జాతీయ కార్మిక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెప్టెంబర్ 17 న విశ్వకర్మ జయంతి సందర్భంగా జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం.[1]

Vishwakarmaji.png

విశ్వకర్మ[మార్చు]

విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సహజ జీవనానికి సంబంధించిన వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, తన అసామాన్య ప్రతిభతో అనేక రకాల పరికరాలను, యంత్రాలను రూపొందించాడు. విశ్వకర్మ రూపొందించిన పనిముట్లతో స్వీయ నిర్వహణతో సాగిన వృత్తులతో కూడిన ఆర్థిక వ్యవస్థ విలసిల్లింది. ప్రతి కుటుంబం తమదైన వృత్తి పరిశ్రమను నిర్వహించేది. వ్యవస్థీకృతమైన కుటుంబ పరిశ్రమల పరంపర విశ్వకర్మ నుంచే మొదలయ్యింది.[2]

శ్రమ పట్ల విశ్వకర్మ[మార్చు]

శ్రమకు సాధన తోడై, సమర్పణ భావం కూడా ఉంటే సమాజంలో సంపదలు వెల్లువెత్తుతాయి. శ్రమవలన సంపద సమకూరుతుంది. శ్రమయే యజ్ఞం. అనేవి విశ్వకర్మ యొక్క బోధనలు. మన దేశ సంపూర్ణ వికాస సాధనలో పనిచేస్తున్న వారంతా విశ్వకర్మ జయంతి నాడు కార్మిక దినోత్సవం జరుపుకుంటారు.[3]

మజ్దూర్ సంఘ్[మార్చు]

విశ్వకర్మ జయంతిని ‘‘జాతీయ కార్మిక దినోత్సవం’’గా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌జరుపుతోంది. జాతీయాభ్యుదయానికి బహుముఖ కృషి అవసరం అనే పునాదిపై కార్మికోద్యమాలను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ గుణాలకు ప్రతిరూపమైన భగవాన్‌ ‌విశ్వకర్మను ఆదర్శంగా భావిస్తోంది. విశ్వకర్మ జయంతి అయిన సెప్టెంబర్ 17న దేశమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. "లోకహితం సామాజిక సాంస్కృతిక మాస పత్రిక". 2020 September.
  2. "విశ్వకర్మ". britannica.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "విశ్వకర్మ". oxfordreference.{{cite web}}: CS1 maint: url-status (link)