జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
Appearance
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
ప్రారంభం | 1991 |
జరుపుకొనే రోజు | డిసెంబరు 14 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (ఆంగ్లం: National Energy Conservation Day)[1] ప్రతి సంవత్సరం డిసెంబరు 14వ తేదీన నిర్వహించబడుతుంది. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[2][3]
ప్రారంభం
[మార్చు]1991లో ఈ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రారంభించబడింది. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకురావడమేకాకుండా, ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంది.[4]
కార్యక్రమాలు
[మార్చు]- జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
- ఇంధన పరిరక్షణ అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.
- 1991వ సంవత్సరం నుండి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఇంధన పరిరక్షణకు కృషి చేసిన వివిధ పరిశ్రమలు కంపెనీల (ఇండస్ట్రియల్ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్ మాల్ బిల్డింగులకు, జోనల్ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్ పవర్ స్టేషన్లు)కు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు అందజేస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "World Energy Conservation Day 2021: History, Significance and Theme". News18 (in ఇంగ్లీష్). 2021-12-14. Retrieved 2021-12-14.
- ↑ ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
- ↑ ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
- ↑ India Today, Education Today (14 December 2016). "Go green this National Energy Conservation Day". Retrieved 14 December 2019.