జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఆగష్టు 8న న్యూ ఢిల్లీలో జరిగిన ‘బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించటం, పిల్లల విద్యా హక్కును పొందడం’ అనే జాతీయ సంప్రదింపుల చర్చా సదస్సులో జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) చైర్‌పర్సన్ డాక్టర్ శాంతా సిన్హా.

చట్టబద్ధమైన ఉత్తర్వు

[మార్చు]

ఈ చట్టంలో పొందుపరచబడిన కార్యనిర్వాహక కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి.
(ఎ) న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్ఠంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంలో ప్రదర్శించాలి.
(బి) బాలలు తమ హక్కులను అనుభవించే ప్రక్రియలో ఆటంక పరచే అన్ని కారణాలను పరీక్షించడంలో ఉగ్రవాదం, సాంఘిక హింస, హింసాత్మక చర్యలు, కలహాలు, ప్రకృతి వైపరీత్యాలకు, గృహ హింస, హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌, పిల్లల అక్రమ రహణా, అవమానకరంగా ప్రవర్తించడం, అనుచితంగా చూడడం, క్రూరంగా ప్రవర్తించడం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం వ్యభిచార గృహాలకు చేరవేయడం వంటి వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించడం.
(సి) ఆందోళనకు లోనైన, దుఃఖాన్ని కల్గివున్న, నిర్లక్ష్యానికి గురైన, కుటుంబ ఆసరాలేని, చెరసాలలో ఖైదుననుభవించే వారి పిల్లలకు సరియైన పరిష్కార సూచనలు ఇవ్వడం.
(డి) రక్షణ షరతులతో బాటు సంఘంలో అవగాహనను పెంచే రీతిలో సమాజంలోని అనేక రకాల విభాగాల వారికి బాలల హక్కుల గురించి తెలియజేసే జ్ఞానాన్ని కల్పించడం.
(ఇ) బాల నేరస్తుల గృహాలు, పిల్లల కొరకు వసతి కల్పించిన వసతి గృహాలు, సంస్ధలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో, ఏ ఇతర అధికారిక సంస్ద ఆధ్వర్యంలోను, సామాజిక సేవా సంస్ధల పరంగాను పనిచేస్తున్న వాటిని తనిఖీ చేయడం. చికిత్స, సంస్కరణ, రక్షణ నిమిత్తం చేర్చిన పిల్లలను చూసే తీరును గమనించడం.
(ఎఫ్‌) బాలల హక్కులను భంగం కల్గించే అంశాలను విచారణ చేసి, స్వయంగా తమంతట తాముగా ప్రకటించి, ప్రారంభక ఉత్తర్వులను ఇవ్వడంలోః
:ఎ. బాలల హక్కులను భంగం పర్చడం, నష్టపరచడం.
:బి. బాలల రక్షణ, అభివృద్ధికి సంబంధించిన చట్టాలను అమలు పరచక పోవడం.
:సి. పిల్లల సంక్షేమానికి ఉపశమింపచేయడానికి గల విధి విధానాల నిర్ణయాలను, మార్గదర్శక సూత్రాలను సూచనలను పాటించక పోవడం లేదా,
:డి. ఈ విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేయడం.
:జి. బాలల హక్కులపై సూచనలు, సలహాలు, ఒప్పందాలను అధ్యయనం చేసి, అంతర్జాతీయ విధానాల ద్వారా నిర్ణీత కాలవ్యవధులలో సమీక్షిస్తూ ప్రస్తుత వి ధానాలను, కార్యక్రమాలను ఇతర కార్యకలాపాలను పటిష్ఠంగా అమలు పరచడంలో పిల్లలపై గల చక్కటి శ్రద్ధతో సూచనలివ్వాలి.
:హెచ్‌. బాలల హక్కుల దృష్ట్యా ప్రస్తుతమున్న చట్టాలను విశ్లేషించి పాటింపు ఎంతవరకు ఉందో విచారణ చేసి, నివేదికలను పంపుతూ విధానము, సాధన పిల్లలపై ప్రభావితంగా జరుగుతుందో లేదో చూసి నూతన శాసనాలను ప్రతిపాదించడం.
:ఐ. పిల్లల అభిప్రాయల వెుర తీవ్రంగా స్పందించి, ఆ రీతిలో ప్రభుత్వ శాఖలు, సంస్ధలు పని చేయడం.
:జె. బాలల హక్కుల సమాచారాన్ని తయారు చెసి ప్రచారం చేయడం .
:కె. పిల్లలు సమాచారాన్ని సంకలనం జేసి విశ్లేషణ చేయడం.
:ఎల్‌. పిల్లల గురించి పనిచేసే వ్యక్తుల సమూహాలకు, ఉపాధ్యాయ శిక్షణలోను, పాఠశాల విద్యా ప్రణాళికలోను, పిల్లల హక్కుల విషయాన్ని చేర్చాలి.

పరిష్కార ఏర్పాటు - ఒప్పందం

[మార్చు]

కేంద్ర ప్రభుత్వం ద్వారా మూడేళ్ళపాటు పనిచేసే విధంగా కార్యనిర్వాహక సంఘ సభ్యులు క్రింది విధంగా ఉంటారు.
ఎ. పిల్లల సంక్షేమాభివృద్ధికి ప్రధానంగా పనిచేసిన ప్రసిద్ధమైన నిష్ణాతుడైన వ్యక్తి అధ్యక్షులుగా ఉంటారు.
బి. బాలలకు న్యాయాన్ని కల్పించడం, నిర్లక్ష్యానికి గురైన బాలలు, ప్రత్యేక బాలల యెడల శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను రూపుమాపే దిశలో పనిచేసిన, బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన చట్టాల గురించిన అవగాహన, సమగ్రత, సమర్ధత, అనుభవము, నిపుణత, నైతికత గల్గి, విద్య, శిశు ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, అభివృద్ధి శాఖల నుండి సమర్ధతగల ఆర్గురు సభ్యులు ఉంటారు.
సి. సంయుక్త కార్యదర్శి హోదాకు తక్కువగాని వ్యక్తి కార్యదర్శిగా ఉంటారు.

అధికారాలు

[మార్చు]

పౌర న్యాయ స్ధానానికి గల అన్ని అధికారాలు ఈ కమీషన్‌కు ఉంటాయి. వాటితో పాటు ప్రత్యేకంగా క్రింది అంశాలకు సంబంధించిన అధికారాలు ఉంటాయి.
ఎ. భారతదేశంలో ఎక్కడున్న వ్యక్తికైనా సమన్లు పంపి, వారిని రప్పించి, ప్రమాణం చేయించి పరీక్షించడం.
బి. కావలసిన దస్తావెజులు తెలుసుకోవడం, దాఖలు చేయడం.
సి. ప్రమాణ ప్రకటన (అఫిడవిట్‌ ) ద్వారా సాక్ష్యాన్ని స్వీకరించడం.
డి . ఏ న్యాయస్దానం లేదా కార్యాలయం నుంచైన ప్రభుత్వ రికార్టు లేదా నకలు పొందడం.
ఇ. దస్తావెజు సాక్ష్య పత్రాలను పరిశీలించడంలో కమీషన్లు జారీచేయడం.[1]

ఫిర్యాదు యంత్రాంగం

[మార్చు]

కమీషన్‌ ఉత్తర్వు ద్వారా బాలల హక్కులకు భంగం చేసే అన్ని ఫిర్యాదులను విచారణ జరపడం. బాలల హక్కులకు ఆటంకం కల్గించే తీవ్ర వ్యవహారంలో స్వయం ప్రేరిత ప్రకటన ద్వారా విచారణార్హత కలిగిన అంశంలో బాలలు వారి హక్కులను పొందలేకపోవడానికి గల కారణాలను పరిశీలించడం.
ఎ . కమీషనుకు ఫిర్యాదును రాజ్యాంగంలో గల 8వ షెడ్యూలు ప్రకారం ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు.
బి. ఇటువంటి ఫిర్యాదులపై ఎటువంటి రుసుము వేయబడదు.
సి. ఫిర్యాదుకి సంబంధించిన పూర్తి చిత్రణ అయ్యాక విషయాన్ని ప్రకటించవచ్చును.
డి. ప్రమాణ ప్రకటన ద్వారా ఇంకను కావలసిన సమాచారాన్ని పొందవచ్చును.

ఫిర్యాదు చెసే ముందు ఇవి తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలి.
ఎ. ఫిర్యాదు సుస్పష్టంగా కచ్చితంగా ఉండాలి అనామకంగా, నకిలీ పేర్లలో అస్పష్టంగా ఉండరాదు.
బి. ఇటువంటి ఫిర్యాదులపై ఎటువంటి రుసుము వేయబడదు.
సి. ఆస్తి హక్కులు, ఒప్పందపు బాధ్యతలు వంటి పౌర సంబంధిత వివాదాలను ఫిర్యాదు చెయకూడదు.
డి. ఉద్యోగ విషయాలను సంబంధించిన అంశాలు అయి ఉండకూడదు.
ఇ. చట్టం పరంగా ఏర్పరచబడిన ఏదేని కోర్టులో / ట్రిబ్యునల్‌లో పూర్తి కాని (పెండింగ్‌ ) విషయమై ఉండరాదు.
ఎఫ్‌. కమీషన ద్వారా ఇంతకు ముందు నిర్ణయించబడని విషయం.
జి. ఏ ఇతర కారణాలవల్లనైన కమిషన్‌ పరిధిలోనికి రానిది.

చైర్మన్లు

[మార్చు]
  1. శాంతా సిన్హా
  2. నూతన్ గుహ బిశ్వాస్
  3. ప్రియాంక్ కనుంగో

సంప్రదించవలసిన వివరాలు

[మార్చు]
పేరు హోదా ఫోన్‌ నంబరు ఇ- మెయిల్‌
శాంతాసిన్హా అధ్యక్షురాలు 011-23731583, 011-23731584 Shantha.sinha@nic.in
సంధ్యా బజాజ్‌ సభ్యురాలు 23724021 Sandhya.bajaj@nic.in
దీపాదీక్షిత్‌ సభ్యురాలు 23724022 Dixit.dipa@rediffmai.com
వి.సి. తివారి కార్యదర్శి 23724020 ms.ncper@nic.in

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]