట్టు నుండి బాగుగ కాయలు గాచు చుండినపుడు 200 కాయల వరకు వచ్చును.

కాయలు రాలగనే ఏరి తొక్క వలసి నిప్పుపై బెట్టి కొంచము వెచ్చ బెట్టుదురు. తరువాతి పురుగులు బట్టకుండ వానిని కొంచెము సున్నముతో రాచెదరు. కాయల పై చర్మమె జాపత్రి. దీని నొలవగనే ఎండలో పెట్టుదురు.

జాజి కాయలనుండియు జాపత్రి నుండియు కూడా చమురు దీసి దానిని సుగంధ ద్రవ్యములలో వాడు చున్నారు. దీనిని మనము తరుచుగ తాబూలమునందు వాడు చున్నాము. వీనిని ఔషధములలో కూడా వాడు చున్నారు.